Condom shortage during war: యుద్ధం ఎవరి ప్రయోజనాల కోసం జరుగుతోందో.. అమెరికా ఎందుకు దాడులు చేస్తోందో.. ఇరాన్ ఎందుకు గల్ఫ్ దేశాల మీద పగబట్టిందో..ఇజ్రాయిలు క్షిపణులను ఎందుకు ప్రయోగిస్తోందో అర్థం కావడం లేదు. సాధారణంగా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలని గాని.. లోతుగా మదనం చేయాల్సిన అవసరం మెజార్టీ ప్రజలకు లేదు.
ఎంత సేపటికి వారికి బంక్ లో పెట్రోల్ ఉందా? డిజీల్ అందుబాటులో ఉందా? గ్యాస్ లభిస్తోందా? ఇవి మాత్రమేకావాలి. నిత్యావసరాల ధరలు అందుబాటులో ఉండాలి. జీవనం బాగుండాలి. ఇంతవరకే మెజార్టీ ప్రజల ఆలోచనలు ఉంటాయి. అంతకుమించి ప్రజలు ఆలోచించరు. ఆలో చించాల్సిన అవసరం కూడా లేదు.
మధ్య ప్రాచ్యదేశాలలో జరుగుతున్నదాడులు, ప్రతిదాడులు ప్రపంచాన్ని అతాలకుతలం చేస్తున్నాయి. నిత్యావసరాల ధరలు పెరిగాయి. కొన్ని దేశాలలో ఇంధన ధరలు విపరీతంగా ఉన్నాయి. కొన్ని దేశాలు కరోనా కాలం మాదిరిగా లాక్ డౌన్ విధిస్తున్నాయి. మరికొన్ని దేశాలు రేషనలైజేషన్ విధానంలో పెట్రోల్, డిజీల్ విక్రయిస్తున్నాయి.
మధ్యప్రాచ్యం లో జరుగుతున్న యుద్ధం వల్ల ఇప్పుడు మరో ఇబ్బంది వచ్చింది. ఆ ఇబ్బంది పడకగదిలో సుఖాన్ని దూరం చేస్తోందని.. ఓయోరూములకు వెళ్లకుండా చేస్తోందని యూత్ అభిప్రాయపడుతున్నారు. చాటు మాటు సంబంధాలు కొనసాగించే వారు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా అయితే కష్టమని.. ఆ ఐదు నిమిషాల పని ఎలా చేయాలంటూ మదన పడుతున్నారు.
యుద్ధం వల్ల తొడుగుల తయారీ నిలిచిపోయింది. హెల్మెట్(కోడ్ భాష ఇలానే ఉంటుంది) తయారీకి అవసరమైన ముడిసరుకుల సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. వాటి ఉత్పత్తి ఎక్కడికక్కడే ఆగిపోయింది. వీటి తయారీలో లూబ్రికేషన్ కోసం సిలికాన్ ఆయిల్ ఉపయోగిస్తారు. సిలికాన్ ఆయిల్ కొరత తీవ్రంగా ఉండటంతో హెల్మెట్ ల తయారీ ఆగిపోయింది.
హెల్మెట్ చిరిగిపోకుండా ఉండటానికి అమ్మోనియో ఉపయోగిస్తారు. దాని ధరలు కూడా 40 శాతం పెరిగాయి. దీంతో తయారీ దారులు తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. అమ్మోనియాను గల్ఫ్ దేశాలు అధికంగా ఎగుమతి చేస్తుంటాయి. అక్కడ యుద్దం తీవ్రస్థాయి లో ఉండటంతో అమ్మోనియో సరఫరా నిలిచిపోయింది.
ముడి సరుకుల ధరలు పెరగడం వల్ల భవిష్యత్ కాలంలో తొడుగుల ధర విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. మార్కెట్ లో డ్యూరెక్స్, కా** సూత్ర, ఓజోమెన్ కంపెనీలు తొడుగులను తయారు చేస్తున్నాయి.