Homeవింతలు-విశేషాలుSnake In Pant: ప్యాంట్ లో ఏదో తేడాగా అనిపించింది.. సరి చూసుకున్నాడు.. అందరూ చూస్తుండగానే...

Snake In Pant: ప్యాంట్ లో ఏదో తేడాగా అనిపించింది.. సరి చూసుకున్నాడు.. అందరూ చూస్తుండగానే నేల కొరిగాడు..

Snake In Pant: మనిషి జీవితం క్షణకాలం అంటారు పెద్దలు.. మనిషి పుట్టుక వెనుక ఎన్ని అద్భుతాలు అయితే జరుగుతాయో.. చావులో కూడా అదే స్థాయిలో ఘటనలు చోటు చేసుకుంటాయి. వెనకటికి పరావస్తు చిన్నయ సూరి అనే కవి మంచి జీవితాన్ని నీటి బుడగప్రాయం అని పేర్కొన్నాడు.. ఆయన అన్నమాట ఇతడి జీవితంలో మాత్రం నూటికి నూరు శాతం సరిపోతుంది. అతడిది జర్మని. పర్యటకుడిగా ఈజిఫ్ట్ వెళ్లాడు.. అక్కడ రకరకాల ప్రాంతాలలో పర్యటిస్తున్నాడు. ఈ క్రమంలో ఓ […]

Snake In Pant: మనిషి జీవితం క్షణకాలం అంటారు పెద్దలు.. మనిషి పుట్టుక వెనుక ఎన్ని అద్భుతాలు అయితే జరుగుతాయో.. చావులో కూడా అదే స్థాయిలో ఘటనలు చోటు చేసుకుంటాయి. వెనకటికి పరావస్తు చిన్నయ సూరి అనే కవి మంచి జీవితాన్ని నీటి బుడగప్రాయం అని పేర్కొన్నాడు.. ఆయన అన్నమాట ఇతడి జీవితంలో మాత్రం నూటికి నూరు శాతం సరిపోతుంది.

అతడిది జర్మని. పర్యటకుడిగా ఈజిఫ్ట్ వెళ్లాడు.. అక్కడ రకరకాల ప్రాంతాలలో పర్యటిస్తున్నాడు. ఈ క్రమంలో ఓ రిసార్ట్ ప్రాంతంలో జరుగుతున్న స్నేక్ షోకు వెళ్ళాడు. అక్కడ స్నేక్ షో నిర్వహిస్తున్న వ్యక్తి కోబ్రా పాములను అక్కడికి వచ్చిన వారి మెడలో వేశాడు. ఆ పాములతో విన్యాసాలు చేశాడు. ఈ నేపథ్యంలో ఒక పామును నెమ్మదిగా ఆ పర్యటకుడి ప్యాంటులోకి విడిచాడు. ఆ పాము అతడి కాలు మీద కరిచింది.

ఆ తర్వాత ఆ పాము నెమ్మదిగా అతని ప్యాంటు లోకి వెళ్లింది. తేడాగా ఉందని భావించిన అతడు ఆ పామును బయటికి పంపించే ప్రయత్నం చేశాడు. అప్పటికే అతడిని ఆ పాము కరవడంతో విషం ఎక్కింది. వెంటనే ఆ వ్యక్తి చనిపోయాడు. స్నేక్ షో నిర్వహిస్తున్న వ్యక్తి సరదా కోసం ఆ పామును అలా వదిలడం.. అది కాస్త ఆ పర్యాటకుడి ప్రాణాన్ని తీసింది. దీనిపై జర్మనీ పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఈజిప్టు ప్రాంతంలో స్నేక్ షో నిర్వహించడం అధికారికంగా ఎప్పటినుంచో సాగుతోంది. అయితే ఆ పాముల కోరలు తీసి స్నేక్ షో నిర్వహిస్తుంటారు. ఆ స్నేక్ షో నిర్వహించిన వ్యక్తి పాముల కోరలు తీయకుండానే ఆ పని చేయడంతో ఇంతటి దారుణం జరిగింది.

సాధారణంగా పాముల్లో విషపూరితమైనవి.. విష రహితమైనవి ఉంటాయి. కోబ్రాలలో విషం ఉంటుంది. వాటి విషానికి విపరీతమైన తీవ్రత ఉంటుంది. అవి కాటు వేసినప్పుడు విషం నేరుగా నరాల్లోకి ఎక్కుతుంది. నాడీ వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమవుతుంది. ఆ తర్వాత అంతర్గత రక్తప్రసరణ వ్యవస్థ పూర్తిగా నాశనం అవుతుంది. అంతర్గత రక్తస్రావం విపరీతంగా జరిగి.. చూస్తుండగానే ప్రాణాలు పోతాయి. ఆ జర్మనీ పర్యాటకుడి విషయంలో కూడా ఇదే జరిగింది. కోబ్రా విషం అతని ప్రాణాన్ని తీసింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper