Extramarital Affairs:మేఘాలయ, నాగర్ కర్నూల్, అనంతపురం, ఉత్తర ప్రదేశ్, గుంటూరు, యాదాద్రి భువనగిరి .. ఇటీవల కాలంలో ఈ ప్రాంతాల పేర్లు మీడియాలో మారుమోగాయి. సోషల్ మీడియాలో అయితే రచ్చ రంబోలా చేశాయి. ఈ ప్రాంతాలు ఇంతలా మీడియాలో, సోషల్ మీడియాలో చర్చకు రావడానికి కారణం లేకపోలేదు. ఈ ప్రాంతాలలో దారుణమైన ఘటనలు చోటుచేసుకున్నాయి. అవి జరిగిన విధానం.. అవి జరగడానికి దారి తీసిన పరిస్థితులు సినిమాలను మించిపోయాయి. ఈ కేసులను దర్యాప్తు చేస్తున్న పోలీసులకే చుక్కలు చూపించాయి. అందువల్లే ఈ ప్రాంతాలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసాయి.
వాస్తవానికి ఈ ఘటనలు జరగడానికి ప్రధాన కారణం వివాహేతర సంబంధాలు.. అప్పటికే వివాహం జరిగినప్పటికీ.. కట్టుకున్న భర్తలను కాదని మరో వ్యక్తులకు భార్యలు దగ్గర కావడం వల్లే ఈ దారుణాలు చోటుచేసుకున్నాయి.. అయితే ఇలా వేరే వ్యక్తులకు ఆడవాళ్ళు ఎందుకు ఆకర్షితులవుతారు? భర్తలను అంతమొందించాలని ఎందుకు అనుకుంటారు? ఈ ప్రశ్నలకు సమాధానాలుగా కొన్ని కారణాలను మనస్తత్వ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
Also Read: వద్దన్నాపెళ్లి చేసుకున్నాడు.. భార్య చేసిన మోసం తట్టుకోలేక వీడియో తీసి..
నేటి కాలంలో చాలామంది పిల్లలు తల్లిదండ్రులకు దూరంగా ఉండి చదువుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వారికి రకరకాల పరిచయాలు ఏర్పడుతున్నాయి. అవి ప్రేమకు దారి తీస్తున్నాయి. ఈ ప్రేమ సంబందాలను తల్లిదండ్రులు ఒప్పుకపోవడంతో పెళ్లిళ్లు జరగడం లేదు. దీంతో ఎలాగైనా సరే గతంలో తాము మనసిచ్చిన వాటిని దక్కించుకోవాలని భావిస్తున్న యువతులు.. రకరకాల దారుణాలకు పాల్పడుతున్నారు. మేఘాలయ ఘటన ఇలాంటిదే.
వివాహం జరిగిన తర్వాత భర్త సరిగ్గా పట్టించుకోకపోవడంతో ఆడవాళ్లు వేరే వ్యక్తుల పట్ల ఆకర్షితులవుతున్నారు. తద్వారా అవి వివాహేతర బంధాలకు దారితీస్తున్నాయి. ఈ బంధాల వల్ల పెడ పోకడలు చోటుచేసుకుంటున్నాయి..
భర్తలు మద్యానికి అలవాటు పోవడం, వేరే స్త్రీలతో సంబంధం పెట్టుకోవడం కూడా వివాహితల మనస్తత్వంలో మార్పులకు కారణమవుతున్నాయి. కుటుంబాలను సరిగా పట్టించుకోకపోవడం.. వివాహం జరిగిన తొలి రోజుల్లో ప్రేమించి.. ఆ తర్వాత అయిష్టాన్ని వ్యక్తం చేయడం వల్ల భార్యలు దారి తప్పుతున్నారు. భర్తలను పక్కన పెట్టి వేరే వ్యక్తులకు దగ్గరవుతున్నారు.
Also Read: భార్య విడాకుల కేసు పెట్టింది.. ఆ ఒక్క పనితో ఆమె మనసు మార్చేశాడు..
ఇటీవల కాలంలో సోషల్ మీడియా వాడకం ఎక్కువ కావడంతో చాలామంది వివాహితలు దారి తప్పుతున్నారు. సోషల్ మీడియా ద్వారా ఏర్పడిన పరిచయం వారిని వేరే మార్గాల వైపు ప్రయాణించేలా చేస్తోంది. ఇటీవల కర్ణాటక రాష్ట్రంలో ఓ వివాహిత సోషల్ మీడియాలో ఏర్పడిన పరిచయం వల్ల ఒక యువకుడితో సంబంధం పెట్టుకుంది. అప్పటికి ఆమెకు పిల్లలు కూడా ఉన్నారు. అయినప్పటికీ ఆ యువకుడి కోసం కర్ణాటక దాకా వచ్చింది. చివరికి అతడి చేతిలోనే కనుమొస్తుంది.
కొంతమంది మహిళలు డబ్బు కోసం.. ఇతర పలుకుబడుల కోసం దారి తప్పుతున్నారు. భర్త ద్వారా వచ్చే సంపాదన సరిపోక.. వేరే వ్యక్తులతో వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నారు. అయితే ఇలాంటి ఘటనలో కూడా చివరికి భార్యలే బాధితులవుతున్నారు. ఎందుకంటే వివాహం అనేది ఒక పట్టిష్టమైన బంధం. వివాహేతర సంబంధం అనేది తాత్కాలిక అవసరాల కోసం ఏర్పడిన బంధం. అలాంటప్పుడు వివాహేతర సంబంధం ఎప్పుడూ బలంగా నిలబడదు. ఈ విషయాన్ని అటు మగవాళ్ళు, ఇటు ఆడవాళ్లు గుర్తుంచుకుంటే మంచిది. లేకపోతే అంతిమంగా సంసారాలు ఆగమవుతాయని.. పిల్లలు అనాధలుగా మారిపోతారని మనస్తత్వశాస్త్ర నిపుణులు చెబుతున్నారు.