Homeవింతలు-విశేషాలుLiquor Weighing Video: చుక్క తేడా రావద్దు.. త్రాసులో పెట్టి మందును తూకం వేశాడు.. భాస్కర్...

Liquor Weighing Video: చుక్క తేడా రావద్దు.. త్రాసులో పెట్టి మందును తూకం వేశాడు.. భాస్కర్ అవార్డు నీకే బ్రో..

Liquor Weighing Video: చుక్క తేడా రావద్దు. తేడా వచ్చిందంటే మాట వచ్చేస్తుంది. అత్యంత జాగ్రత్తగా.. ఏదో శాస్త్రవేత్తలాగా అతడు మందును తూకం వేశాడు. దానికోసం త్రాసు ఉపయోగించాడు. అసలు అతని డెడికేషన్ చూస్తే.. వారెవ్వా.. ఏమి తెలివితేటలు అనిపిస్తోంది.. ఖర్మ గాలి మందును గ్లాసులో పోసి తూకం వేస్తున్నాడు కానీ.. గట్టిగా చదివి ఉంటే కచ్చితంగా ఐనీ స్టీన్ కు పోటీ ఇచ్చేవాడేమో..

ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో విస్తృతంగా కనిపిస్తున్నాయి. అక్కడి వాతావరణం చూస్తుంటే తెలంగాణలో జరిగినట్లు కనిపిస్తోంది. ఏదో ఒక వేడుక జరుగుతుంటే.. బంధువులు మొత్తం వచ్చినట్టు కనిపిస్తోంది. నేటి కాలంలో సందర్భం ఎటువంటిదైనా.. మందు అనేది కచ్చితంగా ఉండాల్సిందే. అందువల్లే అక్కడ భారీగా మందు పార్టీ ఏర్పాటు చేసినట్లు కనిపిస్తోంది. మందు ఎంత తెచ్చారో తెలియదు.. కాకపోతే మందు మొత్తం అందరికీ సమానంగా రావాలని ఒక రూల్ పెట్టుకున్నట్టు ఉంది. అందువల్లే గ్లాసుల్లో సమానంగా మందు పోశారు. అయినప్పటికీ ఏదో ఒక అనుమానం.. ఎవరికైనా చుక్క ఎక్కువగా వచ్చిన సరే తట్టుకోలేని మనస్తత్వం వారిది. అందువల్లే ఒక త్రాసు తీసుకొచ్చారు. గ్లాసుల లో పోసిన మందును తూకం వేయడం మొదలుపెట్టారు.

ఆ త్రాసులో మందును తూకం వేస్తున్న దృశ్యాలను కొంతమంది తమ ఫోన్లలో చిత్రీకరించారు. ఇంకేముంది ఇదంతా వింతగా ఉండడంతో సోషల్ మీడియాలో పేరు కోసం.. వీడియోను పోస్ట్ చేశారు. అసలే మందు.. వినూత్నంగా తూకం వేస్తున్నారు. చూస్తుంటే ఆ దృశ్యాలు చాలా వింతగా ఉన్నాయి. విచిత్రంగా ఉన్నాయి. జనం కూడా ఎగబడి చూస్తున్నారు. ఇప్పటికే ఈ వీడియో లక్షలలో వీక్షణలు దక్కించుకుంది. ఇక కామెంట్లకైతే లెక్కలేదు. ఓరయ్య మీరు ఖర్మ గాలి మందు తాగుతున్నారు. మందు తూకం వేస్తున్నారు. కొంచెం గట్టిగా చదివి ఉంటే.. తప్పకుండా శాస్త్రవేత్తలు అయ్యేవారు.. ఇప్పటికైనా మించిపోయింది లేదు.. కొత్తగా ట్రై చేస్తే కచ్చితంగా అవుతారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version