Secret of Sea Sand : సముద్రం అనగానే అందరికీ హోరెత్తే అలలు.. చేపల వేట గుర్తొస్తాయి. ఇక సముద్రపు ఒడ్డున అందమైన బీచ్ కనిపిస్తుంది. సముద్రపు ఒడ్డున వెన్నల రాత్రిలో ఇసుక తెన్నెలపై గడిపిన జ్ఞాపకాలు మదిలో మెదులుతాయి. సాధారణంగా నదులు, వాగులకు ఇసుక వరద రూపంలో కొట్టుకువస్తుంది. కానీ సముద్రం నిలకడగా ఉంటుంది. కానీ, సముద్రపు ఒడ్డుని ఇసుక ఉంటుంది. అదెలా వస్తుంది అన్నది చాలా మందికి తెలియని రహస్యం.
సముద్రాలు.. భూమిపై ఉన్న 90 శాతం జీవరాశులకు నిలయాలు. అనేక కొత్తకొత్త రకాల జీవులు సముద్రంలో ఉంటాయి. ఇక సముద్ర తీరాలలోని మృదువైన, తెల్లటి ఇసుక కనిపిస్తుంది. ఈ ఇసుక వెనుక సముద్రంలో నివసించే ఓ అద్భుతమైన సముద్ర జీవి ఉంది. అదే ప్యారట్ ఫిష్. ఈ విషయం నూటికి తొంబై మందికి తెలియదు. ఈ చేపలు సముద్ర తీరాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
Also Read: నా జీవితంలో ఇలాంటి అనుభవం ఎప్పుడూ ఎదురు అవ్వలేదు అంటూ ఎమోషనల్ అయిన నిర్మాత AM రత్నం!
ఆ చేపల మలమే..
ప్యారట్ ఫిష్, దాని చిలుక ముక్కు లాంటి నోటి ఆకృతి వల్ల ఈ పేరు పొందింది, సముద్రంలోని పగడపు దిబ్బలను(కోరల్ రీఫ్స్) ఆహారంగా తీసుకుంటుంది. ఈ చేపలు పగడాలను కొరికి, తమ నోటిలోని ప్రత్యేక దంతాలతో గట్టి పగడాలను సన్నని రజనుగా మారుస్తాయి. ఈ రజను జీర్ణక్రియ తర్వాత విసర్జన రూపంలో సముద్రంలోకి విడుదలవుతుంది, ఇదే తెల్లటి ఇసుకగా మారుతుంది. ఈ ప్రక్రియ సహజంగా, నిరంతరంగా జరుగుతూ సముద్ర తీరాలను ఏర్పరుస్తుంది.
ప్రక్రియ ఎలా జరుగుతుంది?
ప్యారట్ ఫిష్ యొక్క దంతాలు పగడాలను చూర్ణం చేసేందుకు ప్రత్యేకంగా రూపొందాయి. ఈ చూర్ణం జీర్ణవ్యవస్థ ద్వారా ఇసుక రేణువులుగా మారి, సముద్ర జలాల్లో వ్యాపిస్తుంది. అలల ద్వారా ఈ రేణువులు తీరానికి చేరి, అందమైన బీచ్‌లను రూపొందిస్తాయి.
ఏడాదికి వంద కిలోల ఇసుక ఉత్పత్తి..
ప్యారట్ ఫిష్ ఇసుక ఉత్పత్తి సామర్థ్యం ఆశ్చర్యకరం. ఒకే చేప సంవత్సరానికి వందల కిలోల ఇసుకను ఉత్పత్తి చేయగలదు. ఉష్ణమండల సముద్రాలలో, ముఖ్యంగా కరీబియన్, హవాయి, మరియు మాల్దీవుల వంటి ప్రాంతాలలో, ఈ చేపలు అధిక సంఖ్యలో ఉండటం వల్ల ఇసుక ఉత్పత్తి గణనీయంగా ఉంటుంది.
పర్యావరణ పరిరక్షణ..
ఈ ఇసుక ఉత్పత్తి సముద్ర తీరాలను రూపొందించడమే కాక, సముద్ర పర్యావరణ వ్యవస్థలో సమతుల్యతను కాపాడుతుంది. పగడపు దిబ్బలను కొరకడం వల్ల అవి అతిగా పెరగకుండా నియంత్రణలో ఉంటాయి, ఇది సముద్ర జీవవైవిధ్యానికి ఉపయోగకరం. ప్యారట్ ఫిష్ వల్ల ఏర్పడే ఇసుక, మృదువైన తెల్లటి బీచ్‌లను సృష్టిస్తుంది, ఇవి పర్యాటకం, స్థానిక ఆర్థిక వ్యవస్థలకు ముఖ్యమైనవి. అయితే, వాతావరణ మార్పులు, మానవ కార్యకలాపాల వల్ల పగడపు దిబ్బలు క్షీణిస్తున్నాయి, ఇది ప్యారట్ ఫిష్‌లపై ప్రభావం చూపుతుంది.