Homeవింతలు-విశేషాలుMovies And Healthy Aging: సినిమాలు చూస్తే వృద్ధాప్యం రాదట..

Movies And Healthy Aging: సినిమాలు చూస్తే వృద్ధాప్యం రాదట..

Movies And Healthy Aging: అస్తమానం ఆ టీవీ ఏంటి.. ఊరికే సినిమా చూడకపోతే మరేం పని లేదా.. ఆ ఫోన్లో గంటల తరబడి చూస్తావు.. ఏముంది అందులో.. ఇలాంటి ప్రశ్నలు తరచు మనకు ఎదురవుతూనే ఉంటాయి. వాస్తవానికి ఎంటర్టైన్మెంట్ అనేది మన జీవితంలో ఒక భాగం అయిపోయింది. మనదేశంలో ఎంటర్టైన్మెంట్ వేలకోట్ల వ్యాపారం. దీని ఆధారంగానే లక్షలాదిమంది బతుకుతున్నారు. పరోక్షంగా అంతకంటే ఎక్కువ మంది లబ్ధి పొందుతున్నారు.

సినిమాలు చూస్తే చెడిపోతావని చాలామంది అంటుంటారు. ఎందుకంటే అందులో కాల్పానిక సన్నివేశాలు ఉంటాయి. అవి మన లైఫ్ మీద ఏదో ఒక రూపంలో ప్రభావం చూపిస్తూనే ఉంటాయి. వెనకటి కాలంలో సినిమాలను ఇంటిల్లిపాది చూసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మితిమీరిన హింస.. ద్వంద్వ అర్ధాలు.. చూడకూడని సన్నివేశాలు పెరిగిపోతున్నాయి. అలాంటప్పుడు సినిమాలను కేవలం ఒక వర్గం వారు మాత్రమే చూస్తున్నారు.

ఇలాంటి సినిమాలను పెద్దలు వ్యతిరేకిస్తుంటారు. వాటిని చూస్తే ఏమొస్తుందని ప్రశ్నిస్తుంటారు. అయితే ఇకపై ఈ ప్రశ్నలు మన పెద్దవాళ్లు వేసే అవకాశం లేదు. ఎందుకంటే తాజాగా జరిగిన అధ్యయనంలో వింత విషయం వెలుగులోకి వచ్చింది. తరచుగా సినిమాలు చూసేవారు వృద్ధాప్యానికి దూరంగా ఉంటారట. వారిలో వృద్ధాప్య ఛాయలు కనిపించవట. తరచుగా సంగీత కచేరీలకు వెళ్లడం.. మ్యూజియాలను సందర్శించే వారికి వృద్ధాప్యం రాదట. జపాన్ పరిశోధకుల పరిశోధనలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

జపాన్ శాస్త్రవేత్తలు సాంస్కృతిక కార్యక్రమాలు.. వృద్ధాప్యానికి మధ్య గల ఉన్న సంబంధాలను గుర్తించడానికి ఒక అధ్యయనాన్ని చేశారు.. ఈ నేపథ్యంలో ప్రతి నెలకు ఒకసారి సినిమా, సంగీత కచేరీలు.. మ్యూజియాలను సందర్శించే వారిని పరిశీలించారు. వారి అలవాట్లను.. మిగతా వారి అలవాట్లను గమనించారు. అయితే సంగీత కచేరీలు.. మ్యూజియాలకు వెళ్లే వారి శరీరం మిగతా వారితో పోల్చి చూస్తే మూడు రెట్లు యవ్వనంగా ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు..

ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడని వారి శారీరక వయసు 69.9 సంవత్సరాలుగా ఉంటాయి.. అదే వయసు ఉండి.. సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షిస్తున్న వారి బయాలజికల్ ఏజ్ 66.9 సంవత్సరాలుగా ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. సినిమాలను అదే పనిగా చూడటం వల్ల నేత్ర సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మానసిక ఆనందం కోసం సినిమాలను అప్పుడప్పుడూ చూస్తే తప్పు లేదని శాస్త్రవేత్తలు అంటున్నారు. కాకపోతే సినిమాలు మనుషుల ఆలోచనా విధానాన్ని మార్చుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
image.png

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version