Japan: నిద్ర అనేది మనకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. శారీరక అలసటను దూరం చేస్తుంది. కళ్లకు విశ్రాంతిని ఇస్తుంది. నిద్ర పోవడం ద్వారా శరీరం సామర్థ్యాన్ని పెంచుకుంటుంది. అవసరమైన శక్తిని సమకూర్చుకుంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయం కానీ, జపాన్‌కు చెందిన ఓ వ్యక్తి మాత్రం నిద్రను తగ్గించుకుని పనిసామర్థ్యం పెంచుకున్నానని చెబుతున్నాడు. జపాన్‌కు చెందిన 40 ఏళ్ల డైసుకే హోరీ తన జీవితాన్ని ‘రెట్టింపు‘ చేయడానికి కనీస నిద్ర కోసం తన మెదడు, శరీరానికి శిక్షణ ఇచ్చాడని పేర్కొన్నాడు. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం, పశ్చిమ జపాన్‌లోని హ్యోగో ప్రిఫెక్చర్‌కు చెందిన హోరీ, తన నిద్రను రోజుకు 30–45 నిమిషాలకు మాత్రమే తగ్గించుకోగలిగాడు. అది తన పని సామర్థ్యాన్ని మెరుగుపరిచిందని పేర్కొన్నాడు. హోరీ పనిలో ఏకాగ్రతను కొనసాగించడానికి సుదీర్ఘ నిద్ర కంటే అధిక–నాణ్యత నిద్ర చాలా ముఖ్యమని పేర్కొన్నారు. తినడానికి ఒక గంట ముందు క్రీడలు లేదా కాఫీ తాగడం వలన, మీరు మగతను దూరం చేసుకోవచ్చని తెలిపాడు. వారి పనిలో నిరంతర దృష్టి అవసరమయ్యే వ్యక్తులు సుదీర్ఘ నిద్ర కంటే అధిక–నాణ్యత నిద్ర నుంచి ఎక్కువ ప్రయోజనం పొందుతారని పేర్కొన్నాడు. వైద్యులు, అగ్నిమాపక సిబ్బంది తక్కువ విశ్రాంతి వ్యవధిని కలిగి ఉంటారు, కానీ అధిక సామర్థ్యాన్ని కలిగి ఉంటారు అని హోరి హాంకాంగ్ తెలిపాడు.
మూడు రోజులు అధ్యయనం..
హోరి వాదనలను దగ్గరగా చూడటానికి, జపాన్‌కు చెందిన యోమియురి టీవీ విల్ యు గో విత్ మి అనే రియాలిటీ షోలో అతనిని మూడు రోజుల పాటు అధ్యయనం చేసింది. షో ప్రకారం, హోరీ ఒకసారి కేవలం 26 నిమిషాలు నిద్రపోయి, ఉత్సాహంతో మేల్కొన్నాడు, అల్పాహారం తర్వాత పనికి వెళ్లి, జిమ్‌కు వెళ్లాడు. 2016లో, హోరీ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించాడు. జపాన్ షార్ట్ స్లీపర్స్ ట్రైనింగ్ అసోసియేషన్‌ను స్థాపించాడు. శిక్షణ తర్వాత తన నిద్రను ఎనిమిది గంటల నుంచి 90 నిమిషాలకు తగ్గించుకున్నానని, నాలుగు సంవత్సరాల పాటు దానిని అనుసరించానని పాల్గొన్న వారిలో ఒకరు పేర్కొన్నారు. ఆమె తన చర్మం మరియు మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోగలిగానని పేర్కొంది.
2 వేల మందికి శిక్షణ..
ఇదిలా ఉంటే హోరి.. నిద్రపై ఇతరులకు శిక్షణ కూడా ఇస్తున్నారు. సంగీతం, మెకానికల్ డిజైన్ మరియు పెయింటింగ్‌లను ఇష్టపడే హోరీ 2 మంది విద్యార్థులకు అల్ట్రా–షార్ట్ స్లీపర్‌లుగా మారడానికి శిక్షణ ఇచ్చాడని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదించింది. దీంతో వాళ్లు కూడా నిద్రను తగ్గించుకునే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.