https://oktelugu.com/

Donald Trump : ట్రంప్‌ టారిఫ్స్‌.. భారత్‌పై ప్రభావం ఎంత?

Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక దూకుడైన పాలన సాగిస్తున్నారు. అక్రమ వలసదారులను వెళ్లగొడుతూ.. అమెరికన్లకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా అనేక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో ప్రతీకార సుంకాలు ఒకటి. ఏప్రిల్‌ 2 నుంచి అన్ని దేశాలపై ప్రతీకార సుంకాలు ఉంటాయని ప్రకటించారు. చెప్పినట్లే.. అని దేశాలపై సుంకాలు విధించారు.

Written By: , Updated On : April 3, 2025 / 11:40 AM IST
Donald Trump

Donald Trump

Follow us on

Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌(Donald Trump) ప్రకటించిన పరస్పర సుంకాలు (reciprocal tariffs) భారతదేశంతో సహా పలు దేశాలపై గణనీయమైన ప్రభావం చూపనున్నాయి. ఏప్రిల్‌ 2, 2025న వైట్‌ హౌస్‌ రోజ్‌ గార్డెన్‌(Roje Garden)లో జరిగిన ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో ట్రంప్‌ ఈ సుంకాలను ’లిబరేషన్‌ డే’గా పేర్కొంటూ ప్రకటించారు. భారత్‌పై 26 శాతం సుంకాలు విధించనున్నట్లు తెలిపారు, ఈ నిర్ణయం భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి.

Also Read : రెండోసారే ఎక్కువంటే.. మూడోసారి ముచ్చటేంది ట్రంపూ..!

ఎందుకు ఈ సుంకాలు?
ట్రంప్‌ తన ప్రసంగంలో భారత్‌ అమెరికా ఉత్పత్తులపై 52 శాతం సుంకాలు విధిస్తోందని, దీనికి ప్రతీకారంగా అమెరికా(America) 26 శాతం సుంకాలు వసూలు చేస్తుందని చెప్పారు. అమెరికా వస్తువులపై భారత్‌ ఎక్కువ సుంకాలు విధిస్తోందని, అది అమెరికాకు అన్యాయమని ఆయన వాదించారు. ఉదాహరణకు, అమెరికా మోటార్‌సైకిళ్లపై 2.4 శాతం సుంకం విధిస్తుండగా, భారత్‌ 70 శాతం వసూలు చేస్తోందని ట్రంప్‌ ఎత్తిచూపారు. ఈ అసమతుల్యతను సరిచేయడానికే ఈ ప్రతీకార సుంకాలను ప్రవేశపెట్టారు.

భారత్‌పై ప్రభావం
ఎగుమతులపై ఒత్తిడి:
అమెరికా భారత్‌ యొక్క అతిపెద్ద ఎగుమతి మార్కెట్(Export Market) 2023–24లో మొత్తం ఎగుమతుల్లో 18 శాతం (సుమారు 74 బిలియన్‌ డాలర్లు) అమెరికాకు వెళ్లాయి. 26 శాతం సుంకాలు విధించడం వల్ల ఈ వస్తువుల ధరలు పెరిగి, అమెరికా మార్కెట్లో భారత ఉత్పత్తుల పోటీతత్వం తగ్గే అవకాశం ఉంది.

ప్రభావితమయ్యే ప్రధాన రంగాలు: ఫార్మా(Farma) (మందులు), ఆటోమొబైల్‌ భాగాలు, వస్త్రాలు, ఆభరణాలు (డైమండ్స్, గోల్డ్‌), ఎలక్ట్రానిక్స్‌ (స్మార్ట్‌ఫోన్లు).

ఆర్థిక నష్టం:
కొన్ని అంచనాల ప్రకారం, ఈ సుంకాల వల్ల భారత్‌ సంవత్సరానికి 7 బిలియన్‌ డాలర్ల వరకు నష్టపోవచ్చు (Citi Research). ఎస్‌బీఐ రీసెర్చ్‌ రిపోర్ట్‌ ప్రకారం, ఎగుమతుల్లో 3–3.5 శాతం తగ్గుదల మాత్రమే ఉంటుందని, ప్రభావం పరిమితంగా ఉంటుందని అంచనా వేసింది. ఫార్మా రంగంలో అమెరికా జనరిక్‌ మందులపై ఆధారపడుతుండటం వల్ల తీవ్ర నష్టం తప్పవచ్చు, కానీ ధరల పెరుగుదల తప్పదు.

ఉద్యోగాలపై ప్రభావం:
ఎగుమతులు తగ్గితే, భారత్‌లో ఎగుమతి ఆధారిత పరిశ్రమల్లో (వస్త్రాలు, ఆభరణాలు, ఆటో భాగాలు) ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఎక్కువగా నష్టపోవచ్చు.

పరోక్ష ప్రభావం:
అమెరికా ఆర్థిక వ్యవస్థలో సుంకాల వల్ల ద్రవ్యోల్బణం పెరిగితే, వినియోగదారుల కొనుగోలు శక్తి తగ్గి, భారత ఉత్పత్తుల డిమాండ్‌ మరింత తగ్గవచ్చు. గ్లోబల్‌ సప్లై చైన్‌లో అంతరాయం కలిగితే, భారత్‌ దిగుమతి చేసుకునే భాగాల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది.

భారత్‌ ఎదుర్కొనే అవకాశాలు
వైవిధ్యీకరణ: భారత్‌ తన ఎగుమతి మార్కెట్లను వైవిధ్యీకరించడం ద్వారా (ఉదా: యూరప్, మిడిల్‌ ఈస్ట్, ఆసియా) అమెరికాపై ఆధారపడటాన్ని తగ్గించవచ్చు.

Also Read : ఇరాన్‌ అణు భయం.. అమెరికాతో చర్చలకు ససేమిరా!