Extramarital Affairs : ఈమధ్య ప్రతీరోజూ వార్తల్లో క్రైం స్టోరీస్ ఎక్కువగా వస్తున్నాయి. వీటిలో ఎక్కువగా వివాహేతర సంబంధాలకు సంబంధించినవే ఉంటున్నాయి. భార్య లేదా భర్త ఉండి పరాయి వ్యక్తితో సంబంధాలు పెట్టుకోవడం వల్ల ఇద్దరి మధ్య క్లాషెష్ వచ్చి.. ఆ తరువాత ప్రాణాలు పోయే వరకు జరుగుతున్నాయి. అయితే కొందరు అందమైన భార్య, సంతోషకరమైన జీవితం ఉండి కూడా పక్క చూపులు చూస్తున్నారు. మరికొందరు వయసుతో సంబంధం లేకుండా రిలేషన్ షిప్ మెయింటేన్ చేస్తున్నారు. ఇది తప్పని తెలిసి కూడా కొందరు రాంగ్ స్టెప్ వేస్తున్నారు. అయితే ఇలా ఎందుకు చేస్తున్నారు? అనే దానిపై ఇంగ్లండ్ కు చెందిన ఓ సంస్థ సర్వే జరిపింది. ఈసర్వేలో విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. ఆ వివరాల్లోకి వెళితే..
బ్రిటన్ కు చెందిన సోషల్ ఇన్ సైట్ అనే సంస్థ రాంగ్ రిలేషన్ షిప్ పై సర్వే జరిపింది. ఇటీవల ఇవి ఎక్కువగా కావడంతో కొంత మందిని తీసుకొని వారి ప్రవర్తనను, అభిప్రాయాలను సేకరించింది. పెళ్లయిన వారితో పాటు పెళ్లి కాని వారి వివరాలను సేకరించారు. కొందరు తమకు భార్య ఉన్నా కూడా మరొకరితో సంబంధాలు పెట్టుకోవడంపై ఆరా తీశారు. వివాహేతర సంబంధాల వల్ల ఎటువంటి పరిణామాలు జరుగుతున్నాయో ఈ సర్వేలో పేర్కొంది.
చాలా వరకు అక్రమ సంబంధాలు పెళ్లయిన వారు మాత్రమే కొనసాగిస్తున్నట్లు ఈ సర్వేలో తేలింది. అందుకు చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా పెళ్లయిన తరువాత జీవిత భాగస్వామిని పట్టించుకోకపోవడం, వారికి కావాల్సిన వస్తువులు కొనుగోలు చేయకపోవడం వంటివి ఉన్నాయి. మరీ ముఖ్యంగా వారితో సమయం కేటాయించకపోవడంతో వారు ఇతరుల వైపు ఎక్కువగా చూస్తున్నట్లు తేలింది. అయితే భర్త లేదా జీవిత భాగస్వామి అందంగా లేకపోయినా పర్వాలేదు. కానా తన గురించి పట్టించుకోకపోవడంతో వారు భాగస్వామితో కలిసి ఉండడానికి ఎక్కువగా ఇష్టపడడం లేదు. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చి శృంగార జీవితానికి దూరంగా ఉంటున్నారు.
ఇలా ఎవరు దూరం కావడంతో ఇద్దరిలో ఒకరు ఎక్కువగా ప్రేమను కోరుకుంటున్నారు. ఇలాంటి సమయంలో భార్య లేదా భర్త ఎవరో ఒకరు మరొకరిపై ప్రేమ చూపడం ద్వారా వారు పక్కచూపుల జోలికి వెళ్లకుండా అడ్డుకోవచ్చని సర్వే ప్రతినిధులు తెలుపుతున్నారు. భార్యభర్తలు, లేదా భాగస్వాముల మధ్య మనస్పర్థలు వచ్చి అవి తీవ్ర స్థాయికి చేరుతున్నాయి. ఆ తరువాత శృంగార జీవితానికి దూరం కావడంతో ఒకరిపై ఒకరికి నమ్మకం పోతుంది. ఫలితంగా వారు ఇతరుల నుంచి ప్రేమను కోరుకునే క్రమంలో అక్రమంగా సంబంధాలు కొనసాగిస్తున్నారని సర్వేలో తేలింది.
ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే ఎంత బిజీ లైఫ్ ఉన్నా పార్ట్నర్ కోసం సమయం వెచ్చించాలి. వీకెంట్ ట్రిప్ వేయాలి. వారికి కావాల్సిన వస్తువులు కొనుగోలు చేయాలి. భర్త పక్క చూపులు చూడకుండా ఉండాలంటే వారితో ప్రేమగా మెలగాలి. భార్యతో అన్యోన్యంగా ఉండడం ద్వారా ఇతరుల నుంచి ప్రేమ కోరుకోవడానికి ఇష్టపడరు. అందువల్ల ఉద్యోగం, వ్యాపారం ఎంత ముఖ్యమో.. సంసార జీవితం కూడా అంతే ముఖ్యమని కొందరు మాససిక వైద్యులు చెబుతున్నారు.
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Read More