https://oktelugu.com/

MG Motors : చిన్న కారు అనుకుంటే పొరపాటే.. అమ్మకాల్లో దూసుకెళ్తోంది.. ఇంతకీ ఏ కంపెనీదో తెలుసా..?

MG Motors : కొన్ని కార్లు చూడ్డానికి చాలా చిన్నగా కనిపిస్తాయి. వీటిని ఎవరు కొంటారులే అని చాలామంది అనుకుంటారు. కానీ అలాంటి కార్లే వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి.

Written By: , Updated On : April 3, 2025 / 11:56 AM IST
MG Motors

MG Motors

Follow us on

MG Motors : కొన్ని కార్లు చూడ్డానికి చాలా చిన్నగా కనిపిస్తాయి. వీటిని ఎవరు కొంటారులే అని చాలామంది అనుకుంటారు. కానీ అలాంటి కార్లే వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. అందులో ఉండే ఫీచర్స్, మైలేజ్ ఆకట్టుకోవడంతో సేల్స్ లో దూసుకుపోతున్నాయి. ఇంతకీ చిన్న కారుగా కనిపించి.. ఆకట్టుకుంటున్నది ఏదో తెలుసా?

MG MOTORS కు అంతర్జాతీయంగా ప్రత్యేక గుర్తింపు ఉంది.. భారత్లో మొదట్లో దీనిని పట్టించుకోకపోయినా.. ఆ తర్వాత ఈ కార్ల కోసం నిలబడుతున్నారు. ఈ కంపెనీకి చెందిన హెక్టర్, గ్లోస్టర్, పాస్టర్ వంటి వాహనాలకు ఇక్కడ ప్రత్యేక గుర్తింపు వచ్చింది. అయితే ఆ తర్వాత ఎంజి మోటార్స్ ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. అయితే ఇప్పటికే ఎంజి మోటార్స్ నుంచి కామెట్ మార్కెట్లోకి వచ్చి అందరిని ఆకట్టుకుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించవచ్చని కొంతమంది వినియోగదారులు దీనిని కొనుగోలు చేసి చెబుతున్నారు. అందుకే ఈ కారు కోసం ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు.

Also Read : కొత్త ఇంజిన్, అప్డేటెడ్ ఫీచర్స్.. మరింత ఎట్రాక్టివ్‎గా ఎంజీ ఆస్టర్

2025 మార్చి లో ఎంజి మోటార్స్ తన అమ్మకాల వివరాలను తెలిపింది. ఆ నెలలో ఈ కంపెనీ మొత్తంగా 55 యూనిట్ల అమ్మకాలు నమోదు చేసింది. 2024 ఏడాది మార్చిలో 5,050 యూనిట్లు నమోదు చేసిన ఎంజీ కామెట్ కారు ఈ ఏడాది తొమ్మిది శాతం వృద్ధి నమోదు చేసింది. అలాగే ఈ ఏడాది ఫిబ్రవరిలో 4002 యూనిట్లు విక్రయించింది. అంటే నెలవారీగా అమ్మకాలను చూస్తే 37.43 వృద్ధి నమోదు చేసింది.

భారతదేశంలో ఇటీవల ఎలక్ట్రిక్ కార్ల కొనుగోలు పెరిగిపోతున్నాయి. వీటిలో ఎంజీ కామెంట్ EV,ZS EV, vinders EV కార్లు ఎక్కువ అమ్మకాలను నమోదు చేసుకున్నాయి. వీటిలో విండోస్ మొదటి స్థానంలో నిలిచింది. గత ఏడాది అక్టోబర్ నుంచి ఈ కారుకు ఎక్కువగా ఆదరణ లభిస్తోంది. దీనిని రూ 10 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. అలాగే ఇందులో 38 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ తో పనిచేస్తుంది. దీనిని ఒకసారి చార్జింగ్ చేస్తే 332 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. మిగతా ఫీచర్లు కూడా ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.

ఇక ఎంజి కామెట్ విషయానికొస్తే.. ఇది చూడడానికి చిన్నగా అనిపించిన ఆకట్టుకునే ఫీచర్లు ఉన్నాయి. స్పీకర్స్ ఆడియో సిస్టంతో పాటు ఎక్స్ క్లూజివ్ ఎఫ్ సి వేరియంట్లు లెదర్ సీట్లు ఉన్నాయి. ఇందులో 17.4 కిలోవాట్ మ్యాటర్ ఇన్ అమర్చారు. దీనిని ఒక్కసారి చార్జింగ్ చేస్తే 230 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ప్రస్తుతం దీనిని మార్కెట్లో లక్షల ప్రారంభ ధర నుంచి రూ. 9.81 లక్షల వరకు విక్రయిస్తున్నారు. సిటీలో ఉండేవారు ఆకర్షణ ఏమైనా కారులో వెళ్లాలని అనుకునేవారు దీనిని ఎక్కువగా కోరుకుంటున్నారు. అంతేకాకుండా ఇందులో మూడు సంవత్సరాలు లేదా లక్ష కిలోమీటర్ల వారంటీ లేదా మూడు సంవత్సరాలు ప్లస్ ఉచిత లేబర్ సర్వీస్ లాంటి ఆఫర్లు ఉన్నాయి. అందువల్ల ఈ కారు కొనుగోలుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు.

Also Read : రిలీజ్‎కు ముందే కార్ల బుకింగ్స్ షురూ..బీఎండబ్ల్యూ, టయోటాకు ఇక కష్టకాలమే?