Brazil permanent residency: శీర్షిక చదివి ఇదేంటి ఇలా పెట్టారు ఏంటి.. ధరలు మండిపోతున్న ఈ రోజుల్లో 27 వేలకు శాశ్వత నివాసం ఎలా సాధ్యమవుతుంది.. ఇదేదో మమ్మల్ని బురిడీ కొట్టించే ప్రణాళిక.. మోసపూరితమైన విధానం అనుకుంటున్నారా.. మీకు వచ్చిన అనుమానం కరెక్టే. కాకపోతే 27 వేలకు కచ్చితంగా మీకు శాశ్వత నివాసం లభిస్తుంది. అది మాత్రమే కాదు కోరుకున్న సౌకర్యాలు.. ఇంకా చెప్పాలంటే చాలా లభిస్తాయి. చదువుతుంటే ఉత్సాహంగా ఉంది కదూ. ఇంతకీ ఎక్కడ ఆ ప్రదేశం అని తెలుసుకోవాలని కోరిక కలుగుతుంది కదూ.. ఇంకెందుకు ఆలస్యం.. చదివేయండి ఈ కథనం
బ్రెజిల్.. ఈ పేరు తెలుసు కదా.. ఫుట్ బాల్, కార్నివాల్.. సాంబా డ్యాన్సులకు మాత్రమే కాదు.. ఈ దేశం పర్యాటకపరంగా కూడా అభివృద్ధి చెందిందే.. ఈ దేశాన్ని ప్రతి ఏడాది లక్షల మంది సందర్శిస్తుంటారు. టూరిస్టులను పెంచుకోవడానికి బ్రెజిల్ దేశం కూడా రకరకాల ఆఫర్లను ప్రకటిస్తూ ఉంటుంది. ఎందుకంటే బ్రెజిల్ దేశానికి పర్యాటకపరంగా ఆదాయం దండిగా వస్తూ ఉంటుంది. పర్యాటకంగా ఆదాయం పెరగడానికి బ్రెజిల్ ఇటీవలి కాలంలో కొత్త కొత్త కసరత్తులు చేస్తోంది. పైగా ఆదేశ జనాభా కూడా తగ్గిపోతుంది. అందువల్లే వినూత్నమైన పథకం ఒకదానికి శ్రీకారం చుట్టింది బ్రెజిల్. ఆ పథకం వల్ల బ్రెజిల్ పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతుంది.
27,000 మాత్రమే
ఒక దేశంలో పర్మినెంట్ రెసిడెన్సి పొందాలంటే చాలా ప్రయాస ఎదుర్కోవాల్సి ఉంటుంది. అది కూడా అభివృద్ధి చెందిన దేశాలలో పర్మనెంట్ రెసిడెన్సి దక్కించుకోవాలంటే అంత ఈజీ కాదు. అయితే దీనిని సులభతరం చేసింది బ్రెజిల్. 27 వేలకే పర్మనెంట్ రెసిడెన్సి అవకాశం కల్పిస్తోంది. 20 డాలర్ల ఆదాయం ఉన్నవారు ముందుగా తాత్కాలిక నివాసానికి బ్రెజిల్ లో అర్హత సాధిస్తారు. ఆ తర్వాత దానిని పర్మినెంట్ రెసిడెన్సిగా మార్చుకోవచ్చు..పాస్ పోర్ట్, పోలీస్ శాఖ ఇచ్చే అధికారిక ధ్రువీకరణ పత్రం, లీగల్ ఎంట్రీ, జాబ్ లేదా ఇన్వెస్ట్మెంట్ సర్టిఫికెట్ ఉంటే పర్మనెంట్ నివాస హక్కు లభిస్తుంది. ఈ ప్రాసెస్ మొత్తం పూర్తి కావడానికి 120 నుంచి 180 రోజుల సమయం పడుతుంది. బ్రెజిల్ దేశంలో చాలావరకు భూభాగం ఖాళీగానే ఉంటుంది. ఇక్కడ వ్యవసాయం విస్తారంగా సాగుతున్నప్పటికీ.. భూభాగాన్ని తగ్గట్టుగా జనాభా లేకపోవడం బ్రెజిల్ దేశాన్ని ఇబ్బంది పెడుతోంది. జనాభా తక్కువగా ఉండడం కూడా ఆ దేశ ఆర్థిక రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. అందువల్లే ఈ వినూత్నమైన విధానానికి శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది.