Sweden: భర్తలో భార్య సగమంటారు.. భర్త కష్టాల్లో.. సుఖాలలో భార్యకు సమానమైన మాట ఉంటుంది అంటారు. అందువల్లే భార్యాభర్తలను అర్ధనారీశ్వరులు అని పిలుస్తుంటారు. ఆలుమగలు బాగుంటే ఆ సంసారం అందంగా సాగుతూ ఉంటుంది. అదే ఇద్దరి మధ్య విభేదాలు మొదలైతే ఆ సంసారం కాస్త రచ్చకెక్కుతుంది. వీధి పాలవుతుంది. అందుకే భార్యా భర్తలు అన్యోన్యంగా ఉండాలని చెబుతుంటారు.
ఇప్పుడు మీరు చదవబోయే కథనంలో ఈ భర్త పరమ రాక్షసుడు. భర్త అనే పదానికే తలవంపు తీసుకొచ్చిన మూర్ఖుడు. అతడు చేసిన పని భార్యకు తీవ్రమైన దుఃఖాన్ని.. ప్రపంచంలో ఎవరికి ఎదురుకాని ఇబ్బందిని తీసుకొచ్చింది. చివరికి పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో అతడి బండారం బయటపడింది. ప్రస్తుతం అతడు జైలు ఊచలు లెక్కపెడుతున్నాడు.
స్వీడన్ దేశంలో జరిగిన ఈ సంఘటన ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మాదక ద్రవ్యాలకు బానిసైన ఓ వ్యక్తి పూర్తిస్థాయిలో వివేచన కోల్పోయాడు. తన భార్యను ఏకంగా 120 మందికి అమ్మేశాడు. స్థానిక మీడియాలో ప్రకటించి మరి ఆమెతో బలవంతంగా దారుణమైన పనులు చేయించేవాడు. విటుల వద్దకు పంపించేవాడు. అలా వచ్చిన డబ్బుతో మాదకద్రవ్యాలు కొనుగోలు చేసి మత్తులో జోగేవాడు. అతడి వేధింపులు తట్టుకోలేక భార్య చివరికి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు సాగించిన వ్యవహారాలపై కీలక ఆధారాల సేకరించారు. అతడి మీద దాడి.. అత్యాచారం వంటి తీవ్రమైన నేరాలను నమోదు చేశారు. ఈ ఘటన యావత్ ప్రపంచం మొత్తం ఉలిక్కి పడేవిధంగా చేసింది..
అతడు చేసిన నేరాలు.. ఘోరాలకు సంబంధించి ఆధారాలు సేకరించారు. అంతేకాదు ఏప్రిల్ 13 నుంచి ఈ కేసు కు సంబంధించి విచారణ కొనసాగించబోతున్నారు. ఓ భర్త మాదగ ద్రవ్యాలకు భార్యను ఏకంగా 120 మందికి అమ్మడం.. చరిత్రలో తొలిసారి అని అక్కడి పోలీసులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే అతడు జైల్లో ఉన్నప్పటికీ కూడా తన ప్రవర్తన ను మార్చుకోలేదు. పోలీసులు విచారిస్తున్నప్పటికీ తాను చేసిన పనిని సమర్ధించుకుంటున్నాడు. పైగా అలాంటి పని చేసినందుకు తనను అభినందించాలని పోలీసులకు ఉల్టా కౌంటర్ ఇస్తున్నాడు. దీంతో అతడికి తమదైన శైలిలో ట్రీట్మెంట్ ఇవ్వాలని అక్కడి పోలీసులు భావిస్తున్నట్టు సమాచారం.