Homeఅంతర్జాతీయంTrump Epstein Titanic pose: ట్రంప్, ఎఫ్ స్టీన్.. టైటానిక్ ఫోజు..ఎలా వస్తాయి రా మీకు...

Trump Epstein Titanic pose: ట్రంప్, ఎఫ్ స్టీన్.. టైటానిక్ ఫోజు..ఎలా వస్తాయి రా మీకు ఇలాంటి ఐడియాలు!

Trump Epstein Titanic pose: అమెరికాను పరిపాలించే వారికి మెదడు మోకాళ్లలో ఉంటుంది అంటారు. అగ్రరాజ్యం అనే తల బిరుసు తో అమెరికా అధ్యక్షులు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంటారు. నచ్చని దేశాల మీద దాడులు చేస్తుంటారు. గిట్టని అధ్యక్షులను చంపడం లేదా అపహరించడం చేస్తుంటారు. వివిధ దేశాలలో ఉన్న విలువైన వనరులను తమ దేశానికి తరలిస్తుంటారు. ఆంక్షలు గురించి నరకం చూపిస్తుంటారు. తమ దారికి రాని ఇతర దేశాల పాలకులకు నరకం అంటే ఏమిటో లైవ్ లో చూపిస్తుంటారు.

అమెరికా అధ్యక్షులుగా పనిచేసినవారు వివాదాలు ఎదుర్కోవడం కొత్తేమీ కాదు. జాన్ ఎఫ్ కెన్నడి నుంచి మొదలు పెడితే ట్రంప్ వరకు అందరిదీ ఇదే వరుస. ట్రంప్ మిగతా వారి కంటే ఎక్కువ ఆరోపణలు ఎదుర్కోవడానికి ప్రధాన కారణం అతడు విచ్చలవిడి వ్యవహారాలకు పాల్పడటమే. అతడికి పెద్దల చిత్రాలలో నటించిన నటీమణులతో సంబంధాలు ఉన్నాయి. వారితో తనకు రిలేషన్ ఉందని ఆయన గతంలోనే పేర్కొన్నారు. గతంలో ట్రంప్ సంబంధం కొనసాగించిన ఓ పెద్దల చిత్రాల నటి ఆత్మహత్య కూడా చేసుకుంది. ఈ వ్యవహారంలో ట్రంప్ తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొన్నారు.

ఎఫ్ స్టీన్ ఫైల్స్ వ్యవహారంలో కూడా ట్రంప్ తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఆయనకు సంబంధించిన కొన్ని వీడియోలు.. ఫోటోలు ఇటీవల బయటికి వచ్చాయి. వాటిపై ట్రంప్ రకరకాలుగా స్పందించారు. ఇంతవరకు ఆ వ్యవహారంలో తన పాత్ర ఉందని, లేదని గాని ఆయన చెప్పలేదు. ట్రంప్ తో పాటు బిల్ గేట్స్ కూడా విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. అటువంటిది జరగకుండా ఉండాల్సిందని అతడు అభిప్రాయపడ్డాడు.

ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ లో అమెరికా యుద్ధం చేస్తోంది. ఇరాన్ దేశాన్ని సర్వ నాశనం చేస్తోంది. ఈ క్రమంలో ట్రంపు వ్యవహరిస్తున్న తీరు పట్ల స్వదేశమైన అమెరికాలోనే తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ట్రంప్ యుద్ధాన్ని ముగించు అంటూ అమెరికా ప్రజలు గొంతు ఎత్తుతున్నారు. ఇది ఇలా సాగుతుండగానే ఓ ఆర్టిస్ట్ ట్రంప్ తీరును తీవ్రంగా ఎండగడుతూ ఒక చిత్రాన్ని రూపొందించారు. ఆ చిత్రంలో ట్రంప్, ఎఫ్ స్టీన్ ఉన్నారు. ఫేమస్ టైటానిక్ సినిమాలో ఫోజ్ మాదిరిగా ఆ చిత్రాన్ని రూపొందించారు. వారిద్దరి మధ్య బలమైన సంబంధం ఉందని..ఎఫ్ స్టీన్ కనుక బతికి ఉంటే ట్రంప్ లీలలను బయటపెట్టేవాడని అమెరికా ప్రజలు చెప్పుకుంటున్నారు.. దీనిపై సోషల్ మీడియాలో కూడా విస్తృతమైన చర్చ నడుస్తోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular