Extramarital Affairs: జీవితంలో సంతోషంగా గడపాలని ఎక్కువ మంది కోరుతూ ఉంటారు. ఈ సంతోషం రిలేషన్ షిప్ లో ఎక్కువగా ఉంటుంది. అంటే కొందరికి కుటుంబ సభ్యుల తో గడపడం వల్ల ఆనందంగా ఉంటారు. మరికొందరు జీవిత భాగస్వామితో ప్రయాణం చేయడం హ్యాపీగా ఫీల్ అవుతారు. ప్రతి వ్యక్తికి తల్లిదండ్రుల వద్ద ఉన్న జీవితంతో పోలిస్తే జీవిత భాగస్వామితో గడిపే ప్రయాణమే ఆసక్తిగా ఉంటుంది. ఎందుకంటే తనకు తోడుగా.. తనకు సమానంగా ఉండే వ్యక్తితో ప్రయాణం చేయడం ఎవరికైనా ఆసక్తి ఉంటుంది. కానీ నేటి కాలంలో మనుషుల మధ్య ప్రేమలు తగ్గి.. ద్వేషాలు ఏర్పడి బహు భార్యత్వాన్ని పొందుతున్నారు. ఇలా ఉండడం భారతదేశంలో విరుద్ధం.. కానీ అక్రమంగా చాలామంది ఈ పని చేస్తున్నారు. అసలు ఒక వ్యక్తికి ఒక భాగస్వామి ఉండడం మంచిదా? లేక పలువురితో జీవించడం మంచిదా?
Also Read: ఇలాంటివారిని ఇంటికి పిలిస్తే.. మీ కొంప కొల్లేరు అయినట్లే..!
ఇద్దరు వ్యక్తులు జీవితాంతం కలిసి ఉన్నారంటే వారి మధ్య ప్రేమ దృఢంగా ఉందని అనుకోవాలి. పెళ్లయినాక కొన్నాళ్లకే విడిపోతున్నారంటే వారి మధ్య ఎటువంటి రిలేషన్ లేదని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు భయంతో.. భక్తితో ఇరువురి మధ్య ప్రేమ చిగురించేది. కానీ ఇప్పుడు ప్రేమ చిగురించిన తర్వాత మళ్లీ మాయమైపోతుంది. ఫలితంగా ఒక వ్యక్తి ఒకరిపై కాకుండా మరికొందరిపై ప్రేమగా ఉంటున్నాడు. ఈ క్రమంలో జీవిత భాగస్వామిని కాకుండా మరో వ్యక్తితో కలిసి ఉండే ప్రయత్నం చేస్తున్నాడు. అతనికి సాంప్రదాయబద్ధంగా వివాహం చేసుకున్న జీవిత భాగస్వామి కంటే మరో వ్యక్తి తో కలిసి ఉండటమే ఎక్కువ సంతోషాన్ని ఇస్తుందని కొన్ని సందర్భాల్లో చెప్పారు కూడా.
కానీ మానవ చరిత్రను పరిశీలిస్తే.. ఆదిమానవుడు తన సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి గుంపులుగా ఉండే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో సంతానం విషయంలో అదుపు లేకుండా ఎక్కువ మందిని పెంచుకునే ప్రయత్నం చేశాడు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది.. వాతావరణ పరిస్థితులు కూడా మారాయి.. ఇలాంటి అప్పుడు ఒక వ్యక్తి బహుభార్యత్వం ఉండడం వల్ల అనేక సమస్యలను కొని తెచ్చుకోవడమేనని కొందరు చెబుతున్నారు. ఎందుకంటే గెరిలా జీవితాన్ని పరిశీలిస్తే.. ఒక మగ గెరిల్లా పది ఆడ గెరిల్లాలతో సంబంధం పెట్టుకుంటుంది. ఈ క్రమంలో వాటికి పుట్టిన పిల్లలను తనకు తెలియకుండానే చంపుతూ వస్తుంది. అదే చింపాంజీ విషయంలో ఒక ఆడ చింపాంజీ.. ఎన్నో మగ చింపాంజీలతో సంబంధం పెట్టుకుంటుంది. ఎందుకంటే తన పిల్లలను రక్షించడానికి అందరితో కలిసి ఉంటుంది.
Also Read: ఏ రోజుల్లో కలిస్తే గర్భం దాల్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి?
అయితే కొందరు తమ జీవిత రక్షణ కోసమే సంబంధాలు పెట్టుకుంటున్నామని చెబుతున్నారు. కానీ జంతువుల కంటే మానవ జీవితం భిన్నంగా ఉంటుంది. సమాజంలో మనిషికి గుర్తింపు రావాలంటే గౌరవప్రదంగా బతకాల్సిన అవసరం ఉంది. కారణాలు చెప్పి ఇలా అధిక సంబంధాలు ఏర్పరచుకోవడం వల్ల ఆ ప్రభావం పిల్లలపై తీవ్రంగా చూపిస్తుంది. ఎందుకంటే వారి మనస్తత్వంపై చెడు సంబంధాలు ఎక్కువగా పడి తప్పు దోవ పట్టించేలా చేస్తాయి. అందువల్ల చాలా వరకు అక్రమ సంబంధాలకు దూరంగా ఉండడమే మంచిది అని కొందరు మేధావులు చెబుతున్నారు.