Train Romance Video Viral: నేటి కాలంలో నాలుగు గోడల గదిలో జరగాల్సిన ముచ్చటను.. పదిమందిలో చేస్తున్నారు. పదిమంది చూస్తుండగా చేస్తున్నారు. పదిమంది ఏమనుకుంటారో అనే భయం లేకుండా చేస్తున్నారు. అటువంటి దృశ్యాలు.. అటువంటి సంఘటనలు సోషల్ మీడియా ద్వారా బయటపడడం ఇటీవల కాలంలో పరిపాటిగా మారిపోయింది. అయినప్పటికీ చాలామంది మారడం లేదు. తమ తీరును మార్చుకోవాలనుకోవడం లేదు. ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ.. అడ్డగోలుగా వ్యవహరిస్తూ.. పరువు తీసుకుంటున్నారు. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో దర్శనమిస్తోంది. ఆ వీడియోని చూసిన వారంతా థూ యాక్.. వీళ్ళెం మనుషులంటూ మండిపడుతున్నారు.
సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ దర్శనమిస్తోంది. ఆ వీడియోలో ఓ యువ జంట ట్రైన్ లో సైడ్ బెర్త్ సీట్లో కూర్చున్నారు. ఆ తర్వాత పడుకున్నారు. మాటల్లో మునిగి తేలిన తర్వాత.. చిలిపి చేష్టలతో ఒకరిని ఒకరు ఆట పట్టించుకున్న తర్వాత.. అసలు వ్యవహారాన్ని మొదలుపెట్టారు. చుట్టూ ప్రయాణికులు ఉన్నారు అనే సోయిని మర్చిపోయి ప్రేమలో మునిగి తేలారు. అతడు ఆమెను ఏకంగా గట్టిగా వాటేసుకున్నాడు. ముద్దులు కూడా పెడుతున్నాడు.. ఆమె వద్దని వారించకుండా మరింత రెచ్చగొడుతోంది. దీంతో అతడు ఆకలిగొన్న బెబ్బులి మాదిరిగా రెచ్చిపోతున్నాడు.
ఈ దృశ్యాలను రహస్యంగా ఎవరో తమ ఫోన్లలో బంధించారు. ఆ తర్వాత సోషల్ మీడియాకు ఎక్కించారు. అంతే క్షణాలలోనే ఈ వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించడం మొదలుపెట్టింది. వేలను దాటి లక్షల్లో వీక్షణలు సొంతం చేసుకుంది. వారిద్దరి వ్యవహారాన్ని చూసిన నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. మీ ఇంట్లో పడక గదులు లేవా.. మీకు ఏమాత్రం ప్రైవసీ లభించడం లేదా.. ఇదేంపాడు పని.. నలుగురు చూస్తుండగా ఇంతటి దారుణానికి తెగించడానికి సిగ్గు లేదా అంటూ కామెంట్లు చేస్తున్నారు. కొందరేమో వారిద్దరికీ పెళ్లి కాలేదు కాబట్టి అలా చేస్తున్నారు.. పెళ్లి అయి ఉంటే ఇలా ఎందుకు బరితెగిస్తారని కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ వీడియో కొంతమంది రసహృదయులకు ఉద్రేకాన్ని కలిగిస్తుంటే.. మిగతా వారికి ఇబ్బందిని కలిగిస్తోంది.