Goat Movie: టాలీవుడ్ బడా హీరోలందరూ పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది గుంటూరు కారం మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. సంక్రాంతి కానుకగా గుంటూరు కారం విడుదలైంది. అనంతరం జులై 27న ప్రభాస్ కల్కి విడుదల చేశారు. ఈ భారీ పాన్ ఇండియా చిత్రం బ్లాక్ బస్టర్ నమోదు చేసింది. వరల్డ్ వైడ్ రూ. 1200 కోట్ల వసూళ్లు రాబట్టింది. బాహుబలి 2 అనంతరం ప్రభాస్ క్లీన్ హిట్ నమోదు చేశాడు.
ఇక అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 ఆగస్టు 15న విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడింది. ఆ మూవీ డిసెంబర్ 6న విడుదల కానుంది. ఎన్టీఆర్ దేవర మాత్రం ఈ నెలలో విడుదలకు సిద్ధం అవుతుంది. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ డిసెంబర్ నెలలో విడుదల చేయనున్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయంగా బిజీ అయ్యారు. ఆయన చిత్రాలు ఎప్పుడు విడుదలవుతాయి స్పష్టత లేదు. మహేష్ బాబు-రాజమౌళి మూవీ ఇంకా పట్టాలెక్కలేదు.
తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్స్ పెద్ద చిత్రాల విడుదల లేక కళ కోల్పోయాయి. అయితే మురారి, ఇంద్ర, గబ్బర్ సింగ్ రీ రిలీజ్ కావడం ఒకింత ఉపశమనం కలిగించే అంశం. స్టార్ హీరోల చిత్రాల విడుదల లేకపోవడంతో చిన్న చిత్రాలను వరుసగా విడుదల చేస్తున్నారు. ఈ వారం రెండు చిన్న చిత్రాలు థియేటర్స్ లో సందడి చేయనున్నాయి.
సుహాస్ నటించిన జనక అయితే గనక సెప్టెంబర్ 7న విడుదల కానుంది. సుహాస్ చిత్రాల పట్ల ప్రేక్షకుల్లో ఓ పాజిటివ్ వైబ్ క్రియేట్ అయ్యింది. ఆయన చిత్రాల్లో కొత్త కంటెంట్ ఉంటుందని ఆడియన్స్ భావిస్తున్నారు. కాబట్టి జనక అయితే గనక చిత్రానికి స్పందన దక్కుతుంది. అలాగే నివేదా థామస్ ప్రధాన పాత్రలో నటించిన ’35 చిన్న కథ కాదు’ సెప్టెంబర్ 6న విడుదల కానుంది. ఇది ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కింది.
ఈ రెండు చిత్రాలు విజయ్ గోట్(ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం)తో పోటీ పడననున్నాయి. గోట్ డబ్బింగ్ మూవీ అయినప్పటికీ ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంది. విజయ్ కొన్నాళ్లుగా మార్కెట్ విపరీతంగా పెంచుకునాడు. తెలుగులో కూడా ఆయన చిత్రాలకు ఆదరణ దక్కుతుంది. ఈ వారం తెలుగు ఆడియన్స్ ఫస్ట్ ఛాయిస్ గోట్ అనడంలో సందేహం లేదు. అయితే టాక్ ఆధారంగానే ప్రేక్షకులు థియేటర్స్ కి వెళతారు. చిన్న చిత్రాలు జనక అయితే గనక, 35 పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే గోట్ ని పక్కన పెట్టేసే సూచనలు కలవు. గోట్, జనక అయితే గనక, 35 చిత్రాల బాక్సాఫీస్ ఫైట్ ఎలా ఉంటుందో చూడాలి…