Provident Fund: ఒకప్పుడు కొందరికి మాత్రమే ఇది వర్తించేది. కానీ ఇప్పుడు ప్రతి ఒక్క ఉద్యోగికి ప్రావిడెంట్ ఫండ్ వర్తిస్తుంది. తనకు వచ్చే జీతం లో కొంత మొత్తం ప్రావిడెంట్ ఫండ్లో జమ అయిన తర్వాత రిటైర్మెంట్ సమయంలో.. ఈ మొత్తానికి వడ్డీ కలిపి చెల్లిస్తారు. అయితే ఈ వడ్డీ తక్కువగానే ఉన్నప్పటికీ సెక్యూరిటీతో ఉన్న డబ్బు ఆ ఉద్యోగికి చేతికి అందుతుంది. అయితే ప్రావిడెంట్ ఫండ్ లో జమ అయిన మొత్తం అత్యవసరాల నిమిత్తం మధ్యలోనే విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంది. దాదాపు 75% విత్ డ్రా చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. అయితే ప్రావిడెంట్ ఫండ్ బ్యాలెన్స్ తెలుసుకోవడం ఎలా?
ప్రస్తుతానికి ప్రావిడెంట్ ఫండ్ ఉన్నవారు UAN నెంబర్ను కలిగి ఉండాలి. ఈ నెంబర్ తో పాటు పాస్వర్డ్ ను ఎంట్రీ చేస్తేనే ఆ ఉద్యోగికి సంబంధించిన డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. అప్పుడు బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం.. లేదా విత్ డ్రా చేసుకోవడం.. లేదా ఈ కేవైసీ మార్చుకోవడం లాంటివి చేసుకోవచ్చు. అయితే చాలామంది తమ పిఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంటుంది. ఇలాంటి వారికి యుఏఎన్ నెంబర్ ఎంట్రీ చేసి తెలుసుకోవాల్సిన సమయం ఉండదు. దీంతో చిన్న పని ద్వారా తమ పిఎఫ్ బ్యాలెన్స్ ఎంత ఉందో ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.
Also Read: రామ్ చరణ్ పెద్ది మూవీలో ఐటమ్ సాంగ్ చేస్తున్న స్టార్ హీరోయిన్…
కేవలం 30 సెకండ్ల లోనే పిఎఫ్ బ్యాలెన్స్ ఎంత ఉందో తెలుసుకొని అవకాశం ప్రస్తుతానికి అందుబాటులో ఉంది. 99 66044425 అనే నెంబర్ను టైప్ చేయాలి. అయితే పీఎఫ్ ఖాతాకు రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ నుంచి పై నెంబర్కు మిస్సేడ్ కాల్ ఇవ్వాలి. ఇలా ఇవ్వడం ద్వారా వెంటనే పిఎఫ్ బ్యాలెన్స్ తెలిసిపోతుంది. అంతేకాకుండా తమ ఏ పరిస్థితుల్లో ఉందో తెలుసుకునే అవకాశం కూడా ఉంది.
అయితే ఇలా బ్యాలెన్స్ తెలుసుకోవాలని అనుకునేవారు ముందుగా ఈ కేవైసీని పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ కేవైసీ పెండింగ్ లో ఉన్నా.. లేదా ఇంకా ఏదైనా సమస్య ఉంటే మాత్రం ఈ బ్యాలెన్స్ చూపించే అవకాశం లేదు. అందువల్ల ముందుగా పీఎఫ్ వెబ్సైట్ని ఓపెన్ చేసి ఈ కేవైసీ పూర్తి చేయని వారు ఉంటే సరి చేసుకోగలరు. ఆ తర్వాతే పై మొబైల్ నెంబర్ తో బ్యాలెన్స్ తెలుసుకునే అవకాశం ఉంటుంది.
ప్రస్తుతం చాలామంది పిఎఫ్ ను మధ్యలోనే తమ అవసరాలకు విత్ డ్రా చేసుకుంటున్నారు. గతంలో పిఎఫ్ విత్ డ్రా చేసుకోవాలంటే కంపెనీ అనుమతి ఇతర ప్రాసెస్ చాలావరకు ఉండేది. కానీ ఇప్పుడు అంతా ఆన్లైన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత వెంటనే విత్ డ్రాకు అప్లై చేసుకోవచ్చు. ఇలా అప్లై చేసిన వారం రోజుల లోపు నగదు బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. అలా కాని పక్షంలో మరోసారి దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఏ అవసరాల కోసం పిఎఫ్ తీసుకుంటున్నామో దానికి సంబంధించిన వివరాలను అందించాల్సి ఉంటుంది.