Homeహెల్త్‌Kennedy Disease Symptoms: ఈ వ్యాధితో పురుష లక్షణాలు తగ్గుతాయి.. అసలేంటీ 'కెన్నెడీ డిసీజ్'..

Kennedy Disease Symptoms: ఈ వ్యాధితో పురుష లక్షణాలు తగ్గుతాయి.. అసలేంటీ ‘కెన్నెడీ డిసీజ్’..

Kennedy Disease Symptoms: ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ యువకుడు యువకుడు అత్యంత అరుదైన వ్యాధి బారిన పడ్డాడు. గత కొంతకాలంగా కాళ్లు, చేతుల కండరాలు బలహీనపడటంతో నడవడానికి, రోజువారీ పనులు చేసుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతూ ఆయన గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి ని ఆశ్రయించారు. అక్కడ వైద్యులు అతనికి పలు రకాల అధునాతన పరీక్షలు నిర్వహించగా, చివరకు అతనికి ‘కెన్నెడీ డిసీజ్’ (Kennedy’s Disease) ఉన్నట్లు గుర్తించారు. ఈ వ్యాధితో క్రమంగా వారిలో పురుష […]

Kennedy Disease Symptoms: ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ యువకుడు యువకుడు అత్యంత అరుదైన వ్యాధి బారిన పడ్డాడు. గత కొంతకాలంగా కాళ్లు, చేతుల కండరాలు బలహీనపడటంతో నడవడానికి, రోజువారీ పనులు చేసుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతూ ఆయన గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి ని ఆశ్రయించారు. అక్కడ వైద్యులు అతనికి పలు రకాల అధునాతన పరీక్షలు నిర్వహించగా, చివరకు అతనికి ‘కెన్నెడీ డిసీజ్’ (Kennedy’s Disease) ఉన్నట్లు గుర్తించారు. ఈ వ్యాధితో క్రమంగా వారిలో పురుష లక్షణాలు క్షీణిస్తాయని తెలిపారు. అసలేంటీ ‘కెన్నెడీ డిసీజ్’..?

గుంటూరు GGH న్యూరాలజీ విభాగం అధిపతి డాక్టర్ రామకృష్ణ ఈ వ్యాధికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ డిసీజ్ సోకిన వారిలో హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా పురుషులలో ఉండే సెక్స్ హార్మోన్ల (టెస్టోస్టెరాన్) ప్రభావం తగ్గిపోయి, క్రమంగా వారిలో పురుష లక్షణాలు క్షీణిస్తాయని తెలిపారు. అదే సమయంలో స్త్రీలకు సంబంధించిన కొన్ని శారీరక లక్షణాలు (ఉదాహరణకు రొమ్ము భాగం పెరగడం వంటివి) కనిపించడం ఈ వ్యాధి యొక్క ప్రధాన లక్షణమని వివరించారు. దీనితో పాటు మోటార్ న్యూరాన్లు దెబ్బతినడం వల్ల కాళ్లు, చేతుల కండరాలు పూర్తిగా బలహీనపడిపోతాయని చెప్పారు.

అసలేంటీ ఈ ‘కెన్నెడీ డిసీజ్’?
అరుదైన వ్యాధిని మొదటిసారిగా 1962లో డాక్టర్ విలియం ఆర్. కెన్నెడీ అనే ప్రముఖ శాస్త్రవేత్త గుర్తించారు. అందుకే దీనికి ఆయన పేరిట ‘కెన్నెడీ డిసీజ్’ (దీనినే స్పైనల్ అండ్ బల్బార్ మస్కులర్ అట్రోఫీ – SBMA అని కూడా పిలుస్తారు) అని పేరు పెట్టారు. ఇది కేవలం పురుషులలో మాత్రమే లక్షణాలను చూపిస్తుంది. స్త్రీలు ఈ వ్యాధికి సంబంధించిన జన్యువును కేవలం ఒక తరం నుండి మరో తరానికి చేరవేసే ‘క్యారియర్స్’ (వాహకులు) గా మాత్రమే ఉంటారు కానీ, వారిలో ఈ వ్యాధి లక్షణాలు బయటపడవు. 30 నుంచి 50 ఏళ్ల వయసున్న పురుషులలో ఈ వ్యాధి లక్షణాలు ఎక్కువగా బయటపడుతుంటాయి.

ప్రస్తుతం గుంటూరు GGHలో చేరిన ఈ రోగికి న్యూరాలజీ నిపుణుల పర్యవేక్షణలో అవసరమైన వైద్య సహాయం, సపోర్టివ్ థెరపీలను అందిస్తున్నారు. ఎంతో అరుదైన ఇలాంటి కేసులను సైతం గుర్తించి, చికిత్స అందించే సదుపాయాలు ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో ఉండటం విశేషం.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper