Homeఎంటర్టైన్మెంట్Peddi 2 Weeks Worldwide Collections: 'పెద్ది' 2 వారాల వరల్డ్ వైడ్ వసూళ్లు.....

Peddi 2 Weeks Worldwide Collections: ‘పెద్ది’ 2 వారాల వరల్డ్ వైడ్ వసూళ్లు.. 14 వ రోజున గట్టి ఎదురుదెబ్బ తగిలింది..

Peddi 2 Weeks Worldwide Collections: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం రీసెంట్ గానే విడుదలై బ్లాక్ బస్టర్ థియేట్రికల్ రన్ ని సొంతం చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. 13 రోజుల పాటు నాన్ స్టాప్ గా కోటి రూపాయలకు పైగా షేర్ వసూళ్లను తెలుగు రాష్ట్రాల్లో రాబట్టిన ఈ చిత్రానికి నిన్నటితో బ్రేక్ పడింది. ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్న లెక్కల ప్రకారం చూస్తే , నిన్న ఈ చిత్రానికి […]

Peddi 2 Weeks Worldwide Collections: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం రీసెంట్ గానే విడుదలై బ్లాక్ బస్టర్ థియేట్రికల్ రన్ ని సొంతం చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. 13 రోజుల పాటు నాన్ స్టాప్ గా కోటి రూపాయలకు పైగా షేర్ వసూళ్లను తెలుగు రాష్ట్రాల్లో రాబట్టిన ఈ చిత్రానికి నిన్నటితో బ్రేక్ పడింది. ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్న లెక్కల ప్రకారం చూస్తే , నిన్న ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి కేవలం 88 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను మాత్రమే రాబట్టింది. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 2 వారాల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. ఈ రెండు వారాల్లో ఈ చిత్రం ప్రాంతాల వారీగా ఎంత వసూళ్లను రాబట్టింది , ఇంకా బ్రేక్ ఈవెన్ అవ్వాల్సిన ప్రాంతాలు ఎన్ని ఉన్నాయి అనేది వివరంగా చూద్దాం.

ముందుగా నైజాం ప్రాంతం వసూళ్ల విషయానికి వస్తే , ఈ చిత్రం 10 రోజుల్లోనే ఈ ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ మార్కును దాటి లాభాల్లోకి అడుగుపెట్టింది. మొత్తం మీద 14 రోజులకు గానూ ఈ చిత్రానికి నైజాం ప్రాంతం నుండి 52 కోట్ల 82 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు నమోదు అయ్యాయి. ఇక ఇతర ప్రాంతాల విషయానికి వస్తే , సీడెడ్ ప్రాంతం నుండి 20 కోట్ల 26 లక్షలు , ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి 21 కోట్ల 93 లక్షలు , ఈస్ట్ గోదావరి నుండి 12 కోట్ల 34 లక్షలు , వెస్ట్ గోదావరి నుండి 8 కోట్ల 74 లక్షల రూపాయిలు , గుంటూరు నుండి 12 కోట్ల 20 లక్షలు , కృష్ణ నుండి 9 కోట్ల 82 లక్షలు , నెల్లూరు నుండి 5 కోట్ల 60 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది.

ఓవరాల్ గా ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి 143 కోట్ల 71 లక్షలు , 218 కోట్ల 30 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇక ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వసూళ్లను ఒకసారి చూస్తే , కర్ణాటక నుండి 14 కోట్ల 85 లక్షలు , తమిళనాడు + కేరళ నుండి 2 కోట్ల 5 లక్షలు , హిందీ + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 11 కోట్ల 80 లక్షలు , ఓవర్సీస్ నుండి 22 కోట్ల 70 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. మొత్తం మీద వరల్డ్ వైడ్ గా రెండు వారాల్లో ఈ చిత్రానికి అన్ని భాషలకు కలిపి 195 కోట్ల రూపాయిల 11 లక్షల షేర్ వసూళ్లు , 329 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. బ్రేక్ ఈవెన్ అవ్వడానికి ఇంకా పాతిక కోట్ల రూపాయిల షేర్ రావాలి , అది దాదాపుగా అసాధ్యమే.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper