Home Blog Page 128

ప్రధానిని కలిసిన టీవీకే విజయ్ కి.. అమిత్ షా అపాయింట్మెంట్ ఎందుకు రద్దయింది.. ఇంత జరిగిందా..

IND vs PAK
IND vs PAK

TVK Vijay PM Modi Meeting: రాజకీయాలలో ఏదైనా జరుగుతుంది. ఏమైనా జరుగుతుంది. అవసరాలు మాత్రమే ఉంటాయి కాబట్టి దానికోసం రాజకీయ పార్టీలు అటు గోడ ఇటు దునుకుతాయి. ఇటు గోడను అటు దునుకుతాయి.. ఓట్లు వేసిన జనం మాత్రం పిచ్చి వాళ్ళవుతారు.

తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీవీ కే అత్యధిక స్థానాలు గెలిచిన పార్టీగా ఆవిర్భవించింది. అలాగని అధికారం దక్కించుకునేంత స్థాయిలో అక్కడి ప్రజలు మెజారిటీ ఇవ్వలేదు. దీంతో ఇతర పార్టీల సపోర్ట్ తీసుకుని విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.. ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలో విజయ్ ప్రభుత్వానికి సంబంధించిన పరిపాలన సాఫీగా సాగిపోతోంది. మధ్యమధ్యలో డిఎంకె నేత స్టాలిన్ ప్రభుత్వం కూలిపోతుందని చెబుతున్నప్పటికీ అది అంత ఈజీ కాదు. ఎందుకంటే విజయ్ ఆల్రెడీ గ్రౌండ్ లెవెల్ లో ప్రభుత్వానికి కావలసిన మెజారిటీ మొత్తాన్ని సమీకరించుకున్నారు. ఎవరికి ఏం చేయాలో అది చేశారు. పుష్ప లెవల్లో సోఫాలు కూడా ఇచ్చారు.

ఇటీవల విజయ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారు.. వారిద్దరు చాలాసేపు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత విజయ్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలవాలి. అపాయింట్మెంట్ కూడా ఓకే అయింది. ప్రధానమంత్రిని కలిసిన తర్వాత విజయ్ హోం శాఖ మంత్రి వద్దకు వెళ్లడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. అప్పటికి ఆయన కాన్వాయ్ కూడా అమిత్ షా నివాసం వైపు వెళ్ళింది. విజయ్ కాన్వాయ్ అలా బయలుదేరిందో లేదో.. వెంటనే అమిత్ షా కార్యాలయం నుంచి ఫోనొచ్చింది. సార్ అందుబాటులో లేరు.. మీరు తర్వాత రండి అని ఆ ఫోన్లో వ్యక్తి చెప్పారు.

విజయ్ కి ఏం అర్థం కాలేదు.. ఎందుకిలా జరిగిందో కూడా బోధ పడలేదు. సరే బిజీగా ఉంటారని అనుకొని విజయ్ ఆయనను కలవకుండానే తిరుగు ప్రయాణమయ్యారు. అయితే దీని వెనుక డీఎంకే నేత స్టాలిన్ స్కెచ్ ఉంది. తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ హ్యాండ్ ఇవ్వడంతో డీఎంకే ఆగ్రహంగా ఉంది.. ఇండియా కూటమికి దూరంగా ఉంది.. అంతేకాదు తమిళనాడులో బిజెపికి దగ్గరగా వెళ్తోంది. ఇప్పటికే అమిత్ షా తో స్టాలిన్ ఫోన్లో మాట్లాడినట్టు తెలుస్తోంది. ఆయన సూచనల మేరకే అమిత్ షా విజయ్ కి అపాయింట్మెంట్ రద్దు చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు డిఎంకె నేతలపై ఉన్న ఈడీ కేసుల విచారణ కూడా ఆగిపోయింది.. ఇటీవల కాలంలో స్టాలిన్ పదేపదే విజయ్ ప్రభుత్వం కూలిపోతుందని చెబుతున్నారు.. ఈ లెక్కన విజయ్ కి ఇబ్బందికర పరిస్థితులు ఏమైనా సృష్టించబోతున్నారా.. విజయ్ ప్రభుత్వాన్ని కూలదోసి.. డీఎంకే అధికారంలోకి వస్తుందా.. తమిళనాడు మీడియాలో ఇప్పుడు ఇవే వార్తలు సర్కులేట్ అవుతున్నాయి.

పాక్ గెలిచేదే.. అక్కడే భారత్ మలుపు తిప్పింది.. ఇది టీమిండియా దమ్మంటే..

IND vs PAK
IND vs PAK

IND vs PAK: టి20 వరల్డ్ కప్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ మీద భారత మహిళల జట్టు అద్భుతమైన విజయాన్ని అందుకుంది. బ్యాటింగ్లో తడబడినప్పటికీ.. చివర్లో తేరుకుని భారత్ 170 పరుగులు చేసింది. పాకిస్తాన్ ఆ లక్ష్యాన్ని చేదించే క్రమంలో తలవంచింది.. ముందుగా దూకుడు ప్రదర్శించినప్పటికీ.. ఆ తర్వాత వెనక్కి తగ్గింది.

భారత జట్టు విధించిన 171 పరుగుల లక్ష్యాన్ని సాధించే క్రమంలో పాకిస్తాన్ జట్టు మొదట్లో దూకుడుగానే ఇన్నింగ్స్ మొదలుపెట్టింది.. రెండు వికెట్లు కోల్పోయినప్పటికీ మునిబా (41) ఎదురుదాడితో పాకిస్తాన్ 6.3 ఓవర్లలోనే 53 పరుగులు చేసింది. అప్పటికే రెండు వికెట్లు కోల్పోయినప్పటికీ.. పాకిస్తాన్ విజయం మీద సంపూర్ణ విశ్వాసంతో ఉంది. కానీ ఆ తర్వాత భారత బౌలర్లు పట్టు బిగించారు. ముఖ్యంగా దీప్తి శర్మ అద్భుతమైన బంతులు వేయడంతో ఏ సందర్భంలోనూ పాకిస్తాన్ జట్టు కోలుకునే విధంగా కనిపించలేదు. దీప్తి శర్మ ఏకంగా ఐదు వికెట్లు తన ఖాతాలో వేసుకుంది. తెలుగు అమ్మాయి శ్రీ చరణీ మూడు వికెట్లు సాధించింది. షఫాలివర్మ ఒక వికెట్ దక్కించుకుంది. పాకిస్తాన్ టాప్ ఆర్డర్ వికెట్లు మొత్తం వీరు ముగ్గురు సొంతం చేసుకోవడం గమనార్హం. ఒక దశలో గెలిచే విధంగా కనిపించిన పాకిస్తాన్.. తీవ్రంగా తడబడింది. మిడిల్ ఆర్డర్ వైఫల్యం ఆ జట్టు కొంపముంచింది.

టీమిండియా ఇన్నింగ్స్ కూడా అంత గొప్పగా ప్రారంభం కాలేదు.. షఫాలి వర్మ ఆకట్టుకోలేదు. జెమీమా, భారతి ఒక పరుగు చొప్పున మాత్రమే చేశారు. స్మృతి మందాన (64), కెప్టెన్ కౌర్(36), రీఛాగోష్ (34) పరుగులు చేయడంతో టీమిండియా 170 రన్స్ స్కోర్ చేసింది. రీఛాగోష్ 19 ఓవర్లో 24 పరుగులు చేయడంతో మ్యాచ్ స్వరూపం ఒక్కసారిగా మారిపోయింది.. దీంతో టీమ్ ఇండియా స్కోర్ రాకెట్ వేగంతో దూసుకుపోయింది. ఒకరకంగా టీమిండియా విజేతగా నిలవడానికి ఆ ఓవర్ కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.. ఆ ఓవర్ లో 24 పరుగులు రావడం టీమిండియా స్కోర్ బోర్డును పూర్తిగా మార్చేసింది. పాకిస్తాన్ ముందు ఒక భారీ స్థాయి లక్ష్యాన్ని విధించేలా చేసింది.

ఈ విజయం టీమిండియా మహిళల ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది. భారీగా అంచనాలున్న ప్లేయర్లు.. వాటిని అందుకోలేకపోయినప్పటికీ.. మిగతా ప్లేయర్లు జట్టు అవసరాలకు తగ్గట్టుగా ఆడటం విశేషం. ఒక దశలో రెండు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడిన జట్టును.. కెప్టెన్ కౌర్.. స్మృతి ఆదుకున్నారు. చివర్లో రీచా అదరగొట్టింది.. ఇక బౌలింగ్లో దీప్తి.. శ్రీ చరణి సత్తా చూపించారు.. అందువల్లే భారత్ అద్భుతమైన గెలుపును దక్కించుకుంది.. లోపాలు సవరించుకొని.. టీమ్ ఇండియా తదుపరి మ్యాచ్లలో జోరు చూపిస్తే వన్డే వరల్డ్ కప్ మాదిరిగానే.. టి20 వరల్డ్ కప్ కూడా మన చేతుల్లో వచ్చి చేరుతుంది. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు.

దీప్తి శర్మ అదరగొడితే.. మన తెలుగు అమ్మాయి పాకిస్తాన్ ను తగలబెట్టింది..

IND vs PAK
IND vs PAK

IND vs PAK: అసలే ప్రత్యర్థి పాకిస్తాన్. హై టెన్షన్ మ్యాచ్. ఇండియా గెలుపు మీద ఎవరికి ఎటువంటి అనుమానాలు లేవు. కాకపోతే పాకిస్తాన్ ఎప్పుడు ఎలా ఆడుతుందో ఎవరికి తెలియదు. దీంతో ఒక రకంగా ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. దీనికి తోడు ప్రారంభంలోనే టీమ్ ఇండియా రెండు వికెట్ల కోల్పోయింది. స్మృతి, కౌర్ నిలబడకపోయి ఉంటే పరిస్థితి దారుణంగా ఉండేది.. అప్పటికి టీమ్ ఇండియా 170 పరుగులు చేసింది.

పాకిస్తాన్ ఈ పరుగులను సాధించడానికి తన ఇన్నింగ్స్ ను బలంగా మొదలుపెట్టింది. ఓవర్ కు 8 పరుగులకు పైగా చొప్పున తీయడం ప్రారంభించింది. దీంతో పాకిస్తాన్ గెలుపు సాధ్యమని అనుకున్నారు. మరోవైపు మునిబా అదరగొట్టే స్థాయిలో బ్యాటింగ్ చేస్తోంది. అరుంధతి రెడ్డి ధారాళంగా పరుగులు ఇస్తోంది.. క్రాంతి గౌడ్ కూడా ఒక్క ఓవర్ లోనే 14 పరుగులు ఇచ్చింది. అప్పటికి టీమ్ ఇండియా మీద ఒత్తిడి పెరిగిపోతోంది. రెండు వికెట్లు పడిపోయినప్పటికీ పాకిస్తాన్ ఏ మాత్రం వెనుకడుగు వేయడం లేదు. ఈ దశలో కౌర్ కు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ధైర్యం చేసింది దీప్తికి బంతి ఇచ్చింది.. ఇక అప్పుడు మ్యాచ్ స్వరూపం పూర్తిగా మారిపోయింది.

కెప్టెన్ తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని దీప్తి ఏమాత్రం వమ్ము చేసుకోలేదు. తొలి ఓవర్ లో ఒక వికెట్.. రెండవ ఓవర్ లో మరొక వికెట్.. చివరి నాలుగో ఓవర్ లో మూడు వికెట్లు సాధించి మొత్తంగా 5 వికెట్లను తన ఖాతాలో వేసుకుంది. తద్వారా తనను లేడీ బుమ్రా అని ఎందుకు పిలుస్తారో మరోసారి దీప్తి నిరూపించుకుంది.

దీప్తి ఐదు వికెట్లు పడగొట్టి అదరగొడితే.. మన తెలుగు అమ్మాయి శ్రీ చరణి సత్తా చూపించింది. అత్యంత కట్టుదిట్టంగా బంతులు వేస్తూ అదరగొట్టింది.. ఏకంగా మూడు వికెట్లను దక్కించుకుంది. దీప్తి శర్మ పాకిస్తాన్ పతనాన్ని ప్రారంభిస్తే.. శ్రీ చరణి పాకిస్తాన్ మొత్తాన్ని తగలబెట్టేసింది.. ఉక్కిరి బిక్కిరి చేసే బంతులతో పాకిస్తాన్ ప్లేయర్లకు కనీసం పరుగులు తీసే అవకాశం కూడా ఇవ్వలేదు. వెంట వెంటనే వికెట్లు పడగొట్టి పాకిస్తాన్ మీద ఒత్తిడి పెంచింది. ఒక ఎండ్ నుంచి దీప్తి.. మరో ఎండ్ నుంచి శ్రీ చరణి దాడి చేయడంతో పాకిస్తాన్ కు ఏ మాత్రం కోలుకునే అవకాశం లేకుండా పోయింది.

ఆ మధ్య టీం ఇండియా టి20 వరల్డ్ కప్ సాధించినప్పుడు.. శ్రీ చరణి సత్తా చూపించింది. తన బౌలింగ్ వైవిధ్యంతో అదరగొట్టింది. ఈ నేపథ్యంలో ఆమెకు ఏపీ ప్రభుత్వం కోటి రూపాయల బహుమతి అందించింది. ఉద్యోగంతో పాటు.. ఇంటి స్థలాన్ని కూడా మంజూరు చేసింది. నాడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ ఆమెను ప్రత్యేకంగా పిలిపించుకొని అభినందించారు. నాటి కార్యక్రమంలో మిథాలీ రాజ్ కూడా ఉంది.

శ్రేయాంక సూపర్ క్యాచ్.. బిత్తర పోయిన పాకిస్తాన్ ప్లేయర్.. వైరల్ వీడియో

IND vs PAK
IND vs PAK

IND vs PAK: టీమిండియా బ్యాటింగ్ .. బౌలింగ్.. సత్తా చూపిస్తూ ఉంటుంది. భారత మహిళలు కొన్ని సందర్భాలలో అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకుంటుంటారు. అయితే ఫీల్డింగ్ విషయంలో మాత్రం భారత జట్టు మీద కొన్నిసార్లు సదాభిప్రాయం ఉండదు. దీనికి ప్రధాన కారణం భారత ఫీల్డర్లు చురుకుగా కదలరు. దీనిపై అనేక రకాలుగా విమర్శలు ఉన్నప్పటికీ మన ఫీల్డింగ్ అంతగా మారలేదు.

కానీ ఈ టి20 వరల్డ్ కప్ లో టీమిండియా ఫీల్డింగ్ పూర్తిస్థాయిలో మారినట్టు కనిపిస్తోంది. పాకిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో టీమ్ ఇండియా ఫీల్డర్లు మైదానంలో పాదరసం మాదిరిగా కదిలారు.. పాకిస్తాన్ జట్టుకు ఏ దశలో కూడా అవకాశం ఇవ్వకుండా బంతులకు అడ్డుగోడలుగా అడ్డు తగిలారు.. కీలకమైన క్యాచ్ లు.. రనౌట్ లు చేసి పాకిస్తాన్ జట్టుకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. మునిబా ను దీప్తి శర్మ రనౌట్ చేయడం ఈ మ్యాచ్ మొత్తానికి హైలైట్ అయితే… అంతకు మించిన స్థాయిలో క్యాచ్ పట్టి శ్రేయాంక అదరగొట్టింది. ఇప్పటివరకు జరిగిన టి20 మ్యాచ్లలో ఆమె పట్టిన క్యాచ్ అద్భుతం అంటే.. ఏ స్థాయిలో ఫీల్డింగ్ చేసిందో అర్థం చేసుకోవచ్చు.

శ్రీ చరణి బౌలింగ్లో పాకిస్తాన్ బ్యాటర్ రమీన్ షమీం బంతిని గట్టిగా కొట్టింది. బంతి వేగంగా గాలిలో పరుగులు పెడుతుంటే.. శ్రేయ అమాంతం ఆ బంతిని అందుకుంది. అంతే వేగంతో కింద పడింది. అయినప్పటికీ ఆమె చేతుల్లో బంతిని అలాగే గట్టిగా పట్టుకుంది. ఫలితంగా పాకిస్తాన్ బ్యాటర్ ఒక్కసారిగా షాక్ అయింది. అటువంటి కష్టతరమైన క్యాచ్ అందుకోవడమే ఒకరకంగా ఇబ్బందిగా ఉంటుంది. క్యాచ్ అందుకొని.. శరీరాన్ని నియంత్రించుకొని.. బంతిని అలానే పట్టుకోవడం అంటే మామూలు విషయం కాదు. పైగా శ్రేయ చురుకైన ఫీల్డర్ కూడా. ఆమె ఫీల్డింగ్ చూసి కెప్టెన్ కౌర్ కూడా ఆశ్చర్యపోయింది.

శ్రేయ పట్టిన క్యాచ్ ను చూసి డగ్ అవుట్ లో ఉన్న పాకిస్తాన్ ప్లేయర్లు కూడా ఆశ్చర్యపోయారు. ఇదేలా సాధ్యం అనుకుంటూ తమలో తామే చర్చించుకున్నారు. మరోవైపు పాకిస్తాన్ ఫీల్డర్లు ఈ మ్యాచ్లో దారుణంగా ఫీల్డింగ్ చేశారు. కీలకమైన క్యాచ్లు వదిలేసారు. బంతిని ఆపడంలో తడపడ్డారు. ఫలితంగా ప్రారంభంలో రెండు వికెట్లు కోల్పోయినప్పటికీ.. పాకిస్తాన్ ప్లేయర్ల నిర్లక్ష్యం వల్ల భారత్ నిలదొక్కుకుంది. తద్వారా పాకిస్తాన్ ఎదుట 171 పరుగుల భారీ టార్గెట్ విధించింది. అటు ఫీల్డింగ్.. బ్యాటింగ్, బౌలింగ్ లో అదరగట్టిన టీమిండియా అద్భుతమైన విజయాన్ని అందుకొని.. సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో తదుపరి మ్యాచ్ కు సిద్ధమైంది.

అమావాస్యవేళ ఈ రాశిల వారికి అనుకోని అదృష్టం..

Today 11 July 2026 Horoscope
Today 11 July 2026 Horoscope

Today 15 June 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్ర ప్రకారం సోమవారం ద్వాదశ రాశులపై మృగశిర నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో అమావాస్యవేళ కొన్ని రాశుల వారికి అదృష్టం పట్టనుంది. మరి కొన్ని రాశుల వారు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): అమావాస్య వేల ఈ రాశి వారు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. అయితే వ్యాపారులకు లాభాలు ఉంటాయి. ఉద్యోగులు అనుకున్న పనులను ఈరోజు పూర్తి చేస్తారు. కుటుంబ జీవితం సంతోషంగా గడుస్తుంది. ఆత్మగౌరవంతో ముందుకు వెళ్లడం వల్ల సమాజంలో గౌరవం లభిస్తుంది. ఆగిపోయిన పనులను పూర్తి చేస్తారు.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారికి ఈ రోజు శుక్రుడి అనుగ్రహం ఉండనుంది. దీంతో ప్రతి పనిలో విజయం సాధిస్తారు. వ్యాపారులకు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు ఉంటాయి. కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారు ఈ రోజు మెరుగైన ఫలితాలను పొందడానికి కుటుంబ సభ్యుల మద్దతును పొందుతారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. బంధువులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. కొత్త వాహనాలను కొనుగోలు చేయడానికి సన్నాహాలు చేస్తారు. వీరి వైవాహిక జీవితం సంతోషంగా గడుస్తుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : అమావాస్యవేళ ఈ రాశి వారికి ఈరోజు గణనీయంగా ఆదాయం పెరుగుతుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగుతుంది. ఎంతోకాలంగా పెండింగ్లో ఉన్న పనులను ఈరోజు పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. కొన్ని ముఖ్యమైన పనులు సాగడానికి అవకాశం లభిస్తుంది. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉండడంతో ముఖ్యమైన ప్రాజెక్టులను పూర్తి చేస్తారు.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారికి ఈ రోజు అన్ని విజయాలే సమకూరుతాయి. మానసికంగా సంతృప్తిగా ఉంటారు. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. పిల్లల కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. ఎవరికైనా డబ్బు ఇచ్చే అవసరం ఉంటే ఆలోచించాలి. కొత్తగా పెట్టుబడులు పెట్టే వారికి ఇదే మంచి సమయం.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు ఈ రోజు చాలా సంతోషంగా గడుపుతారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. గతంలో ఆగిపోయిన పనులను ఇప్పుడు పూర్తి చేస్తారు. కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఇదే మంచి సమయం. జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : తులారాశి వారికి ఈరోజు అమావాస్యవేళ శుక్రుడి అనుగ్రహం ఉండనుంది. దీంతో అనుకోకుండా అపారమైన అదృష్టం లభించనుంది. కుటుంబ జీవితం సంతోషంగా సాగుతుంది. గతంలో కంటే ఇప్పుడు ఆదాయం పెరుగుతుంది. ఆగిపోయిన పనులను పూర్తి చేస్తారు. సమయాన్ని సద్వినియోగం చేసుకొని ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈ రోజు అన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. విదేశాల నుంచి శుభవార్తలు వింటారు. పిల్లల కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. కొందరి నిపుణుల సలహాతో ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఎవరికైనా డబ్బు ఇస్తే వెంటనే తిరిగి తీసుకునే ప్రయత్నం చేయాలి. కొత్తగా ఖర్చులు వచ్చే అవకాశం ఉంది.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఉద్యోగులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించడం వల్ల ప్రమోషన్ వందే అవకాశం ఉంది. ఆగిపోయిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు వ్యాపారులకు అకస్మాత్తుగా ఆదాయం పెరుగుతుంది. కుటుంబ జీవితం సంతోషంగా గడుస్తుంది. పిల్లలతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. పెట్టుబడుల విషయంలో పెద్దల సలహా తీసుకుంటారు.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈ రోజు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులకు తోటి వారి నుంచి వేధింపులు ఉండే అవకాశం ఉంది. వ్యాపారులు కొన్ని పనుల నిమిత్తం బిజీగా ఉంటారు అయితే ఇదే సమయంలో ప్రత్యర్థుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక వ్యవహారాలు జరిపేటప్పుడు కుటుంబ సభ్యుల సలహా తీసుకోవడం మంచిది.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు మానసికంగా ప్రశాంతత లభిస్తుంది. గతంలో ఉన్న సమస్యలు తొలగిపోవడంతో సంతోషంగా గడుపుతారు. జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. వ్యాపారులు ప్రత్యర్థుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. కొత్తగా పెట్టుబడులు పెట్టేటప్పుడు పెద్దలను సంప్రదించడం మంచిది

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారికి ఈ రోజు అన్ని అనుకూల ఫలితాలే ఉంటాయి. ఒక పని గురించి కొత్త వ్యక్తులను కలుస్తారు. అనుకోకుండా చేసే ప్రయాణాలు కలిసి వస్తాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి.

తెలంగాణలో రేపే స్కూల్స్ ప్రారంభం.. మీ పిల్లల్ని పంపిస్తున్నారా..

Half Day Schools
Half Day Schools

Telangana schools reopening : తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు సోమవారం (జూన్ 15) నుంచి పునఃప్రారంభం కానున్నాయి. వేసవి సెలవులు జూన్ 12తో ముగియాల్సి ఉండగా, రాష్ట్రంలో కొనసాగిన తీవ్ర ఎండల కారణంగా ప్రభుత్వం సెలవులను మరో రెండు రోజులు పొడిగించింది. దీంతో విద్యార్థులు దాదాపు రెండు నెలల విరామం తర్వాత మళ్లీ బడిబాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు.అయితే ఈసారి పాఠశాలల ప్రారంభానికి ముందు ఒక ఆసక్తికరమైన చర్చ తల్లిదండ్రుల మధ్య జరుగుతోంది. జూన్ 15న అమావాస్య రావడం, మరుసటి రోజు మంగళవారం కావడంతో కొందరు పేరెంట్స్ పిల్లలను మొదటి రెండు రోజులు స్కూల్‌కు పంపాలా వద్దా అనే సందిగ్ధంలో ఉన్నారు. సంప్రదాయ విశ్వాసాల ప్రకారం అమావాస్య రోజున కొత్త పనులు ప్రారంభించడం మంచిది కాదని కొందరు భావిస్తున్నారు.

ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో, అలాగే సాంప్రదాయాలను ఎక్కువగా పాటించే కుటుంబాల్లో ఈ అభిప్రాయం ఎక్కువగా కనిపిస్తోంది. స్కూల్ మొదటి రోజు అమావాస్య వచ్చింది కాబట్టి ఒక రోజు ఆగితే మంచిది, మంగళవారం కూడా కొత్త కార్యక్రమాలకు అంత అనుకూలం కాదు అంటూ కొందరు తల్లిదండ్రులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

దీంతో కొంతమంది విద్యార్థులను బుధవారం (జూన్ 17) నుంచి పాఠశాలకు పంపాలని కుటుంబాలు నిర్ణయించుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే విద్యాశాఖ అధికారులు మాత్రం పాఠశాలలు అధికారికంగా సోమవారం నుంచే ప్రారంభమవుతున్నాయని, మొదటి రోజు నుంచే హాజరు కావాలని విద్యార్థులు, తల్లిదండ్రులకు సూచిస్తున్నారు.

విద్యా నిపుణులు కూడా ఇలాంటి సందర్భాల్లో మూఢనమ్మకాల కంటే విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తున్నారు. పాఠశాలలు ప్రారంభమైన తొలి రోజుల్లోనే పాఠ్యాంశాల ప్రణాళిక, పుస్తకాల పంపిణీ, తరగతుల కేటాయింపు వంటి కార్యక్రమాలు జరుగుతాయని, వీటిని విద్యార్థులు మిస్ కాకుండా చూడాలని చెబుతున్నారు.

ఇక చాలా మంది తల్లిదండ్రులు మాత్రం అమావాస్య, మంగళవారం వంటి అంశాలను పెద్దగా పట్టించుకోకుండా పిల్లలను మొదటి రోజే స్కూల్‌కు పంపేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో రేపటి నుంచి పాఠశాలల్లో సందడి మొదలుకానుండగా, తొలి రెండు రోజుల్లో విద్యార్థుల హాజరు శాతం ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.

ఐదేళ్లపాటు విడాకుల కోసం కోర్టు చుట్టూ.. చివరికిలా కలిశారు.. సినిమాను మించిన స్టోరీ ఇది

couple-reunites-after-5-year-divorce-battle-in-court-heartwarming-story

divorce case reunited : విడాకుల కోసం కోర్టు చుట్టూ తిరిగారు. ఐదు సంవత్సరాలపాటు విడాకుల కోసం పోరాడారు.. పెద్దలు.. కోర్టులో న్యాయాధికారులు ఎన్ని రకాలుగా చెప్పినప్పటికీ వారు వినిపించుకోలేదు. మరి కొద్ది రోజుల్లో విడాకులు మంజూరు అవుతాయనుకుంటున్న క్రమంలో అనూహ్యమైన సంఘటన చోటుచేసుకుంది.

ఢిల్లీ నగరానికి చెందిన సౌరబ్ అనే వ్యక్తికి 2020లో శిఖ అనే యువతితో వివాహం జరిగింది. వివాహం జరిగిన కొద్ది రోజుల వరకు వారిద్దరు బాగానే ఉన్నారు. ఆ తర్వాత వారిద్దరి మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయి. మొదట్లో చిన్నపాటి గొడవ.. ఆ తర్వాత మరింత పెరిగింది. దీంతో ఇద్దరూ విడిగా ఉండాలనుకున్నారు. విడాకులు తీసుకోవాలని అనుకున్నారు.. విడివిడిగా ఉండడం మొదలుపెట్టారు. పరస్పరం కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. గడచిన ఐదు సంవత్సరాలుగా విడాకుల కోసం ఫ్యామిలీ కోటు చుట్టూ తిరుగుతున్నారు..

న్యాయవాదుల ఫీజులు.. ఇతర ఫీజులకు సంబంధించిన ఖర్చులు వంటి వాటి వల్ల రెండు కుటుంబాలు ఆర్థికంగా నష్టపోయాయి. ఇటీవల ఈ బాధతో శిఖ తండ్రి గుండెపోటు గురయ్యాడు. డబ్బు మొత్తం కోర్టు కేసులకు ఖర్చు కావడంతో.. ప్రైవేట్ ఆస్పత్రిలో చూపించే స్థాయి లేకుండా పోయింది. దీంతో అతడిని ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. ఈ విషయం తెలుసుకున్న సౌరబ్..శిఖ తండ్రిని గురు గ్రామ్ లో ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించాడు. మెరుగైన వైద్యం అందించడానికి తనవంతుగా సహకారం అందించాడు. ప్రస్తుతం అతడు కోలుకుంటున్నాడు.

ఇటీవల విడాకుల కేసు విచారణకు సంబంధించి సౌరబ్..శిఖ కోర్టుకు హాజరయ్యారు. వారిద్దరి తరపున న్యాయవాదులు వాదనను వినిపించడం మొదలుపెట్టారు.. కేసు తుది విచారణలో భాగంగా విడాకులు తీసుకుంటారా అని అడిగారు. వెంటనే శిఖ సినిమా స్టైల్ లో తన చేతిలో ఉన్న విడాకుల పత్రాలను చించేసింది. తన భర్తతో విడాకులు తీసుకునే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది. కలిసి ఉంటామని వివరించింది. మొత్తంగా ఐదు సంవత్సరాలపాటు విడాకులు తీసుకుంటామని అనుకున్న వారిద్దరు.. ఐదు నిమిషాల్లో కలిసిపోయారు. సినిమా స్టోరీని కళ్ళ ముందు ఉంచారు. నేటి కాలంలో చిన్న చిన్న ఘటనలకే గొడవ పడుతున్న వారికి ఈ దంపతులు ఆదర్శంగా నిలిచారు.


image.png

రేయ్ పలాష్ ముచ్చల్.. గుక్కపెట్టి ఏడువు.. ఇదీ మా స్మృతి మందాన రేంజ్

Smriti Mandhana world record
Smriti Mandhana world record

Smriti Mandhana half century : అన్ని అనుకున్నట్లు జరిగితే స్మృతి మందాన పక్కన.. ముచ్చల్ అని ఉండేది. అది వాడి దురదృష్టం. బంగారం లాంటి అమ్మాయి ప్రేమికురాలుగా ఉన్నప్పటికీ.. మరికొద్ది క్షణాల్లో ఆమె మెడలో తాళికట్టే అవకాశం వచ్చినప్పటికీ.. వాడి పాత బాగోతాలు మొత్తం బయటికి వచ్చాయి. అప్పటిదాకా ప్రేమికుడని నమ్మిన ఆమెకు.. విరక్తి వచ్చేసింది. ఇన్ని రోజులపాటు ఇటువంటి వ్యక్తితో నా నేను ఉన్నది అనుకుంది. అంతే మొహమాటం లేకుండా వద్దనుకొంది. అని సంవత్సరాల ప్రేమను పక్కన పెట్టింది. ఏకంగా పెళ్లినే క్యాన్సల్ చేసుకుంది.

ఈ ఎపిసోడ్ తర్వాత స్మృతి డిప్రెషన్ లోకి వెళ్లి పోతుంది.. ఆట మీద దృష్టి పెట్టలేదు.. ఇక కష్టమే అని అందరూ అనుకున్నారు. టీమిండియాలో ఉమెన్ విరాట్ కోహ్లీగా పేరు తెచ్చుకున్న ఆమె.. ఇకపై ఆ స్థాయిలో బ్యాటింగ్ చేయలేదని అందరూ ఒక అంచనాకొచ్చారు. కానీ అలా వెనకడుగు వేస్తే ఆమె స్మృతి ఎందుకు అవుతుంది.. పలాష్ తో జరిగింది మొత్తం ఒక పీడకల అనుకుంది. ఆ బ్యాడ్ ఎపిసోడ్ మొత్తం మర్చిపోయింది. ఇన్ స్టాగ్రామ్ లో వాడి జ్ఞాపకాలు ఉన్న ఫోటోలను మొత్తం తొలగించింది. అంతేకాదు, తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంది. సరికొత్త అవతారంలో కనిపించింది.

ప్రస్తుతం జరుగుతున్న టి20 వరల్డ్ కప్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ జట్టు మీద ఏకంగా హాఫ్ సెంచరీ చేసింది. అది కూడా జట్టు 18 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన సందర్భంలో.. గట్టిగా నిలబడింది. 44 బంతుల్లో 9 ఫోర్లు, రెండు సిక్సర్ల సహాయంతో 68 పరుగులు చేసింది. సెంచరీ చేస్తుంది అనుకుంటున్న క్రమంలో రమీన్ షమీం బౌలింగ్లో అవుట్ అయింది. అప్పటికి కౌర్ తో కలిసి మూడో వికెట్ కు ఏకంగా 91 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది.. తద్వారా పాకిస్తాన్ జట్టుకు మ్యాచ్ మీద పట్టు బిగించే అవకాశం లేకుండా చేసింది.

పాకిస్తాన్ జట్టుపై హాఫ్ సెంచరీ చేయడం ద్వారా స్మృతి సరికొత్త రికార్డును సృష్టించింది. 26 ఇన్నింగ్స్ లలో ఐదు హాఫ్ సెంచరీలు చేసింది. ఈ జాబితాలో మిథాలీ రాజ్ మొదటి స్థానంలో కొనసాగుతోంది. ఆమె 23 ఇన్నింగ్స్ లలో ఐదు హాఫ్ సెంచరీలు చేసింది. కెప్టెన్ కౌర్ 34 ఇన్నింగ్స్ లలో ఐదు హాఫ్ సెంచరీలు నమోదు చేసింది. పూనమ్ రౌత్ 15 ఎన్ని నిమిషాలలో 3 హాఫ్ సెంచరీలు చేసింది. రెండు వికెట్లు కోల్పోయినప్పుడు.. కెప్టెన్ కౌర్ తో కలిసి స్మృతి నిదానంగా బ్యాటింగ్ చేసింది. మైదానం మీద అవగాహన ఏర్పడేంతవరకు తన శైలికి భిన్నంగా బ్యాటింగ్ చేసింది. ఆ తర్వాత జూలు విధిల్చిన సింహం లాగా రెచ్చిపోయింది. దీంతో భారత్ పటిష్టమైన స్థితిలో నిలిచింది. వేరే వాళ్ళ మోజులో పడి పలాష్ స్మృతిని దూరం చేసుకున్నాడు. కానీ, స్మృతికి తాను ఏంటో తెలుసు. అందువల్లే ఈ స్థాయిలో రెచ్చిపోయింది. సూపర్ హాఫ్ సెంచరీ తో అదరగొట్టింది.

టీమిండియా కొట్టిన దెబ్బకు పాక్ అబ్బా.. ఈసారి కూడా అదే జరిగింది..

Team India

IND vs PAK : మహిళల టి20 వరల్డ్ కప్ లో భాగంగా భారత జట్టు పాకిస్తాన్ తో తలపడుతోంది. ఇంగ్లాండ్ లోని ఎడ్జ్ బాస్టన్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది.. టాస్ గెలిచిన భారత మహిళల జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఇంగ్లాండ్ మైదానం మీద తడబడుతున్న భారత బ్యాటర్లు.. మరోసారి అదే ఇబ్బందిని ఎదుర్కొన్నారు. భీకరమైన ప్లేయర్గా పేరుపొందిన షపాలి వర్మ కేవలం ఆరు పరుగులు మాత్రమే చేసి సాదిబా ఇక్బాల్ బౌలింగ్లో ఔట్ అయింది. కీలకమైన వన్ డౌన్ ప్లేయర్ జమీమా రోడ్రిగ్స్ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి తస్మియా బౌలింగ్లో అవుట్ అయింది.

టీమిండియా కేవలం 18 పరుగులకే రెండు వికెట్లు కోల్పోవడంతో.. పాకిస్తాన్ బౌలర్లు మ్యాచ్ మీద పూర్తిస్థాయిలో పట్టు బిగించారు.. పాకిస్తాన్ బౌలర్లలో ఇక్బాల్ కట్టుదిట్టంగా బౌలింగ్ వేసింది. తస్మియా కూడా పదునైన బంతులు వేసింది. దీంతో భారత్ పరుగులు తీయడానికి చాలా కష్టపడింది. భారత బ్యాటర్లలో స్మృతి.. కెప్టెన్ కౌర్ సమయోచితంగా బ్యాటింగ్ చేస్తున్నారు. పాకిస్తాన్ బౌలర్లు రెచ్చిపోయిన చోట.. అనవసరమైన షాట్లకు వెళ్లకుండా ఆడుతున్నారు. వీరిద్దరూ ఈ కథనం రాసే సమయం వరకు మూడో వికెట్ కు 66 పరుగులు జోడించారు. తద్వారా భారత జట్టు 11.4 ఓవర్లలో 7.2 రేట్ చొప్పున 84 పరుగులు చేసింది.

ఈ మ్యాచ్లో భారత జట్టు తన పంతాన్ని నెగ్గించుకుంది. పాకిస్తాన్ దేశంతో ద్వైపాక్షిక సిరీస్ లను భారత పురుషుల జట్టు ఆడటం లేదు. భారత మహిళల జట్టు కూడా అదే విధానాన్ని కొనసాగిస్తోంది.. అంతేకాదు, భారత పురుషుల జట్టు పాకిస్తాన్ ప్లేయర్లతో కనీసం షేక్ హ్యాండ్ కూడా ఇవ్వడం లేదు.. ఆసియా కప్ లో టాస్ ప్రక్రియ తర్వాత ఒక్కసారి కూడా భారత ప్లేయర్లు పాకిస్తాన్ ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. ట్రోఫీ గెలిచిన తర్వాత ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ నుంచి కప్ అందుకోవడానికి కూడా భారత ప్లేయర్లు ఇష్టపడలేదు. అప్పట్లో ఈ వివాదం పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.. ఇప్పుడు భారత మహిళలు కూడా అదే విధానాన్ని కొనసాగిస్తున్నారు. టి20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ఇష్టపడలేదు. కనీసం భారత జట్టు కెప్టెన్ పాకిస్తాన్ కెప్టెన్ తో మాట్లాడేందుకు కూడా ఆసక్తి చూపించలేదు. షేక్ హ్యాండ్ ఇవ్వకుండానే భారత కెప్టెన్ వెను తిరిగారు.

పాకిస్తాన్ పదే పదే భారతదేశం మీద ఉగ్రదాడులకు యత్నిస్తున్న నేపథ్యంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. బోర్డు పెద్దల నిర్ణయాన్ని ఆటగాళ్లు పాటిస్తున్నారు. కొంతమంది కుహనా మేధావులు క్రికెట్లో ఈ పోకడలు ఏంటని ప్రశ్నించినప్పటికీ.. ఉగ్రవాదులతో ఎంత దూరం ఉంటే అంత మంచిదని భారత అభిమానులు కౌంటర్ ఇస్తున్నారు. మొత్తానికి భారత మహిళలు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం మరొకసారి చర్చకు దారి తీసింది.

టిక్కెట్ రేట్స్ తగ్గాక దుమ్ములేపుతున్న 'పెద్ది'..నేడు మ్యాట్నీ షోస్ వరకు నమోదైన గ్రాస్ ఎంతంటే..

Tollywood Box Office Collection
Tollywood Box Office Collection

Peddi collections : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఇప్పటికీ విజయవంతంగా రన్ అవుతూ ముందుకు దూసుకువెళ్తోంది. ఈ చిత్రానికి నమోదు అవుతున్న వసూళ్లను చూసి టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి. సంక్రాంతి తర్వాత విడుదలైన ప్రతీ సినిమా , బాక్స్ ఆఫీస్ వద్ద దారుణమైన పరాజయాన్ని సొంతం చేసుకున్నాయి. కొన్ని సినిమాలకు టాక్ వచ్చినప్పటికీ కూడా ఫ్లాప్ అయ్యాయి. ఇలాంటి డ్రై సీజన్ లో బయ్యర్స్ కి ‘పెద్ది’ చిత్రం ఇచ్చిన ఊపు సాధారణమైనది కాదు. మూతపడిన థియేటర్స్ కూడా మళ్లీ తెరుచుకున్నాయి. 10 రోజులు దాటినా కూడా, ఈ సినిమాకు వరల్డ్ వైడ్ గా చెక్కు చెదరని గ్రాస్ వసూళ్లు నమోదు అవుతున్నాయి. నేడు ఈ చిత్రానికి సంబంధించిన థియేటర్స్ లో టిక్కెట్ రేట్స్ తగ్గించారు మేకర్స్. దాని ప్రభావం నిన్నటి కలెక్షన్స్ మీద చూపించింది , నేటి కలెక్షన్స్ పైన కూడా చూపిస్తోంది.

నిన్ననే తగ్గించిన టిక్కెట్ రేట్స్ తో ఈరోజుటికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ని ఓపెన్ చేశారు. కానీ నిన్నటి టిక్కెట్ రేట్స్ మాత్రం భారీగానే ఉన్నాయి. ఎలాగో రేపు టిక్కెట్ రేట్స్ తగ్గించారు కదా, రేపే వెళ్దాం అనే ఆలోచనలోకి ఆడియన్స్ వచ్చారు , అందుకే నిన్న వీకెండ్ అయినప్పటికీ కలెక్షన్స్ ఆశించినంతగా లేవు. తెలుగు రాష్ట్రాల నుండి కేవలం 3 కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను మాత్రమే రాబట్టింది. కానీ నేడు మాత్రం ప్రతీ సెంటర్ లోనూ హౌస్ ఫుల్స్ నమోదు అవుతున్నాయి. వైజాగ్ , కాకినాడ, నెల్లూరు, విజయవాడ, హైదరాబాద్ ఇలా చెప్పుకుంటూ పోతే, ప్రధాన నగరాల్లో ఈ చిత్రానికి అదనపు థియేటర్స్ ని షెడ్యూల్ చేస్తున్నారు. ఆ థియేటర్స్ ని యాడ్ చేసిన నిమిషాల వ్యవధిలోనే హౌస్ ఫుల్స్ అయిపోతున్నాయి. దీనిని బట్టీ ఫ్యామిలీ ఆడియన్స్ టిక్కెట్ రేట్స్ తగ్గడం తో ఏ రేంజ్ లో థియేటర్స్ కి కదులుతున్నారో అర్థం చేసుకోవచ్చు.

టిక్కెట్ రేట్స్ తగ్గాయి , పబ్లిక్ లో టాక్ కూడా చాలా పాజిటివ్ గా ఉంది, ఇక ఫ్యామిలీ ఆడియన్స్ మరో రెండు వారాలు ఈ చిత్రానికి జాతర లాగా కదులుతారని అభిమానులు , మేకర్స్ బలంగా నమ్ముతున్నారు. మరి అది ఎంత వరకు నిజం అవుతుందో చూడాలి. ఇక పోతే నేడు బుక్ మై షో యాప్ లో ఈ చిత్రానికి గంటకు 15 వేలకు పైగా టిక్కెట్స్ అమ్ముడుపోతున్నాయి. మ్యాట్నీ షోస్ వరకు ఈ చిత్రానికి ఆన్లైన్ లో ట్రాక్ అయినటువంటి గ్రాస్ దాదాపుగా 4 కోట్ల రూపాయిల వరకు ఉందని అంచనా. చూస్తుంటే నేడు ఈ చిత్రానికి కేవలం తెలుగు రాష్టాల నుండే 7 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు నమోదు అయ్యేలా అనిపిస్తోంది.

తెలంగాణ టాపర్స్ విద్యార్థుల కోసం విజయ్ దేవరకొండ సంచలన నిర్ణయం.. వీడియో వైరల్..

Vijay Deverakonda scholarship

Vijay Deverakonda scholarship : టాలీవుడ్ యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉన్న యంగ్ హీరోల్లో ఒకరు విజయ్ దేవరకొండ. సినీ నటులు కేవలం సినిమాలు చేయడం , అభిమానులను ఎంటర్టైన్ చేయడం మాత్రమే కాదు, సామజిక స్పృహ ఇసుమంతైనా ఉండాలి అని చాటి చెప్పే హీరోల్లో ఈయన కూడా ఒకడు. సమయం దొరికినప్పుడల్లా , తనకు తోచిన విధంగా సహాయాలు చేయడం విజయ్ దేవరకొండ హాబీ. హీరోయిన్ రష్మిక తో పెళ్ళైన తర్వాత , ఆయన తన స్వగ్రామానికి వెళ్లి , అత్యధిక మార్కులు సాధించి టాపర్స్ గా నిల్చిన విద్యార్థులకు తమ ‘దేవరకొండ’ ఫౌండేషన్ ద్వారా స్కాలర్ షిప్స్ ఇవ్వాలనేది తన కోరిక అని ఒక సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. తన చిరాకాల కోరిక ని విజయ్ దేవరకొండ నేడు తీర్చున్నాడు. ఈ విషయం గురించి ఆయనపై సోషల్ మీడియా లో ప్రశంసల వర్షం కురుస్తోంది.

నేడు ఆయన రష్మిక తో కలిసి తన తండ్రి స్వగ్రామం , నాగర్ కర్నూల్ జిల్లా, అచ్చం పీత నియోజకవర్గం లోని తుమ్మన్ పేటకు విచ్చేశాడు. ఫిబ్రవరి లో రష్మిక తో కలిసి వచ్చి ప్రకటించిన తన ‘చిన్ననాటి కల’ ని నెరవేర్చుకున్నాడు. అచ్చం పేట మండలానికి చెందిన ప్రభుత్వ పాఠశాలల్లో 9 , 10 తరగతులు చదువుతూ , అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన 180 మంది విద్యార్థులకు భారీ స్కాలర్ షిప్స్ ని విజయ్ దేవరకొండ ప్రకటించాడు. కష్టపడి చదివి తమ తల్లిదండ్రుల పేరుని నిలబెట్టిన 180 మంది విద్యార్థుల వివరాలను ముందుగా తన సోషల్ మీడియా ద్వారా జాబితా ని విడుదల చేశాడు. వాళ్లకు కావాల్సినంత గుర్తింపు ని తీసుకొని రావడం లో ఆయన వంతు పాత్ర పోషించాడు. కేవలం అచ్చం పేట మాత్రమే కాదు , రాబోయే రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా టాపర్స్ కి తమ ‘దేవరకొండ ఫౌండేషన్’ ద్వారా స్కాలర్ షిప్స్ అందించడమే తన లక్ష్యమని ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు విజయ్ దేవరకొండ.

ఇంకా ఆయన ఏమేమి మాట్లాడాడో ఈ క్రింది వీడియో లో చూడండి. సినీ రంగం లో తన ఎదుగుదల తో పాటు , ప్రతిభ ఉన్న విద్యార్థులను కూడా గుర్తించడం ద్యేయంగా పెట్టుకున్న విజయ్ దేవరకొండ మంచి మనస్సు కి నెటిజెన్స్ ఫిదా అయిపోయారు. భవిష్యత్తులో ఆయనకు ఇంకా మంచి కార్యక్రమాలను తలపెట్టేంత శక్తి ఆ దేవుడు ఇవ్వాలని కోరుకుంటూ పోస్టులు పెడుతున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే , విజయ్ దేవరకొండ ప్రస్తుతం ‘రణబలి’, ‘రౌడీ జనార్ధన’ అనే సినిమాలు చేస్తున్నాడు. ఈ రెండు చిత్రాలకు సంబంధించిన గ్లింప్స్ వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియా లో విడుదలై మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకున్నాయి. వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ లో ఉన్న విజయ్ దేవరకొండ, ఈ రెండు సినిమాలతో భారీ కం బ్యాక్ ఇస్తాడని అభిమానులు గట్టిగా ఆశిస్తున్నారు.

ఓహో ఆ చిన్నారిని మోదీ ఎత్తుకోవడం వెనుక ఇంతటి కథ ఉందా

Modi

Narendra Modi France visit : నరేంద్ర మోడీ ప్రస్తుతం జీ7 సమ్మిట్ లో పాల్గొనడానికి ఆయన ఫ్రాన్స్ వెళ్లిపోయారు. ఫ్రాన్స్ దేశంతో భారత్ కు ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం ఉంది. గతంలో అనేక రకాల ఆయుధాలను.. యుద్ధ విమానాలను భారత్ కు అందించింది. భారత్ నుంచి కూడా ఫ్రాన్స్ దేశానికి అనేక రకాల వస్తువులు దిగుమతి అవుతున్నాయి. ఇటీవల కాలంలో యుద్ధాలు విపరీతంగా చోటుచేసుకుంటున్న నేపథ్యంలో.. భారత్ దౌత్య విధానాలను బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అందువల్లే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనేక దేశాలలో పర్యటిస్తున్నారు. ఫ్రాన్స్ దేశంలో జరిగే జి7 సమ్మిట్ లో పాల్గొన్న తర్వాత.. పలు దేశాల ప్రతినిధులతో చర్చిస్తారు.

ఇటీవల నరేంద్ర మోడీ నార్వేలో పర్యటించారు. అక్కడ ఓ జర్నలిస్ట్ నరేంద్ర మోడీని ప్రశ్నించింది. ఆ సమయంలో అప్పటికే విలేకరుల సమావేశం ముగియడంతో నరేంద్ర మోడీ వెళ్ళిపోతున్నారు. ఆమె ప్రశ్నించడం వల్లే నరేంద్ర మోడీ వెళ్లిపోయారని వెస్ట్రన్ మీడియా ప్రచారం చేసింది. ఇక మన దేశంలోని ఉదార వాదులు నరేంద్ర మోడీ మీద ఇష్టానుసారంగా నెగిటివ్ ప్రచారం ప్రారంభించారు. విదేశాలతో ఒప్పందాలు.. దౌత్య విధానాలు కుదుర్చుకుంటున్న నేపథ్యంలో నరేంద్ర మోడీ మీద నెగిటివ్ ప్రచారం తీవ్రంగా ప్రభావం చూపించింది.

దీని గమనించిన నరేంద్ర మోడీ ఫ్రాన్స్ పర్యటనలో సరికొత్త విధానానికి శ్రీకారం చెప్పారు. ఒక మాట కూడా మాట్లాడకుండా.. ఫ్రాన్స్ లో అడుగు పెట్టడమే ఆలస్యం.. వెంటనే ఒక చిన్నారిని ముద్దు చేశారు. అక్కడ నైస్ సిటీలో అడుగుపెట్టిన తర్వాత నరేంద్ర మోడీ ముందుగా భారతీయులను కలిశారు. గుజరాత్ నేపథ్యం ఉన్న భారతీయులు నరేంద్ర మోడీని చూడగానే ఆనందంతో ఉప్పొంగిపోయారు. డ్యాన్సులు వేశారు. వాళ్లు డాన్సులు వేస్తుంటే నరేంద్ర మోడీ ఆసక్తిగా గమనించారు.. ఒక చిన్నారిని ముద్దు చేశారు. ఆ చిన్నారి కూడా మోడీ ఆడించినట్టు ఆడుకున్నాడు. కాసేపు ఉన్న ఒత్తిడి మొత్తం పక్కన పెట్టి నరేంద్ర మోడీ ఆనందంగా ఆ బుడ్డోడితో ఆటలాడారు. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ భారతీయులను చూడగానే నరేంద్ర మోడీ ఆనందం వ్యక్తం చేశారు. భారతీయులు బలమైన బంధాలను వ్యక్తం చేస్తారని.. ఫ్రాన్స్ దేశంలో వారిని చూడడం ఆనందంగా ఉందని నరేంద్ర మోడీ ట్విట్టర్లో పేర్కొన్నారు.

నార్వే పర్యటనలో నరేంద్ర మోడీ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న నేపథ్యంలో.. ఈసారి అటువంటి వాటికి అవకాశం ఇవ్వకుండా నేరుగా భారతీయులను కలిశారు. వారితో మాట్లాడారు. తద్వారా వెస్ట్రన్ మీడియాను దూరం ఉంచారు. ఎందుకంటే డీప్ స్టేట్.. జార్జ్ సోరోస్ వంటి వారు భారత్ మీద విషం చిమ్ముతున్నారు. ఎంత చేయాలో అంత చేస్తున్నారు. ఇదంతా గమనించిన నరేంద్ర మోడీ ప్రతీప శక్తులకు అవకాశం ఇవ్వకుండా ఈసారి కొత్త ప్రణాళిక అమలు చేశారు. దీంతో వెస్ట్రన్ మీడియా అన్ని మూసుకోవాల్సి వచ్చింది.

ఫిఫా వరల్డ్ కప్.. ఆ పని చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు..ఎవరితను..ఏం జరిగింది..

FIFA World Cup

ఫిఫా వరల్డ్ కప్ జరుగుతోంది. మ్యాచ్ లు మొత్తం ఉత్సాహంగా సాగుతున్నాయి. ఆటగాళ్లు హోరాహోరీగా ప్రదర్శన చేస్తున్నారు. గోల్స్ మీద గోల్స్ నమోదవుతున్నాయి. దీంతో అభిమానులకు కావాల్సినంత ఫుట్ బాల్ మజా లభిస్తోంది. ప్రతి మ్యాచ్ కు ప్రేక్షకులు భారీగా హాజరవుతున్నారు. పోటీపోటీగా తమ జట్టు ఆటగాళ్లకు మద్దతు ఇస్తున్నారు. ఆయాజట్లకు సంబంధించిన జాతీయ జెండాలను ప్రదర్శిస్తూ ఆకట్టుకుంటున్నారు.

ఫిఫా వరల్డ్ కప్ ఉత్సాహంగా సాగుతున్న నేపథ్యంలో కెనడా మాజీ ప్రధాని ట్రూడో అడ్డంగా దొరికిపోయాడు. సోషల్ మీడియాలో అతడి గురించి విపరీతంగా చర్చ నడుస్తోంది. దీంతో ఆయన వివరణ ఇచ్చుకున్నారు. పైగా సోషల్ మీడియాలో తనదేశానికి సంబంధించిన జెండాను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, తన మీద వస్తున్న విమర్శలకు సరైన స్థాయిలో సమాధానం చెబుతున్నారు.

ఫిఫా వరల్డ్ కప్ మ్యాచ్ లో అమెరికా, పరాగ్వే తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో అమెరికా నాలుగు గోల్స్ చేసింది. ఇప్పటి వరకూ జరిగిన మ్యాచ్ లలో అమెరికా చేసిన గోల్సే అధికం. ట్రూడో అమెరికా పరాగ్వే మ్యాచ్ కు హాజరయ్యాడు. అతడు ఒక్కడు మాత్రమే కాకుండా ప్రేయసి పెర్రీతో కలిసి హాజరయ్యాడు. అమెరికా పరాగ్వే మ్యాచ్ చూశాడు. అమెరికా ప్లేయర్లు గోల్స్ కొడుతుంటూ చప్పట్లు కొడుతూ సందడి చేశాడు. అతడి పక్కన కేటీ ఫెర్రీ కూడా ఉంది.

కెనడా మాజీ ప్రధాని అమెరికా మ్యాచ్ కు హాజరుకావడం పట్ల సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది.దీనిపై ట్రూడో వివరణ ఇచ్చాడు. ‘కొన్ని సార్లు ఇలాంటి విషయాలలో అడ్డంగా దొరికి పోక తప్పదు. సపోర్టివ్ బాయ్ ఫ్రెండ్ పాత్ర పోషించాల్సి వస్తుంది. నేను ఎవరికి మద్దతు ఇస్తాను?, ఎవరు గెలవాలని కోరుకుంటాను? మీకు తెలుసు’ అంటూ ట్రూడో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. అంతే కాదు, కెనడా జాతీయ జెండా ఏమోజీని కూడా దానికి జత చేశాడు. ట్రూడో, ఫెర్రీ కొంతకాలంగా రిలేషన్ లో ఉన్నారు. కాగా, బోస్నియాతో జరిగిన మ్యాచ్ ను కెనడా డ్రా చేసుకుంది. ఈ మ్యాచ్ లో కెనడా ఒక్క గోల్ చేసింది. ఫిఫా కప్ ను కెనడా, అమెరికా, మెక్సికో నిర్వహిస్తున్నాయి.

తెలంగాణ బిడ్డ చివరి కోరిక తీర్చనున్న పవన్ కళ్యాణ్.. వీడియో వైరల్..

Pawan Kalyan Fans
Pawan Kalyan Fans

Pawan Kalyan viral video : కొన్ని సంఘటనలు మన హృదయాన్ని కలిచివేసే విధంగా ఉంటాయి. ముఖ్యంగా ఏమి తెలియని పసిబిడ్డలు , జీవితం లో ఎన్నో చూడాల్సిన పసిబిడ్డలు , మన కళ్ళ ముందే అంతు చిక్కని ఆరోగ్య సమస్యలతో చనిపోతున్న సందర్భాలు చూసి , మన హృదయాలు విచారంతో నిండిపోయిన ఘటనలు గతం లో మనం ఎన్నో చూశాం. ఇప్పుడు లేటెస్ట్ గా అలాంటి బాధాకరమైన ఘటన వరంగల్ లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే తెలంగాణ ప్రాంతం లోని వరంగల్ కి చెందిన నిరంజన్ అనే కుర్రాడు , గుర్తు తెలియని వ్యాధి తో తీవ్రమైన బాధ పడుతున్నాడు. ఇతని చివరి కోరిక , ప్రముఖ సినీ నటుడు , ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని కలవడం. రీసెంట్ గానే ఈ చిన్నారి ని రాధా మనోహర్ దాస్ స్వామిజి కలిసాడు.

ఈ చిన్నారి కి ధైర్యం చెప్తూ ‘పోకిరి సినిమా చూశావా ?, ఎప్పుడొచ్చాము అనేది ముఖ్యం కాదు అన్నయ్య , బుల్లెట్ దిగిందా లేదా?, అదే విధంగా ఎన్నాళ్ళు బ్రతికాము అనేది కాదు , ఏమి చేశాము అనేదే ముఖ్యం’ అంటూ ఆ చిన్నారి కి ధైర్యం చెప్పడం చాలా బాగా అనిపించింది. అదే విధంగా పవన్ కళ్యాణ్ ని కలవడం ఆ చిన్నారి కోరిక అనే విషయం తెలుసుకున్న దాస్ మాట్లాడుతూ ‘పవన్ కళ్యాణ్ ని కలవాలా?, కలుస్తాడు , కానీ ఇక్కడ కాదు , నువ్వు హైదరాబాద్ కి రావాల్సి ఉంటుంది, ఇతను నిన్ను తీసుకొస్తాడు , నా ఇన్ స్టాగ్రామ్ లో కూడా షేర్ చేశాను , పాతిక వేలమంది చూశారు ‘ అంటూ చెప్పుకొచ్చాడు. గతంలో పవన్ కళ్యాణ్ ఇలాంటి ఎన్నో సందర్భాల్లో చిన్నారుల కోరికలను తీర్చాడు. రాబోయే రోజుల్లో ఈ విషయం పవన్ కళ్యాణ్ వరకు చేరితే ఆయన కచ్చితంగా ఈ చిన్నారిని కలుస్తాడని , ఆ చిన్నారిని హైదరాబాద్ కి రప్పించుకోవడం కాదు , స్వయంగా పవన్ కళ్యాణ్ ఆ చిన్నారి ఇంటికి వస్తాడని అంటున్నారు అభిమానులు. నెటిజెన్స్ చేత కంటతడి పెట్టిస్తున్న ఈ వీడియో ని మీరు కూడా చూసేయండి.

అంతమంది ముందున్నా.. ఆగమన్నాడు.. నితీష్ కుమార్ రెడ్డికి తల్లి అంటే ఎంత ప్రేమో..

Nitish Kumar Reddy Injury
Nitish Kumar Reddy Injury

Nitish Kumar Reddy : అప్పట్లో ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ చేశాడు. ఆస్ట్రేలియా జట్టు మీద అద్భుతమైన పోరాటం చేసి అదరగొట్టాడు. ఎంతమంది దిగ్గజ ప్లేయర్ల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. రవి శాస్త్రి.. సునీల్ గవాస్కర్ లాంటి ప్లేయర్లు అతని ఆట తీరును గొప్పగా వర్ణించారు.. ఇలాంటి ఆట తీరు ఇకపై కూడా కొనసాగించాలని అతడికి సూచించారు.

ఆస్ట్రేలియా జట్టు మీద సెంచరీ చేసిన తర్వాత నితీష్ కుమార్ రెడ్డి ఆట తీరు పూర్తిగా మారిపోయింది. ఐపీఎల్ లో హైదరాబాద్ జట్టులో కీలకమైన ఆటగాడిగా మారిపోయాడు. అతడు ఆడే విధానం సరికొత్తగా ఉండడంతో జాతీయ జట్టులో వరుసగా అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో జరుగుతున్న 3 వన్డేల సిరీస్లో అతడికి ఆడే అవకాశం లభించింది. ఈ నేపథ్యంలో నితీష్ కుమార్ రెడ్డి వచ్చిన అవకాశాలను సద్వినియో చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అంతేకాదు 2027 వన్డే వరల్డ్ కప్ ను లక్ష్యంగా పెట్టుకొని ఆడుతున్నాడు.

నితీష్ కుమార్ రెడ్డి బ్యాటింగ్ చేయగలడు. బౌలింగ్ కూడా చేయగలడు. ఇక ఫీల్డింగ్ అయితే మెరుపుతీగ లాగా కదులుతూ ఉంటాడు. జట్టులో ప్లేయర్లకు అతడు అజాతశత్రువుగా ఉంటాడు. అందువల్లే అతడికి విస్తృతంగా అవకాశాలు వస్తున్నాయి. ఇక ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ లో ఆడుతున్న నితీష్ కుమార్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడాడు. ధర్మశాల వన్డేలో విజయం సాధించిన తర్వాత అతడు విలేకరులతో సరదాగా మాట్లాడాడు. అతడు విలేకరులతో మాట్లాడుతుండగా మధ్యలో ఫోన్ వచ్చింది. ఫోన్ చేసింది అతడి తల్లి. అంతమంది విలేకరులు ఉన్నప్పటికీ వారందరినీ ఆగమని చెప్పి.. ఫోన్ ఎత్తాడు. అమ్మా ఐదు నిమిషాలు ఆగి చేస్తానని చెప్పాడు. ఆ తర్వాత మళ్లీ విలేకరుల సమావేశం కొనసాగించాడు. విలేకరులకు క్షమాపణలు కూడా చెప్పాడు. దానికి సంబంధించిన వీడియోను రాజస్థాన్ రాయల్స్ జట్టు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

నితీష్ కుమార్ రెడ్డికి తన తల్లి అంటే విపరీతమైన ఇష్టం. అందువల్లే అతడు ఆమెకు విపరీతమైన ప్రయారిటీ ఇస్తూ ఉంటాడు. ఇటీవల తనకు నచ్చిన కారు కొనుగోలు చేశాడు. ఆ కారులో తన తల్లిని ముందు సీట్ లో కూర్చోబెట్టి డ్రైవ్ చేశాడు. అంతేకాదు తన ఫేవరెట్ మహేష్ బాబు కొనుగోలు చేసిన రంగు కారునే.. నితీష్ కొనుగోలు చేయడం విశేషం. అంతేకాదు ఆ కారును తల్లితో కలిసి డ్రైవింగ్ చేయడం గమనార్హం. నితీష్ కుమార్ రెడ్డి ఆడే మ్యాచ్ లకు అతడి తల్లిదండ్రులు ఇద్దరు హాజరవుతుంటారు. అతడి సోదరి మైదానంలో మరింత సందడి చేస్తూ ఉంటుంది.

మా మాట వినాల్సిందే.. మీ ఇష్టానుసారం చేస్తామంటే కుదరదు.. ప్రపంచ దేశాలకు అమెరికా వార్నింగ్‌!

US Warning To World Nations
US Warning To World Nations

US Warning To World Nations: మధ్య ప్రాచ్యంలో, ముఖ్యంగా హార్ముజ్‌లో భారత్‌పై వ్యాపార, ఎనర్జీ మార్గాల పరంగా ప్రధాన ఆసక్తి ఉంటుంది. అయితే ఇటీవల మూడు నౌకలపై అమెరికా దాడి చేసింది. ముగ్గురు నావికులు మరణించారు. దీనిపై భారత విదేశాంగ స్పందించింది. విదేశాంగ మంత్రి జైశంకర్‌ అమెరికాకు నిరసన తెలిపారు. అయితే అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.

మా ఆదేశాలు పాటించాలి…
ప్రస్తుతం హర్మూజ్‌ అమెరికా బ్లాకేజీలో ఉంది. ఈ నేపథ్యంలో ఇరాన్‌ చమురు బయటకు వెళ్లకుండా చర్యలు తీసుకుంటోంది. దీంతో హర్మూజ్‌లో నౌకల కదలికలను నియంత్రిస్తోంది. అమెరికా ఆదేశాలు లేకుండా కదిలే నౌకలపై చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో భారత నౌకలపై దాడిచేసింది. హర్మూజ్‌ వంటి కీలక ప్రాంతాల్లో అమెరికా సార్వత్రిక ప్రజాస్వామ్య భద్రతా ఆదేశాలను అనుసరించాలనుకుంటోంది. అందుకే తమ ఆదేశాలు పాటించాలని హుకూం జారీ చేసింది.

భారత ప్రతిస్పందన..
భారతీయులలో విదేశీ సూచనలనన్నా స్వాతంత్య్ర భావనకు బలమైన సున్నితత్వం ఉంటుంది. ఇదే విషయాన్ని విదేశాంగ మంత్రి జైశంకర్‌ మార్కో రూబియోకు స్పష్టం చేశారు. దాడులపై పశ్చాత్తాపం లేకుండా వ్యవహరించడంపై నిరసన తెలిపారు. కానీ రూబియో మాత్రం అమెరికా ఆదేశాలే కీలకమని, అందరూ కట్టుబడి ఉండాలని స్పష్టం చేశారు.

భారత్‌–అమెరికా సంబంధాలు వాణిజ్య, రక్షణ, టెక్నాలజీ ఆధారంగా బలంగా ఉన్నాయి. హార్ముజ్‌ వంటి సున్నిత ప్రాంతాలపై వ్యవహరించే ముందు సంప్రదింపు, సమన్వయం, గడిచిన సందర్భాన్ని పంచుకోవడం అవసరం.

పుట్టింటోళ్లు తరిమేశారు.. నమ్ముకున్న పార్టీ వదిలేసింది.. దువ్వాడ పరిస్థితి ఇలా అయింది..

Duvvada Political Crisis
Duvvada Political Crisis

Duvvada Political Crisis: రీల్స్ “రాజా” పరిస్థితి దారుణంగా మారిపోయింది. పుట్టింటి వాళ్ళు వదిలేశారు. నమ్ముకున్న పార్టీ తరిమేసింది.. అన్నట్టుగా ఆయన పరిస్థితి మారిపోయింది. తాడేపల్లి నుంచి క్లియర్ మెసేజ్ వచ్చింది. రీ ఎంట్రీ లేదని అన్ని మూసుకొని కూర్చోవాలని.. పార్టీ అధిష్టానం చెప్పేసింది. ఇప్పుడు ఏం చేయాలి.. చీరలు అమ్ముకుంటూ.. రీల్స్ చేసుకుంటూ బతకాలి.. ఇది ఆ సిట్టింగ్ ఎమ్మెల్సీ పరిస్థితి.

ఉత్తరాంధ్రలో దువ్వాడ శ్రీనివాస్ కు ఒకప్పుడు భారీగానే ఫాలోయింగ్ ఉండేది. ఫ్యాన్ పార్టీలో ఆయన ఎమ్మెల్సీ కూడా. ఆయన జీవితంలోకి మాధురి రావడంతో పరిస్థితి మారిపోయింది. రాజకీయంలో హత్యలు ఉండవు ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయి అనే సామెత అతని ద్వారా మరోసారి నిరూపితమైంది. భార్యను.. ఇద్దరి పిల్లల్ని వదిలిపెట్టి ఆయన తన దారితను చూసుకున్నాడు. వృద్ధాప్యంలో యవ్వనం లాగా.. పడుచు కుర్రాడి లాగా రెచ్చిపోతున్నాడు. మాధురితో రీల్స్ చేయడం.. టీవీ చానల్స్ లలో ముద్దులు పెట్టడం.. ఇలా రకరకాల హంగామా చేస్తున్నాడు.

దీనివల్ల 2024 లో పార్టీకి చాలావరకు డ్యామేజ్ జరిగింది. టెక్కలి నియోజకవర్గం లోనే కాకుండా.. ఉత్తరాంధ్ర మొత్తంలో పార్టీకి పెద్ద దెబ్బ పడిపోయింది. ఈ నేపథ్యంలో ఇటీవల ఆయన అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డిని కలిశారు. అప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమి చెప్పకపోయినప్పటికీ.. వచ్చి కలువు అన్నారు. అయితే ఇంతవరకు అపాయింట్మెంట్ దొరకలేదు. చివరికి తాడేపల్లి ప్యాలస్ నుంచి క్లియర్ మెసేజ్ వచ్చేసింది. రీ ఎంట్రీ లేదని స్పష్టంగా వర్తమానం అందింది.

వైసీపీలోకి మళ్ళీ వెళ్లడానికంటే ముందు శ్రీనివాస్ బిజెపి.. టిడిపి.. జనసేన నాయకులతో మంతనాలు జరిపారు. పార్టీలో చేర్చుకోవాలని వర్తమానం పంపించారు. ఏ పార్టీ నుంచి కూడా సరైన స్థాయిలో స్పందన రాలేదు. మరోవైపు తాడేపల్లి ప్యాలెస్ గేటు కాదు కదా కనీసం ప్రహరీ గోడ కూడా టచ్ చేయడానికి అవకాశం లేదని వర్తమానం అందడంతో శ్రీనివాస్ అంతర్మదనంలో ఉన్నారు. ఆయన సన్నిహితురాలు ప్రస్తుతం హైదరాబాదులో చీరల వ్యాపారం చేస్తున్నారు. ఆయన కూడా అక్కడే ఉంటున్నారు. అప్పుడప్పుడు ఉత్తరాంధ్రకు వెళ్లి పలు కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. అన్ని పార్టీలు డోర్లు క్లోజ్ చేయడంతో.. శ్రీనివాస్ ఏం చేస్తారు.. ఇండిపెండెంట్గా రంగంలోకి దిగుతారా.. లేక రీల్స్ చేసుకుంటూ.. సోషల్ మీడియా ఛానల్స్ కు ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ వెళ్తారా అనేది చూడాల్సి ఉంది..