Homeలైఫ్ స్టైల్Bird story with moral: భవిష్యత్తు ఎలా ఉండాలి అనేది ఈ పక్షి కథ ఏం...

Bird story with moral: భవిష్యత్తు ఎలా ఉండాలి అనేది ఈ పక్షి కథ ఏం చెబుతుందో తెలుసా?

Bird story with moral: మానవ జీవితం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే తమ జీవితం ఎంతో సాఫీగా సాగాలని.. కష్టం రాకూడదని.. నిత్యం సంతోషంగా ఉండాలని కోరుకునే వారు చాలామంది ఉన్నారు. కానీ తాత్కాలికంగా సుఖంగా ఉండాలని.. ప్రస్తుతం జీవితం హాయిగా ఉంటే సరిపోతుంది అని.. అనుకునేవారు ఎప్పటికీ గొప్పవారు కాలేరు. గొప్పవారు కాకుండా భవిష్యత్తులో మనశ్శాంతితో ఉండలేరు. మరి అలాంటప్పుడు భవిష్యత్తులో బాగుండాలంటే ఇప్పుడు ఏం చేయాలి? అలా చేయకపోతే ఏం జరుగుతుంది? అనేది చెప్పడానికి ఈ చిన్న కథ ఉదాహరణ. మరి దాని గురించి తెలుసుకుందామా…

Also Read:సరే, సరే, ఒకే ఒకే.. అనడం తెలుసు. బట్ ఈ పదాలు ఎప్పుడు మొదలయ్యాయి?

ఒక అడవిలో ఒక పక్షి ఒక చెట్టుపై తన గూడును ఏర్పాటు చేసుకుంది. కొన్ని రోజులపాటు ఎంతో హాయిగా జీవనం సాగించింది. అయితే ఒకరోజు జడివాన రావడంతో ఆ పక్షి గూడు కట్టిన చెట్టు ఒకవైపు వంగిపోయింది. దీంతో ఆ చెట్టుపై ఉన్న గూడు చెదిరిపోయింది. అయితే మరుసటి రోజు వాతావరణం ప్రశాంతంగా ఉంది. దీంతో ఆ పక్షి మళ్ళీ అక్కడే గూడు కట్టుకొని జీవితాన్ని కొనసాగించింది. ఈ క్రమంలో పక్షి తన పిల్లలతో కూడా ఇక్కడే జీవించ సాగింది. అయితే మరో రోజు జడివాన రావడంతో ఈసారి చెట్టు పూర్తిగా కూలిపోయింది. దీంతో పక్షి బోరున విలపించింది. అయితే ఒకసారి ఇక్కడ ప్రమాదం వచ్చినప్పుడు మరోసారి అదే ప్రమాదం ఇక్కడ వస్తుందని పక్షి ఊహించుకోలేకపోయింది. అంతేకాకుండా ప్రస్తుతం తనకు హాయిగా ఉందని భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ఇక్కడే ఉండడంతో తన గూడుతో పాటు పిల్లలు కూడా చనిపోయారు.

అలాగే మనుషులు కూడా ఇప్పటి సుఖాన్ని కోరుకుంటే భవిష్యత్తులో చాలా కష్టపడాల్సి వస్తుంది. కొంతమంది తమకు అన్ని రకాల సౌకర్యాలు ఉండగానే.. తమ జీవితానికి ఇది చాలు అన్నట్లుగా ఉండిపోతారు. అవసరానికి డబ్బు రాగానే వాటిని ఖర్చు చేసుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తారు. కానీ తల్లిదండ్రుల ఇచ్చిన డబ్బును రెట్టింపు చేయాలని కొందరు మాత్రమే అనుకుంటారు. ఎందుకంటే ఒకప్పుడు ఉన్న అవసరాలు ఇప్పుడు లేవు. ప్రస్తుతం అన్ని రకాల అవసరాలు పెరిగిపోయాయి. అంతేకాకుండా ధరల్లో కూడా మార్పులు వచ్చాయి. ఈ క్రమంలో వచ్చే ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. దీంతో భవిష్యత్తులో మరింతగా ఇబ్బంది పడాల్సి వస్తుందని ముందే ఊహించి ఇప్పటినుంచే కష్టపడడం నేర్చుకోవాలి.

అలా ప్రస్తుతం కష్టపడిన వారే భవిష్యత్తులో ప్రశాంతంగా ఉండగలుగుతారు. లేకుంటే తాత్కాలికంగా సుఖం కావాలని కోరుకునేవారు ఇష్టం వచ్చినట్లు ఆహారాన్ని భుజిస్తారు. దీంతో భవిష్యత్తులో అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే డబ్బులు క్రమ పద్ధతిలో ఖర్చు పెట్టకుండా ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేస్తే భవిష్యత్తులో అవసరాలకు అందుబాటులో ఉండదు.

Also Read: ఈ కొత్త ట్రెండ్.. పిల్లలకు పూర్తి స్వేచ్ఛను ఇస్తుందా? మరి పిల్లల భవిష్యత్తు?

ఇలా ఏ విషయంలోనైనా తాత్కాలిక ప్రయోజనాలను మానుకొని.. భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ముందుకెళ్లాలి. అయితే మరి ఎలాంటి ఖర్చులు చేయకుండా కూడా పెట్టాలని కాదు.. దుబార ఖర్చులు లేదా ఇతర వ్యసనాలకు వెచ్చించే వాటికి దూరంగా ఉండాలి. అప్పుడే జీవితాంతం క్రమ పద్ధతిలో ఉండగలుగుతారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
RELATED ARTICLES

Most Popular