Homeవింతలు-విశేషాలుViral Pre Wedding Shoot Video: ప్రీ వెడ్డింగ్ షూట్ లో చ*నిపోయారు.. ఇదేం పిచ్చి...

Viral Pre Wedding Shoot Video: ప్రీ వెడ్డింగ్ షూట్ లో చ*నిపోయారు.. ఇదేం పిచ్చి రా బాబూ!

Viral Pre Wedding Shoot Video: పిచ్చి తలకెక్కింది.. రోకలి చుట్టండి అన్నారట.. వెనకటికి ఓ పెద్దమనిషి.. సోషల్ మీడియా ప్రభావం పెరిగిన తర్వాత కొంతమంది వ్యవహార శైలి కూడా ఇలానే ఉంది. పిచ్చి పిచ్చి పనులు చేయడం.. వాటిని రీల్స్ లాగా రూపొందించడం.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం.. వచ్చిన లైక్స్, కామెంట్లను చూసి శునకానందం పొందడం ఇటీవలి కాలంలో పెరిగిపోయింది. ప్రీ వెడ్డింగ్ షూట్ లలో పిచ్చిపిచ్చి పనులు చేసి.. సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెంచుకోవడం కూడా ఇటీవల కాలంలో అధికమైపోయింది.

Also Read: 17 ఏళ్లు దాటింది.. రాజస్థాన్ ఈసారైనా రాజసాన్ని చూపుతుందా? బలాలేంటి?బలహీనతలేంటి?

ఈ తరహా వ్యక్తులపై ఎన్ని రకాలుగా విమర్శలు వచ్చినప్పటికీ.. పోలీస్ కేసులు నమోదవుతున్నప్పటికీ మార్పు రావడం లేదు. పోలీసులు స్వయంగా రంగంలోకి దిగి.. తమదైన ట్రీట్మెంట్ ఇస్తున్నప్పటికీ.. చాలామంది మారకపోగా.. మరింత రెచ్చిపోతున్నారు. అటువంటిదే ఈ సంఘటన కూడా. ప్రీ వెడ్డింగ్ షూట్ పేరుతో ఇప్పటికే చాలామంది జంటలు వికృతమైన ప్రయోగాలు చేశారు. దారుణమైన యాంగిల్స్ లో ఫోటోలు దిగారు.. వీడియోలు షూట్ చేసుకున్నారు. అయితే అందులో ఈ జంట మాత్రం పీహెచ్డీ చేసింది అని చెప్పొచ్చు.

ప్రీ వెడ్డింగ్ షూట్ పేరుతో ఓ జంట నీటి కుంటలో విగత జీవుల్లాగా పడి ఉన్నట్టు వీడియో తీయించుకుంది. అయితే మొదట్లో ఈ వీడియోని చూసిన చాలామంది ఆ జంట చనిపోయారని అనుకున్నారు. ఆ తర్వాత అదంతా షూట్ అని తెలిసి ఆశ్చర్యపోయారు. ఈ ధోరణిపై నెటిజన్లు స్థాయిలో మండిపడుతున్నారు. విభిన్న తత్వాన్ని ప్రదర్శించే క్రమంలో ఇలాంటి వికృతాలకు పాల్పడడం దారుణమని నెటిజన్లు అంటున్నారు. “కొత్తగా ఉండాలంటే అందులో విభిన్నతత్వం ఉండాలి. ఆకట్టుకునే విధంగా ఉండాలి. అలాకాకుండా ఇలా చనిపోయినట్టు నటించడం ఏంటి.. నీటి కుంటలో పడి విగత జీవుల మాదిరిగా కనిపించడం ఏంటి.. ఇదంతా ఏం కల్చర్.. దీనిని ప్రీ వెడ్డింగ్ షూట్ అంటారా.. ఇలా చేసి ఏం సాధిద్దాం అనుకుంటున్నారు.. దీనిని నూతనత్వం అంటారా.. స్టైల్ అంటే పదిమంది అనుసరించే విధంగా ఉండాలి.. అలాకాకుండా ముఖం మీద ఉమ్మి వేసే విధంగా ఉండకూడదని” నెటిజన్లు పేర్కొంటున్నారు.

కేరళ రాష్ట్రంలో ఆ మధ్య ఓ జంట తమ వెడ్డింగ్ ఫోటోషూట్ నిర్వహించింది. అందులో వారిద్దరూ కనిపించిన తీరు విమర్శల పాలైంది. ఒంటిమీద నూలు పోగు లేకుండా.. ఇద్దరూ ఒకే వస్త్రాన్ని ధరించారు. పైగా అది కూడా అత్యంత దారుణంగా ఉంది. సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం తాము ఇలా చేశామని ఆ జంట చెప్పింది. అయితే ఆ ఫోటోలు, వీడియోల ను చూసిన చాలామంది తీవ్రంగా విమర్శించారు. జంతువులు కూడా ఇలా ఉండమని వారిపై మండిపడ్డారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Mahesh Babu: మహేష్ బాబు కి నచ్చినట్టుగా సినిమాను తీయలేకపోయిన దర్శకులు వీళ్లే…

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్...

Varanasi Teaser: ‘వారణాసి’ టీజర్ విషయంలో కంగారు పడుతున్న రాజమౌళి… వస్తుందా రావట్లేదా… ..

Varanasi Teaser: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో భారీ విజయాలను సాధిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు. రాజమౌళి లాంటి దర్శకుడు...

Monsoon Health Tips: వర్షాకాలంలో ఈ టీ తీసుకుంటే రోగాలకు దూరం ఉన్నట్లే..

Monsoon Health Tips: వర్షాకాలంలో వాతావరణంలో తేమ పెరగడం, నీరు, ఆహారం కలుషితం అవుతూ ఉంటుంది. ఈ క్రమంలో వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశాలుండడం వల్ల జలుబు, దగ్గు, గొంతునొప్పి,...

Furniture Rental: ఇల్లు మారుతున్నారా? ఇక ఇంటి సామగ్రి కొనాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే..

Furniture Rental: కొత్తగా ఉద్యోగంలో చేరిన చేరిన వారు.. రకరకాల కారణాల వల్ల నిత్యం నగరాలకు వలస వెళ్లే వారికి ఇంటి సామగ్రిని సమకూర్చుకోవడం పెద్ద ప్రయాసే. అద్దె ఇల్లు అయినా...

Today 22 July 2026 Horoscope: ఈ రాశుల వారి ఆదాయం ఈరోజు రెండింతలు.. ఏ పని...

Today 22 july 2026 horoscope : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు తులా రాశిలో సంచారం చేయనున్నాడు. దీంతో కొన్ని...
Oktelugu Epaper
Exit mobile version