Homeబిజినెస్Maruti Suzuki Baleno new design: సరికొత్త డిజైన్ లో మారుతి సుజుకి బాలేనో.. ధర...

Maruti Suzuki Baleno new design: సరికొత్త డిజైన్ లో మారుతి సుజుకి బాలేనో.. ధర అందుబాటులోనే..

Maruti Suzuki Baleno new design: Maruti Suzuki కంపెనీ నుంచి అన్ని వర్గాలను ఆకట్టుకునే విధంగా కార్లు మార్కెట్ లోకి వస్తాయి. ఇందులో భాగంగా హ్యాచ్ బ్యాక్ నుంచి ప్రీమియం కార్ల వరకు ఈ కంపెనీ నుంచి చూడొచ్చు. అయితే మైలేజ్ కోరుకునే వారు సైతం మారుతీ కార్ల వైపు చూస్తుంటారు. వీరికి అనుగుణంగా దీని నుంచి Baleno కారు వినియోగదారులను ఆకర్షిస్తుంది. ఇది ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో పాటు సరికొత్త స్టైలిష్ డిజైన్లను కలిగి ఉండడంతో చాలామంది దీని గురించి చర్చించుకుంటున్నారు. అయితే ఈ ఏడాదిలో బాలేనో కొత్త హంగులతో తీర్చిదిద్దుకొని మార్కెట్లోకి వచ్చింది. ఈ కారు ఎలా ఉందంటే?

Maruti Suzuki బాలెనో కారులో 1.2 కే సిరీస్ డ్యూయల్ పెట్రోల్ ఇంజన్ ఉండనుంది. అలాగే ఇందులో CNG వేరియంట్ ను కూడా చూడొచ్చు. ఈ ఇంజన్ లీటర్ ఇంధనానికి 32 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది. ఈ కారు ఎక్స్టీరియర్ డిజైన్ విషయానికి వస్తే LED హెడ్ లాంప్స్ ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఇవి DRL తో కూడుకొని ఉన్నాయి. అలాగే నెక్స్ వేవ్ గ్రిల్ తోపాటు విశాలమైన క్యాబిన్ ఉండనుంది. ఇంటీరియర్ డిజైన్ విషయానికి వస్తే ఇందులో 9 అంగుళాల స్మార్ట్ ప్లే ప్రో ప్లస్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, హెడ్ ఆఫ్ డిస్ప్లే, 360 డిగ్రీ కెమెరా వంటివి ఉన్నాయి. సేఫ్టీ కోసం సిక్స్ ఎయిర్ బ్యాగ్స్, హిల్ హోల్డ్ అసిస్ట్ వంటివి ఉన్నాయి. భారత్ గ్లోబల్ టెస్టులో ఈ కారుకు 4 స్టార్ రేటింగ్ రావడంతో రక్షణ ప్రమాణాలు ఉన్నట్లు తెలుస్తోంది.

పూర్తిగా ప్రీమియం లుక్ తో కనిపించే ఈ కారు నేటి తరం వారిని ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దారు. అలాగే దీని ధర కూడా అందుబాటులోనే ఉండడంతో చాలామంది ప్రీమియం లుక్ తో ఉండే కారు కొనాలని అనుకునేవారు దీనికోసం సర్చ్ చేస్తున్నారు. ఈ కారును రూ.6.61 లక్షల ప్రారంభ ధరతో రూ.9.28 లక్షల వరకు విక్రయిస్తున్నారు. ఇందులో పెట్రోల్ వేరియంట్ తో పాటు CNG ఆప్షన్ కూడా ఉండడంతో మైలేజ్ విషయంలో ఈ కారు బెస్ట్ ఆప్షన్ గా ఉండనున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం మార్కెట్లో బాలెనో నెక్సా బ్లూ, స్ప్లెండిడ్ సిల్వర్, గ్రాండ్యూర్ గ్రే వంటి కలర్లలో అందుబాటులో ఉంది. ఇప్పటికే ఈ కారును చాలామందిని ఆదరించారు. అయితే కొత్త తరహా డిజైన్ తో ఉన్న ఈ కారు ఎంత ఆదరణ పొందుతుందో చూడాలి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version