Homeఎంటర్టైన్మెంట్Tollywood Reshoots Trend: టాలీవుడ్ లో రీ షూట్స్ పర్వం.. పాపం నిర్మాతలకు తలనొప్పిగా మారిన...

Tollywood Reshoots Trend: టాలీవుడ్ లో రీ షూట్స్ పర్వం.. పాపం నిర్మాతలకు తలనొప్పిగా మారిన డైరెక్టర్స్..

Tollywood Reshoots Trend: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం ఏమి జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. స్టార్ హీరోల నుండి సినిమాలు ఆలస్యం అవ్వడం సంగతి కాసేపు పక్కన పెడితే , మీడియం రేంజ్ హీరోల సినిమాలు కూడా ఆలస్యం అవుతున్నాయి. ఒక్కో సినిమాని పూర్తి చేయడానికి రెండు నుండి మూడేళ్ళ సమయం తీసుకుంటున్నారు. రీసెంట్ గా ఒక స్టార్ హీరో , పాన్ ఇండియన్ డైరెక్టర్ తో చేస్తున్న ఒక బడా చిత్రానికి […]

Tollywood Reshoots Trend: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం ఏమి జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. స్టార్ హీరోల నుండి సినిమాలు ఆలస్యం అవ్వడం సంగతి కాసేపు పక్కన పెడితే , మీడియం రేంజ్ హీరోల సినిమాలు కూడా ఆలస్యం అవుతున్నాయి. ఒక్కో సినిమాని పూర్తి చేయడానికి రెండు నుండి మూడేళ్ళ సమయం తీసుకుంటున్నారు. రీసెంట్ గా ఒక స్టార్ హీరో , పాన్ ఇండియన్ డైరెక్టర్ తో చేస్తున్న ఒక బడా చిత్రానికి సంబంధించిన 30 నిమిషాల షూటింగ్ ఫుటేజీ ని తొలగించి , రీ షూట్ చేయాల్సి వచ్చింది. భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమాకు సంబంధించిన 30 నిమిషాల నిడివి వేస్ట్ అయ్యిందంటే సాధారణమైన విషయం కాదు, నిర్మాతకు నష్టం కోట్లలోనే ఉంటుంది. కేవలం ఈ ఒక్క స్టార్ హీరో సినిమానే కాదు , మిగిలిన స్టార్ హీరోల సినిమాలకు కూడా ఇదే పరిస్థితి.

రీ షూట్స్ మీద రీ షూట్స్ చేస్తున్నారు. రీసెంట్ గా విడుదలైన ‘పెద్ది’ చిత్రానికి కూడా ఇదే పరిస్థితి. ఇక మీడియం రేంజ్ హీరోల క్యాటగిరీలో నాని చేస్తున్న ‘ది ప్యారడైజ్’ చిత్రం గురించి మాట్లాడుకోవడం కూడా అనవసరం అంటున్నారు విశ్లేషకులు. మార్చి 26 న విడుదల అవ్వాల్సిన ఈ సినిమాని , ఆగస్టు 21 కి వాయిదా వేశారు. ఇప్పుడు ఆ తేదీన కూడా రావడం లేదు , అసలు ఈ ఏడాది విడుదల అనుమానమే అని అంటున్నారు. ఇంత ఆలస్యం అవ్వడానికి కారణం రీ షూటింగ్స్. ఇంకా ఈ చిత్రం పూర్తి అవ్వడానికి 60 రోజుల సమయం పడుతుందట. పోనీ షూటింగ్ పూర్తి అయ్యాక అయినా సినిమా విడుదలకు సిద్ధం అవుతుందా అంటే అనుమానమే , మళ్లీ రీ షూట్ చెయ్యాలి అంటే ఏంటి పరిస్థితి? , నిజానికి డైరెక్టర్స్ నిర్మాతల రక్తం తాగేస్తున్నారు అనే చెప్పాలి.

‘పెద్ది’ చిత్రానికి కూడా ఈ రీ షూటింగ్స్ కారణంగా బడ్జెట్ హద్దులు దాటింది. ఆ కారణం చేత నిర్మాత ఈ చిత్రాన్ని భారీ రేట్స్ కి అమ్మాడు. సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము లేపేసింది , కానీ ఇప్పటికీ బ్రేక్ ఈవెన్ అవ్వలేదు , మరో పాతిక కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వస్తే తప్ప , బ్రేక్ ఈవెన్ కష్టం. తప్పు ఎవరిదీ?, కచ్చితంగా డైరెక్టర్ దే. అందరూ అనిల్ రావిపూడి ని చూసి నేర్చుకోవాలి, పర్ఫెక్ట్ బౌండెడ్ స్క్రిప్ట్ తో వస్తాడు , లిమిట్ బడ్జెట్ ని మాత్రమే ఖర్చు చేయిస్తాడు , 6 నెలల్లో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ తో సహా సినిమాని పూర్తి నిర్మాత చేతిలో పెడుతాడు. ఆ చిత్రాలు ఇప్పుడు అవలీలగా 300 కోట్ల గ్రాస్ ని కొల్లగొడుతున్నాయి. ఇది డైరెక్టర్ కి ఉండాల్సిన లక్షణం అంటే, సంవత్సరాల తరబడి సినిమాలు చేయడం , అందరికీ నష్టాలను మిగిలించడం కాదు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper