Hari Hara Veera Mallu updates: ఒక స్టార్ హీరో తో భారీ బడ్జెట్ సినిమా తీయడం అంటే సాధారణమైన విషయం కాదు. నిర్మాతలు రాజమౌళి(SS Rajamouli) దర్శకుడు అయితే ఖర్చు బడ్జెట్ ని ఖర్చు చేయడానికి సిద్ధపడుతారు కానీ, మిగిలిన దర్శకులకు ఖర్చు చెయ్యాలంటే ఆలోచిస్తారు, అంత నమ్మకం పెట్టలేరు. కానీ సినిమాలకు చాలా రోజుల నుండి దూరంగా ఉంటూ వస్తున్న AM రత్నం(AM Ratnam), రాజకీయాల్లో ఫుల్ బిజీ గా ఉంటూ,సినిమాలకు ఎప్పుడూ డేట్స్ ఇస్తాడో తెలియని పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) తో 250 కోట్ల రూపాయలకు పైగా భారీ బడ్జెట్ ని ఖర్చు చేసి ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu Movie) చిత్రాన్ని నిర్మించేందుకు ముందుకు వచ్చాడు. ఈ సినిమాని సుమారుగా ఆయన 5 ఏళ్ళ పాటు నిర్మించాడు. ఎన్నో కష్టాలు, అడ్డంకులను దాటుకొని ఒక సినిమాని ఇన్నేళ్లు మోయడం ఏ నిర్మాత వల్ల కూడా సాధ్యం అవ్వదు. కానీ AM రత్నం బలంగా నిలబడ్డాడు.
Also Read: హీరో విజయ్ ని చూసి మన తెలుగు హీరోలు చాలా నేర్చుకోవాలి అంటూ దిల్ రాజు వివాదాస్పద వ్యాఖ్యలు!
సినిమాని పూర్తి చేసి ఈ నెల 24న విడుదల చేయడానికి సిద్దమయ్యాడు. రీసెంట్ గా విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్ ని చూస్తే ఆయన ఈ చిత్రం కోసం ఏ రేంజ్ లో డబ్బులు ఖర్చు చేశాడో అర్థం అవుతుంది. జూన్ 12 న విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేశాడు కానీ,అప్పటికి పని పూర్తి కాకపోవడం తో వాయిదా వేసాడు. అయితే రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ఆయన ‘హరి హర వీరమల్లు’ కి సంబంధించిన విశేషాలను పంచుకున్నాడు. ఆ ఇంటర్వ్యూ కి సంబంధించిన ప్రోమో కాసేపటి క్రితమే విడుదలైంది. ఈ ప్రోమో లోని విశేషాలు ఏంటో ఒకసారి చూద్దాము. ముందుగా యాంకర్ ఒక ప్రశ్న అడుగుతూ ‘ఈ సినిమా బాగా ఆలస్యం అయ్యింది అంటూ జరిగిన ప్రచారానికి ట్రైలర్ సరైన సమాధానం ఇచ్చింది..మీకు ఎలాంటి ఫీడ్ బ్యాక్ వచ్చింది’ అని అడుగుతాడు.
Also Read: 60 షోస్ నుండి 70 వేల డాలర్లు.. అమెరికా లో ‘హరి హర వీరమల్లు’ కి సెన్సేషనల్ అడ్వాన్స్ బుకింగ్స్!
దానికి AM రత్నం సమాధానం చెప్తూ ‘అద్భుతమైన స్పందన వచ్చింది. మొదటి నుండి నేను పెట్టుకున్న అంచనాలు ఎందులోనూ తప్పు అవ్వలేదు. ఈ సినిమా విషయం లో కూడా అది జరగలేదు’ అంటూ చెప్పుకొచ్చాడు. యాంకర్ మరో ప్రశ్న అడుగుతూ ‘అధికారికంగా ఒక విడుదల తేదీని ప్రకటించిన తర్వాత వెనక్కి వెళ్లడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది కదా’ అని అడగ్గా, దానికి రత్నం సమాధానం చెప్తూ ‘నా జీవితం లో మొట్టమొదటిసారి ఈ సినిమాకే అలాంటి అనుభవం ఎదురైంది. ఇంత దూరం సినిమా వచ్చింది,చాలా పెద్ద సినిమా, టెక్నీకల్ గా జూన్ లో పూర్తి అవ్వదు, నాకు జులై వరకు సమయం ఇవ్వండి అని ఎంత బ్రతిమిలాడినా అమెజాన్ ప్రైమ్ వాళ్ళు ఒప్పుకోలేదు’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇంకా ఆయన ఏమి మాట్లాడాడో ఈ క్రింది ప్రోమో లో చూడండి.