Homeబిజినెస్Mahindra EV: టాటా ఈవీ కార్లకు గట్టి పోటీతో మహీంద్రా కార్లు.. 679 కి.మీ. రేంజ్..

Mahindra EV: టాటా ఈవీ కార్లకు గట్టి పోటీతో మహీంద్రా కార్లు.. 679 కి.మీ. రేంజ్..

Mahindra EV: భారత ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో ప్రస్తుతం టాటా మోటార్స్‌ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ కంపెనీకి గట్టి పోటీ ఇచ్చేందుకు మహీంద్రా అండ్ మహీంద్రా సరికొత్త వ్యూహాలతో సిద్ధమవుతోంది. ప్రస్తుతం మార్కెట్లో టాప్ సెల్లర్స్‌గా ఉన్న టాటా నెక్సాన్ ఈవీ , అలాగే ప్రీమియం సెగ్మెంట్‌లో ఉన్న టాటా హారియర్ ఈవీ మోడళ్లకు చెక్ పెట్టేందుకు మహీంద్రా రెండు సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను రంగంలోకి దించుతోంది. ఇంతకీ అవి ఎలా ఉన్నాయో తెలుసా? ప్రస్తుతం కాంపాక్ట్ […]

Mahindra EV: భారత ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో ప్రస్తుతం టాటా మోటార్స్‌ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ కంపెనీకి గట్టి పోటీ ఇచ్చేందుకు మహీంద్రా అండ్ మహీంద్రా సరికొత్త వ్యూహాలతో సిద్ధమవుతోంది. ప్రస్తుతం మార్కెట్లో టాప్ సెల్లర్స్‌గా ఉన్న టాటా నెక్సాన్ ఈవీ , అలాగే ప్రీమియం సెగ్మెంట్‌లో ఉన్న టాటా హారియర్ ఈవీ మోడళ్లకు చెక్ పెట్టేందుకు మహీంద్రా రెండు సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను రంగంలోకి దించుతోంది. ఇంతకీ అవి ఎలా ఉన్నాయో తెలుసా?

ప్రస్తుతం కాంపాక్ట్ EV సెగ్మెంట్‌లో టాటా నెక్సాన్ ఈవీ రాజ్యాన్ని ఏలుతోంది. దీనికి నేరుగా పోటీగా మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్‌ఓ ను తీసుకురాబోతోంది. ఇది మహీంద్రా పాపులర్ మోడల్ XUV 3XO ఆధారంగా రూపొందుతున్న ఎలక్ట్రిక్ వెర్షన్. నెక్సాన్ ఈవీ లాగే ఇది కూడా మధ్యతరగతి ఈవీ కొనుగోలుదారులను టార్గెట్ చేస్తూ బడ్జెట్ మరియు ప్రీమియం ఫీచర్ల కలయికతో రానుంది. దాదాపు 350 నుండి 400 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే బ్యాటరీ ప్యాక్‌తో ఈ కారు మార్కెట్లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది.

అలాగే ప్రీమియం , లగ్జరీ ఈవీ సెగ్మెంట్‌లో టాటా హారియర్ ఈవీ, సఫారీ ఈవీ వంటి మోడళ్లకు సవాల్ విసిరేందుకు మహీంద్రా సరికొత్త BE.07 ఎస్‌యూవీని సిద్ధం చేస్తోంది. ఇటీవల ఈ కారుకు సంబంధించిన టెస్ట్ మోడల్స్ ఇండియన్ రోడ్లపై ట్రయల్స్ నిర్వహిస్తూ కనిపించాయి. సుమారు 4.6 మీటర్ల పొడవుతో, ఒక అద్భుతమైన ఫ్యూచరిస్టిక్ డిజైన్‌తో ఈ కారు రూపుదిద్దుకుంటోంది. లగ్జరీ కార్ల తరహాలో ఫ్రేమ్‌లెస్ డోర్లు, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ మరియు స్లోపింగ్ రూఫ్‌లైన్‌తో దీని లుక్ చాలా అగ్రెసివ్‌గా ఉండబోతోంది.

మహీంద్రా BE.07 ప్రీమియం ఈవీలో కస్టమర్ల అవసరాలకు తగ్గట్టుగా 59kWh నుంచి 79kWh సామర్థ్యం గల మూడు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లను ఇచ్చే అవకాశం ఉంది. ఒకే ఛార్జ్‌పై ఈ కారు ఏకంగా 520 కిలోమీటర్ల నుండి గరిష్టంగా 679 కిలోమీటర్ల భారీ రేంజ్ ను ఆఫర్ చేయగలదని మార్కెట్ వర్గాల అంచనా. ఇందులో రియర్ వీల్ డ్రైవ్ తో పాటు మరింత పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ కోసం ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్ కూడా ఉండనుంది.

ధర విషయానికొస్తే… నెక్సాన్ ఈవీకి పోటీగా వచ్చే మోడల్ రూ. 14 లక్షల నుంచి రూ. 18 లక్షల శ్రేణిలో ఉండే అవకాశం ఉండగా, హారియర్ ఈవీకి పోటీగా వచ్చే BE.07 మోడల్ రూ. 22 లక్షల నుండి రూ. 28 లక్షల (ఎక్స్-షోరూమ్) బడ్జెట్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ రెండు కొత్త కార్ల ఎంట్రీతో భారత ఈవీ మార్కెట్లో టాటా, మహీంద్రా మధ్య పోటీ నెక్స్ట్ లెవెల్‌కు చేరడం ఖాయం.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper