Lion Attacks Woman: మనుషుల్లో చాలామందికి జంతువులను పెంచుకోవడం అలవాటు. చాలామంది కుక్కలను పెంచుకోవడానికి ఆసక్తిని చూపిస్తుంటారు. కాస్త భిన్నమైన అభిరుచి ఉన్నవాళ్లు పిల్లులను, పక్షులను పెంచుకుంటారు. ఇంకాస్త ఆర్థిక స్తోమత ఉన్నవాళ్లు ఖరీదైన కుక్కలను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకొని పెంచుకుంటారు. కానీ ఈ కుటుంబం మాత్రం భిన్నంగా చేసింది. అందరికంటే తాము వైవిధ్యాన్ని ప్రదర్శించాలని చిత్రంగా సింహాన్ని పెంచుకుంది. సింహాన్ని పెంచుకోవడం వరకు బాగానే ఉంది కానీ.. ఆ సింహం చేసిన పని వల్ల వారు జైలుకు వెళ్లాల్సి వచ్చింది..
పాకిస్తాన్లోని లాహోర్ నగరంలో షాదీ కోయి ప్రాంతానికి చెందిన ఒక కుటుంబం సింహం పిల్లను తెచ్చుకున్నది. విదేశాల నుంచి ఆ సింహం పిల్లను అక్రమ మార్గంలో తెచ్చుకున్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాత దానిని పెంచుకుంటున్నారు. కొంతకాలంగా ఆ సింహం ఇంట్లో వాళ్ళు చెప్పిన మాట వినడం లేదు. పైగా దానిని నిత్యం బోనులో వేసి ఉంచడం వల్ల చిరాకు పడుతున్నది. ఇదే క్రమంలో ఇటీవల ఆ సింహానికి ఆహారం పెట్టేందుకు యజమాని వెళ్ళాడు. బోను ద్వారం తీసి దానికి ఆహారం వేస్తుండగా.. అతడి కళ్ళు కప్పింది. ఆ తర్వాత గోడ దూకి బయటకు వెళ్ళింది. ఆ వీధిలో నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ మీద దాడి చేసింది. అయితే చుట్టుపక్కల ఉన్నవాళ్లు ఆ సింహాన్ని బెదిరించే ప్రయత్నం చేయడంతో దూరంగా పారిపోయింది. ఈ ఘటనలో ఆ మహిళ గాయపడింది. రక్త స్రావం కావడంతో ఆమెను స్థానికులు ఆసుపత్రికి తరలించారు..
Also Read: బేసిన్లు, బెండకాయలు అంటే ఇజ్జత్ పోతది.. రేవంత్ పై కేటీఆర్ సెటైర్ వైరల్
సింహం కూడా దూకి వీధుల్లోకి వెళ్తున్న దృశ్యాలు సమీపంలో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలలో రికార్డు అయ్యాయి. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సింహం దాడి చేసిన తాలుకూ దృశ్యాలు గగుర్పాటుకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్థానికులు ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకువచ్చారు. దీంతో అటవీశాఖ అధికారులకు వారు సమాచారం అందించారు. దీంతో సీసీ కెమెరాలలో సింహం కదలికలను గమనించిన పోలీసులు.. దానికి మత్తుమందు ఇచ్చి జూకు తరలించారు.. ఆ సింహాన్ని అక్రమ మార్గంలో తీసుకొచ్చి.. పెంచుకుంటున్న వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు వారిని జైలుకు తరలించారు.
Also Read: మన ఇండియాలో మరో గోవా..
” ఓవైపు దేశంలో దుర్భర పరిస్థితులు ఉన్నాయి. ఆకలితో చాలామంది అలమటిస్తున్నారు. సరిగా నీళ్లు కూడా రాకపోవడంతో పంటలు పడటం లేదు. ఇలాంటి చోట డబ్బు బాగా ఎక్కువై కొంతమంది ఇలా సింహాలను పెంచుకుంటున్నారు. అవి ఇలా గోడ దూకి పారిపోతున్నాయి. చివరికి మనుషుల మీద దాడులు చేస్తున్నాయి. ఇటువంటి వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకోవాలి. వారి వద్ద ఉన్న డబ్బును మొత్తం పేదలకు పంచిపెట్టాలి. అప్పుడు గాని తిక్క కుదురుతుంది. మనుషులను వదిలిపెట్టి.. క్రూర మృగాలను పెంచుకోవడం ఏంటో అర్థం కావడం లేదు. పైగా అక్రమమార్గంలో సింహం పిల్లను తీసుకురావడం.. దానికి మూడు పూటలా తిండి పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని” స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
View this post on Instagram