https://oktelugu.com/

Google : మేకల వ్యాపారాన్ని మొదలుపెట్టిన గూగుల్.. టెక్ దిగ్గజానికి ఏమైంది?

Google : ప్రపంచ వ్యాప్తంగా కొత్త కొత్త సాంకేతిక పరిజ్ఞానాలు అందుబాటులోకి వస్తున్నాయి. పాత పరిజ్ఞానాలు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. దీంతో వస్తు సేవలకు అంతగా గిరాకీ ఉండడం లేదు.

Written By: , Updated On : April 3, 2025 / 11:48 AM IST
Google

Google

Follow us on

Google : ప్రపంచ వ్యాప్తంగా వస్తు సేవలకు గిరాకీ తగ్గడంతో లావాదేవీలు నిలిచిపోతున్నాయి. దీంతో అనేక కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇందుకు దిగ్గజ కంపెనీలు మినహాయింపు కాదు. రెండు సంవత్సరాలుగా ఐటీ పరిశ్రమలో ఉద్యోగుల తొలగింపు నిరాటంకంగా కొనసాగుతోంది. ఉద్యోగులు నైపుణ్యం లేదనే సాకును చూపి కంపెనీలు అడ్డగోలుగా కోతలు విధిస్తున్నాయి.. లే ఆఫ్స్(Lay off) ను అత్యంత కఠినంగా అమలు చేస్తున్నాయి. అన్ని రోజులు చాకిరీ చేయించుకున్న ఉద్యోగులను మెడ పట్టుకొని బయటికి గెంటేస్తున్నాయి. ఈ జాబితాలో ఈ కంపెనీ ఆ కంపెనీ అని కాదు.. అన్ని కంపెనీలు అలానే ఉన్నాయి. ఇక గూగుల్ (google) అయితే మరి దారుణంగా లే అఫ్స్ అమలు చేస్తోంది. ఇది ఎంతవరకు దారి తీస్తుందో తెలియదు కాని.. ఇప్పటికైతే పరిస్థితి బాగోలేదు.. ఇకపై బాగుంటుందని నమ్మకం లేదు.. ఓ అంచనా ప్రకారం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరింత వ్యాప్తి చెందడంతో భవిష్యత్తు కాలంలో కొత్తగా ఉద్యోగాల కల్పన ఉండదని.. ఉన్న ఉద్యోగులను దశలవారీగా తొలగిస్తారని ప్రచారం జరుగుతున్నది. ఇదంతా సాగుతుండగానే ఓ సైట్ లో కనిపించిన వార్త ఆసక్తికరంగా దర్శనమిచ్చింది. “గూగుల్ కంపెనీలో మేకలు మేస్తున్నాయి.. ఆ మేకలను గూగుల్ కంపెనీ అమ్ముకుంది. పైగా కంపెనీకి కూడా భారీగా ఆదాయం వచ్చిందనేది” ఆ వార్త సారాంశం. అయితే దీనికి సంబంధించి లోతుల్లోకి వెళ్తే ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి..

Also Read : గూగుల్ పే వాడే వారందరికీ షాక్.. ఇక వాడడం కష్టమే

ఏం జరిగిందంటే

2009లో అమెరికాలోని కాలిఫోర్నియాలో గ్రేజింగ్ అనే కంపెనీని గూగుల్ టేక్ ఓవర్ చేసుకుంది. గ్రేసింగ్ కంపెనీకి మౌంటెన్ వ్యూ ప్రాంతంలో పెద్ద క్యాంపస్ ఉంది. ఆ క్యాంపస్ ను టేక్ ఓవర్ చేసుకోవడంతో.. అక్కడి నుంచి గూగుల్ తన కార్యకలాపాలు మొదలుపెట్టింది. అయితే మౌంటెన్ వ్యూ అనేది అతిపెద్ద క్యాంపస్. అది గుట్ట మీద ఉంటుంది. పచ్చి గడ్డి విపరీతంగా ఉంటుంది. దానిని తొలగించాలంటే అధునాతన యంత్రాలు కావాలి. అవి నడవాలంటే ఇంధనం కావాలి.. ఇదంతా ఎందుకని భావించిన గూగుల్ సరికొత్త నిర్ణయం తీసుకుంది. 200 బోర్డర్ కోలీ రకానికి చెందిన మేకలను కొనుగోలు చేసింది. వాటిని పర్యవేక్షించడానికి ఒక కాపారని నియమించింది. గూగుల్ క్యాంపస్ లో ప్రతిరోజు 200 మేకలు పచ్చి గడ్డిని మేసేవి. వాస్తవానికి ఈ గడ్డిని కత్తిరించడానికి లాన్ మవర్ లు ఉపయోగించవచ్చు. అయితే అవి కాలుష్యాన్ని వెదజల్లుతాయి కాబట్టి.. google ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది. మేకలు గడ్డి, కలుపు మొక్కలను తింటాయి. పైగా అవి ఆ పరిసర ప్రాంతాల్లోనే పెంటలు వేస్తాయి. దీనివల్ల నేల సారవంతమవుతుంది.. అయితే ఈ విషయాన్ని గూగుల్ అప్పట్లో ఓ బ్లాగ్ పోస్ట్ లో పంచుకుంది..” బోర్డర్ కోలి మేకలు క్యాంపస్ ను అత్యంత సుందరంగా తీర్చిదిద్దాయి. గడ్డి మొక్కలను, కలుపు మొక్కలను తినేశాయ్. అంతేకాదు కాలుష్యాన్ని తగ్గించాయి. శబ్ద కాలుష్యాన్ని కూడా నివారించాయి. ఈ స్థిరమైన నిర్ణయం అనుకూల ఫలితాలు ఇచ్చింది.. ఆ మేకలను అమ్మినందుకు భారీ ఆదాయం వచ్చిందని” google పేర్కొంది. ఇంకా అమెరికాలో అడవి మంటలను నివారించేందుకు.. వృక్ష సంపాదన కాపాడేందుకు మేకలు తినే మేతను ఉపయోగిస్తున్నారు. ఇటీవల అమెరికాలోని లాస్ ఏంజెల్స్ ప్రాంతంలో చోటు చేసుకున్న మంటలను అదుపులోకి తీసుకురావడానికి మేకలు తినే గడ్డిని ఉపయోగించారు.

Also Read : గూగుల్‌ సెర్చ్‌ 2024 : ఈ ఏడాది ఎక్కువ మంది సెర్చ్‌ చేసిన వ్యక్తులు వీరే..!

 

Google