Homeవింతలు-విశేషాలుDaughter In Law Funny Reel: అత్తపై ఫన్నీ రీల్ పెట్టిన కోడలు.. ట్విస్టేంటంటే...

Daughter In Law Funny Reel: అత్తపై ఫన్నీ రీల్ పెట్టిన కోడలు.. ట్విస్టేంటంటే కొడుకు అరెస్ట్.. ఎలాగంటే..

Daughter In Law Funny Reel: ఇటీవల చాలా మంది రీల్స్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. భార్య భర్తలు, స్నేహితులు, కుటుంబ సభ్యుల్లో భాగంగా అత్తా కోడళ్లు కలిసి వీడియోలు తీస్తున్నారు. అయితే ఓ అత్తపై కోడల ఫన్నీ రీల్ చేయగా.. అది పెద్ద వివాదానికి దారి తీసింది. అయితే ఈ వివాదంలోకి కొడకు ఎంట్రీ ఇవ్వడంతో అతడు ఏకంగా పోలీస్ స్టేషన్ లో ఊసల లెక్కబెడుతున్నాడు. ఇంతకీ ఈ వివాదమేంటి? అసలు అత్తా కోడళ్లు రీల్స్ చేస్తే కొడుకు ఎందుకు అరెస్ట్ అయ్యాడు?

చెన్నైకి చెందిన శ్రీకాంత్, అభిరామి ప్రేమ వివాహం చేసుకున్నారు. శ్రీకాంత్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ఇతను డ్యూటీలోకి వెళ్లిన తరువాత అభిరామి తన అత్తపై ఫన్నీ రీల్ చేసింది. ఈ వీడియోను అభిరామి తన వాట్సాప్ స్టేటస్‌లో పోస్టు చేసింది. అయితే ఈ వీడియోను చూసిన శ్రీకాంత్ ఆగ్రహంతో ఊగిపోయాడ. దీంతో ఇంటికి రాగానే భార్యతో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో ఆమెపై దాడికి దిగాడు. అయితే దాడిలో గాయపడిన అభిరామి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు శ్రీకాంత్‌ను అరెస్టు చేశారు. అనంతరం ఘటనకు సంబంధించిన వివరాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

సోషల్ మీడియాలో పెట్టే చిన్న పోస్టులు కూడా కుటుంబ జీవితంలో ఎంత పెద్ద సమస్యలకు దారితీస్తాయో ఈ ఘటన మరోసారి చూపించింది. ముఖ్యంగా దంపతుల మధ్య పరస్పర అవగాహన లేకపోతే, సాధారణంగా కనిపించే విషయాలే తీవ్ర కలహాలకు కారణమవుతాయని ఈ కేసు స్పష్టం చేసింది.

ఇలాంటి ఘటనల నేపథ్యంలో కుటుంబ సభ్యులు ఆవేశానికి లోనవకుండా, సమస్యలను సంయమనంతో పరిష్కరించుకోవాలని పోలీసులు సూచిస్తున్నట్లు తెలుస్తోంది. వాట్సాప్ స్టేటస్, రీల్స్, పోస్టుల వంటి వాటిని తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల అనవసర ఘర్షణలు పెరిగే అవకాశం ఉంటుందని కూడా గుర్తు చేస్తున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version