Salman Khan Vamshi Paidipally new movie: మన ఇండియన్ లో బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ లిస్ట్ తీస్తే అందులో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్(Salman Khan) పేరు ముందు వరుసలో ఉంటుంది. 2007 నుండి 2020 వరకు సల్మాన్ ఖాన్ కి బాలీవుడ్ లోనే కాదు, ఇండియా లోనే పోటీ ఇచ్చే హీరో లేదు. టాక్ తో సంబంధం లేకుండా ఆయన చిత్రాలకు వచ్చే ఓపెనింగ్స్, ఒకవేళ టాక్ వస్తే ఆ చిత్రాలకు బాక్స్ ఆఫీస్ వద్ద నమోదయ్యే సెన్సేషనల్ కలెక్షన్స్ ని చూసి సల్మాన్ ఖాన్ కి దీటైన హీరో భవిష్యత్తులో కూడా ఎవ్వరూ రారేమో అని అనుకున్నారు. కానీ ఇదంతా ఒకప్పుడు, కరోనా లాక్ డౌన్ తర్వాత సల్మాన్ ఖాన్ సినిమాలను బాలీవుడ్ జనాలు చూడడం మానేశారు. కారణం మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చేయకపోవడమే. నిన్న గాక మొన్న ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన వాళ్ళు కూడా క్రేజీ పాన్ ఇండియన్ మూవీస్ తో డిఫరెంట్ సబ్జక్ట్స్ తో బాక్స్ ఆఫీస్ ని కొల్లగొడుతుంటే , సల్మాన్ ఖాన్ మాత్రం కమర్షియల్ సినిమా వద్దనే ఆగిపోయాడు.
ఆయన గత చిత్రం ‘సికిందర్’ బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. 100 కోట్ల నెట్ మార్కుని అయితే అందుకుంది కానీ, అది సల్మాన్ రేంజ్ కి ఏ మాత్రం సరిపడదు అనే చెప్పాలి. ఇప్పుడు ఆయనకు అర్జెంటు గా ఒక భారీ బ్లాక్ బస్టర్ హిట్ కావాలి. అది ఇచ్చే డైరెక్టర్ కోసం గత కొన్నాళ్లకు గా ఆయన అన్వేషిస్తూనే ఉన్నాడు. ప్లాన్ ప్రకారం అయితే, ఆయన ప్రముఖ తమిళ టాప్ డైరెక్టర్ అట్లీ తో కలిసి పని చెయ్యాలి. కానీ చివరి నిమిషం లో ఏమైందో ఏమో తెలియదు కానీ అట్లీ అల్లు అర్జున్ తో సినిమా చేస్తున్నాడు. అయితే ఇప్పుడు ఆయన తన ఆశలన్నీ మన టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి మీద పెట్టుకున్నాడు.
గత కొంతకాలం క్రితం వంశీ పైడిపల్లి సల్మాన్ ఖాన్ ని కలిసి ఒక కథ విషయం లో చర్చలు జరిపారు. ఆ కథ సల్మాన్ ఖాన్ కి బాగా నచ్చింది, కానీ బౌండెడ్ స్క్రిప్ట్ అడగడం తో ఇన్ని రోజులు ఈ ప్రాజెక్ట్ ని అధికారికంగా ప్రకటించలేదు . అయితే నిన్న పూర్తి బౌండెడ్ స్క్రిప్ట్ ని వినిపించాడట. ఈ స్క్రిప్ట్ సల్మాన్ ఖాన్ కి తెగ నచ్చేసిందట. ఆ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తో కాసేపే క్రితమే ఈ ప్రాజెక్ట్ ని అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. వంశీ పైడిపల్లి దిల్ రాజు ఆస్థాన దర్శకుడు అనే విషయం మన అందరికీ తెలిసిందే. వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన చివరి చిత్రం ‘వారిసు’. తమిళ హీరో విజయ్ హీరో గా నటించిన ఈ చిత్రం కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. కొంత గ్యాప్ తర్వాత వీళ్ళ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న ఈ చిత్రం ఎంతమేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.
#SalmanKhan – A Phenomenon who has delivered countless moments of celebration to audiences across the world …
Now joins hands with our very own, dearest blockbuster filmmaker #VamshiPaidipally for #SVC63 #SalmanKhanVamshiPaidipallyFilm goes on floors this April…… pic.twitter.com/2CdrVeFU1I
— Sri Venkateswara Creations (@SVC_official) March 30, 2026