Netflix India: ఇండియన్స్ అత్యధిక వీక్షించే ఓటీటీ చానెల్స్ లో ఒకటి నెట్ ఫ్లిక్స్. కొత్త సినిమాలు , వెబ్ సిరీస్ లతో ఈ ఓటీటీ సంస్థ అందించే ఎంటర్టైన్మెంట్ తిరుగులేనిది. అయితే అత్యధిక శాతం పశ్చిమ దేశాలకు సంబంధించిన వాళ్ళే ఉంటారు. మన #RRR చిత్రానికి గ్లోబల్ వైడ్ గా ఆ రేంజ్ రీచ్ రావడానికి ప్రధాన కారణం నెట్ ఫ్లిక్స్ అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. ఇదంతా పక్కన పెడితే నెట్ ఫ్లిక్స్ లో ఇప్పటి వరకు అత్యధిక వ్యూస్ ని రాబట్టిన ఇండియన్ మూవీస్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం.
1) #RRR:
కేవలం హిందీ వెర్షన్ లో ఒక్కటే ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. అయినప్పటికీ కూడా ఈ చిత్రానికి 46.25 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఈ చిత్రం తర్వాత ఎన్నో సంచనాత్మక చిత్రాలు విడుదలయ్యాయి కానీ, ఒక్కటి కూడా దరిదాపుల్లోకి రాలేకపోయింది.
2) ధురంధర్ :
గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టించిందో , నెట్ ఫ్లిక్స్ లో కూడా అదే రేంజ్ సునామీ ని క్రియేట్ చేసింది. తెలుగు , తమిళం , హిందీ మరియు ఇతర ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉన్న ఈ సినిమాకు 38.6 మిల్లియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.
3) జవాన్ :
షారుఖ్ ఖాన్ , అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమాకు ఇప్పటి వరకు 35.3 మిలియన్ వ్యూస్ వచ్చినట్టు సమాచారం. తెలుగు తో పాటు ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా ఈ చిత్రం అందుబాటులో ఉంది.
4) యానిమల్ :
సందీప్ వంగ, రణబీర్ కపూర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ బాక్స్ ఆఫీస్ సెన్సేషన్ , ఓటీటీ లో కూడా సెన్సేషన్ క్రియేట్ చేసింది. అన్ని భాషల్లోనూ అందుబాటులో ఉన్న ఈ చిత్రానికి ఇప్పటి వాటాకు 33.4 మిల్లియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.
5) గంగూ భాయ్ ఖైతవాది :
అలియా భట్ , సంజయ్ లీలా భన్సాలీ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద అప్పట్లో ఒక సెన్సేషన్. ఓటీటీ లో కూడా ఈ చిత్రాన్ని ఎగబడి చూసారు. 2022 వ సంవత్సరం లో విడుదలైన ఈ చిత్రానికి ఇప్పటి వరకు 32.84 మిలియన్ వ్యూస్ వచ్చాయి.
6) లాపట్టా లేడీస్ :
అమీర్ ఖాన్ , కిరణ్ రావ్ ప్రొడక్షన్స్ లో నిర్మితమైన ఈ చిత్రానికి బాక్స్ ఆఫీస్ వద్ద పర్వాలేదు అనే రేంజ్ రెస్పాన్స్ వచ్చింది కానీ , ఓటీటీ లో మాత్రం సెన్సేషనల్ రెస్పాన్స్ వచింది. కేవలం హిందీ భాషలో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ చిత్రానికి ఇప్పటి వరకు 32.6 మిలియన్ వ్యూస్ వచ్చినట్టు సమాచారం.
7) లక్కీ భాస్కర్ :
దుల్కర్ సల్మాన్ , మీనాక్షి చౌదరి హీరో హీరోయిన్లుగా , వెంకీ అట్లూరి దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రానికి ఇప్పటి వరకు 31.5 మిలియన్ వ్యూస్ వచ్చాయి. థియేటర్స్ లో భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చింది కానీ , కేవలం 100 కోట్ల గ్రాస్ వసూళ్లను మాత్రమే సొంతం చేసుకుంది. కానీ నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా వ్యూస్ ని అందుకోవడం భవిష్యత్తులో పాన్ ఇండియన్ సినిమాలకు కూడా చాలా కష్టమే అని చెప్పాలి.
8)క్రూ :
కరీనా కపూర్ , కృతి సనన్, టబు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద అంతగా ఆడలేదు కానీ , ఓటీటీ లో మాత్రం దుమ్ము లేపేసింది. 2024 వ సంవత్సరం లో విడుదలైన ఈ చిత్రానికి , ఇప్పటి వరకు 30.2 మిలియన్ వ్యూస్ వచ్చినట్టు సమాచారం.
ఇదంతా పక్కన పెడితే ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలైన బాక్స్ ఆఫీస్ వద్ద 1800 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ‘ధురంధర్ 2: ది రివెంజ్’ చిత్రానికి నెట్ ఫ్లిక్స్ లో అనుకున్నంత స్థాయి లో వ్యూస్ రాలేదు. ఇదే అందరినీ షాక్ కి గురి చేస్తున్న విషయం. ఇప్పటి వరకు ఈ చిత్రానికి 10 మిలియన్ వ్యూస్ కూడా రాలేదట.
