Intestinal Worms : ప్రస్తుత కాలంలో కొంతమంది పిల్లలు చాలా నీరసంగా కనిపిస్తారు. ఇలాంటి వారు ఎక్కువగా ఆహారం తినకపోవడం.. చురుకుదనం తక్కువగా కనిపించడం వంటివి ఉంటాయి. ఈ సమస్యలకు ప్రధాన కారణాల్లో నులి పురుగులు (Intestinal Worms) కూడా ఒకటి. ఇవి పేగుల్లో నివసిస్తూ పిల్లలు తినే ఆహారంలోని పోషకాలను పీల్చుకుంటాయి. ఫలితంగా శారీరక, మానసిక ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా 1 నుంచి 14 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే పిల్లలో ఈ నులిపురుగులు ఎలా వ్యాపిస్తాయి? ఇవి ఉంటే ఎలాంటి లక్షణాలు ఉంటాయి?
నులి పురుగులు ఎలా వ్యాపిస్తాయి?
వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోవడం వల్ల నులి పురుగులు సులభంగా వ్యాపిస్తాయి. భోజనం చేసే ముందు, మరుగుదొడ్డి ఉపయోగించిన తర్వాత చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోకపోవడం, కలుషితమైన నీరు తాగడం, సరిగా కడగని కూరగాయలు, పండ్లు తినడం, బయట దుమ్ము, మట్టిలో చెప్పులు లేకుండా తిరగడం వంటి కారణాల వల్ల పురుగుల గుడ్లు శరీరంలోకి చేరి పేగుల్లో పెరుగుతాయి. ఒక పిల్లవాడి నుంచి మరొకరికి కూడా ఈ సమస్య వ్యాపించే అవకాశం ఉంటుంది.
పిల్లల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?
నులి పురుగులు పిల్లలు తీసుకునే ఆహారంలోని విటమిన్లు, ఐరన్, ప్రోటీన్లు వంటి కీలక పోషకాలను గ్రహించేస్తాయి. దీంతో శరీరానికి సరిపడా పోషకాలు అందక రక్తహీనత, బలహీనత, ఎదుగుదల మందగించడం వంటి సమస్యలు తలెత్తుతాయి. రోగనిరోధక శక్తి తగ్గి తరచూ జలుబు, జ్వరం, ఇతర ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. కొందరు పిల్లల్లో చదువుపై ఏకాగ్రత తగ్గడం, అలసట, బరువు పెరగకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
కనిపించే లక్షణాలు ఏమిటి?
నులి పురుగుల సమస్య ఉన్న పిల్లల్లో తరచూ కడుపునొప్పి, ఆకలి తగ్గడం లేదా కొన్నిసార్లు అసాధారణంగా ఎక్కువ ఆకలి వేయడం, బరువు తగ్గడం, వికారం, వాంతులు, విరేచనాలు లేదా మలబద్ధకం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ముఖ్యంగా రాత్రి సమయంలో మలద్వారం వద్ద తీవ్రమైన దురద ఉండటం నులి పురుగుల ప్రధాన లక్షణంగా భావిస్తారు. కొంతమంది పిల్లల్లో చిరాకు, నిద్రలేమి కూడా కనిపిస్తుంది.
చికిత్స ఎలా ఉంటుంది?
నులి పురుగుల నివారణకు వైద్యుల సలహా మేరకు ఆల్బెండజోల్ (Albendazole) వంటి డీ-వార్మింగ్ మాత్రలు ఇస్తారు. వయస్సు, బరువు ఆధారంగా మోతాదు నిర్ణయిస్తారు. స్వయంగా మందులు కొనుగోలు చేసి పిల్లలకు ఇవ్వకుండా తప్పనిసరిగా వైద్యుల సూచనలు పాటించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యులందరికీ కూడా చికిత్స అవసరమవుతుంది.
నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
నులి పురుగుల నుంచి పిల్లలను కాపాడాలంటే వ్యక్తిగత పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. భోజనం ముందు, మరుగుదొడ్డి తర్వాత సబ్బుతో చేతులు కడుక్కోవడం అలవాటు చేయాలి. కాచి చల్లార్చిన లేదా శుభ్రమైన నీటినే తాగించాలి. కూరగాయలు, పండ్లను బాగా కడిగి వాడాలి. గోళ్లను చిన్నగా కత్తిరించి శుభ్రంగా ఉంచాలి. పిల్లలు బయట చెప్పులు లేకుండా తిరగకుండా చూడాలి. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం కూడా చాలా ముఖ్యం.
















పవన్ కాదు.. ఎన్టీఆర్ సీఎం అవుతాడు.. వేణు స్వామి హాట్ కామెంట్స్.. వీడియో వైరల్
Venu Swamy : వేణు స్వామి అంటేనే వివాదాలకు కేంద్ర బిందువు. అవసరం లేకపోయినా ఒకప్పుడు హీరోలు , హీరోయిన్లు జాతకాలు చెప్పేవారు. సమంత విడాకులు తీసుకుంటుంది అనే విషయాన్ని ఈయన ముందుగా చెప్పారు. దానిని మార్కెటింగ్ చేసుకుంటూ ఈయన తెచ్చుకున్న పేరు మామూలుది కాదు. ప్రభాస్ ఇక ఎప్పటికీ హిట్ కొట్టలేదని , జగన్ మరోసారి ముఖ్యమంత్రి అవుతాడని, పవన్ కళ్యాణ్ మరోసారి ఎమ్మెల్యే గా ఓడిపోతాడని , ఇలా ఒకటా రెండా , ఎన్నో రకాల వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడైతే ఆయన శోభిత , నాగ చైతన్య పెళ్లి చేసుకున్న రోజున , వీళ్ళు భవిష్యత్తులో విడిపోతారు అంటూ వ్యాఖ్యలు చేశారో , అప్పుడే ఈయన పై తీవ్రమైన నెగెటివిటీ ఏర్పడింది. మహిళా కమీషన్ సైతం ఈయనకు నోటీసులు పంపారు. ఆ తర్వాత కొన్ని రోజులు సైలెంట్ గా ఉన్నటువంటి వేణు స్వామి , చాలా రోజుల తర్వాత రీసెంట్ గానే ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఈ ఇంటర్వ్యూ లో ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. సినీ హీరోల గురించి ఒక్కొక్కరి పేరు ని యాంకర్ అడగ్గా, వాళ్ళ గురించి ఒక్కో మాట చెప్పుకుంటూ వచ్చారు వేణు స్వామి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పర్ఫెక్ట్ రాజకీయ నాయకుడు అని , ఎన్టీఆర్ కాబోయే ముఖ్యమంత్రి అంటూ ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో సంచలనం గా మారాయి. ఇక మిగిలిన హీరోల గురించి ఆయన మాట్లాడుతూ విజయ్ దేవరకొండ బాగా కష్టపడే వ్యక్తి అని , ప్రభాస్, చిరంజీవి , రాజమౌళి కారణజన్ములు అంటూ ఆయన సంబోధించడం విశేషం. సీనియర్ ఎన్టీఆర్ యుగ పురుషుడని , సమంత గొప్ప ఫైటర్ అని , రామ్ చరణ్ వంశాన్ని నమ్ముకోకుండా కష్టాన్ని నమ్ముకున్న వ్యక్తి అని , మహేష్ బాబు మంచి అందగాడు అంటూ ఆయన ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.
అదే విధంగా నరేంద్ర మోడీ కారణం జన్ముడు అని , పాకిస్థాన్ ఒక్క దరిద్రంగా దేశం అంటూ ఆయన మాట్లాడిన మాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అంతా బాగానే ఉంది , రాజకీయాల్లో ఉప ముఖ్యమంత్రి స్థానం లో కూర్చున్న పవన్ కళ్యాణ్ ముఖ్య మంత్రి అవుతాడని చెప్పలేదు , అసలు రాజకీయాల్లోకి వస్తాడో లేదో తెలియని జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య మంత్రి అవుతాడని చెప్పడమే సోషల్ మీడియా లో వివాదాలకు దారి తీసింది. ఈ వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.