HomeNewsSpecial Song: ‘పుష్ప’లో సమంత స్పెషల్ సాంగ్ చేయడానికి కారకులెవరు?

Special Song: ‘పుష్ప’లో సమంత స్పెషల్ సాంగ్ చేయడానికి కారకులెవరు?

Special Song: అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లలో వచ్చిన ‘పుష్ప ద రైజ్’ ప్రపంచ వ్యాప్తంగా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. కరోనా సమయంలోనూ ‘తగ్గెదేలే’ అన్నట్లుగా కలెక్షన్లను రాబడుతూ ముందుకు దూసుకెళుతుండటం విశేషం. ‘పుష్ప’ పార్ట్-1 ఇప్పటికే బ్రేక్ ఈవెంట్ మార్క్ దాటేసి బాక్సాఫీస్ వద్ద హిట్టుగా నిలిచింది. దీంతో ఈ మూవీ సెకండ్ పార్ట్ కు లైన్ క్లియర్ అయింది. ‘పుష్ప’లో అల్లు అర్జున్ డీ గ్లామర్ రోల్ చేసి ఆకట్టుకున్నారు. ‘పుష్ప రాజ్’గా […]

Special Song: అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లలో వచ్చిన ‘పుష్ప ద రైజ్’ ప్రపంచ వ్యాప్తంగా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. కరోనా సమయంలోనూ ‘తగ్గెదేలే’ అన్నట్లుగా కలెక్షన్లను రాబడుతూ ముందుకు దూసుకెళుతుండటం విశేషం. ‘పుష్ప’ పార్ట్-1 ఇప్పటికే బ్రేక్ ఈవెంట్ మార్క్ దాటేసి బాక్సాఫీస్ వద్ద హిట్టుగా నిలిచింది. దీంతో ఈ మూవీ సెకండ్ పార్ట్ కు లైన్ క్లియర్ అయింది.

Samantha
Samantha

‘పుష్ప’లో అల్లు అర్జున్ డీ గ్లామర్ రోల్ చేసి ఆకట్టుకున్నారు. ‘పుష్ప రాజ్’గా అల్లు అర్జున్ మారిన తీరుకు అభిమానులు ఫిదా అయ్యారు. బన్నీ నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ఎంతోమంది ప్రముఖులు ‘పుష్ప’ మూవీ చూసి అల్లు అర్జున్, చిత్రబృందానికి బెస్ట్ విషెష్ చెబుతూ ట్వీట్లు చేస్తున్నారు.

ఈ మూవీలో అల్లు అర్జున్ కు జోడీగా రష్మిక మందన్న నటించగా సమంత స్పెషల్ సాంగ్ చేసింది. సమంత తన సినీ కెరీర్లో చేసిన తొలి స్పెషల్ సాంగ్ ‘ఊ అంటావా మావ.. ఊఊ అంటవా మావ’. ఈపాట సినిమాకే హైలెట్ గా నిలిచించి. ఈ పాటలో సమంత గ్లామర్ హద్దులను చెరిపేసింది. దేవీశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం అల్లు ఫ్యాన్స్ ను ఉర్రూతలూగించింది.

తాజాగా సమంత ‘పుష్ప’లో స్పెషల్ సాంగ్ చేయడానికి ఎవరు కారణం ఎవరో రివీల్ చేసింది. ‘ఊ అంటావా మావ.. ఊఊ అంటావా మావ’ సాంగ్ చేయడానికి ముందు తాను ఎంతో భయపడ్డానని చెప్పింది. అయితే అల్లు అర్జున్ తనను పక్కను కూర్చోబెట్టుకొని ఈ సాంగ్ చేస్తే నీకు ఎంతో పేరు వస్తుందని నచ్చజెప్పాడని చెప్పింది. బన్నీ ఇచ్చిన స్ఫూర్తితోనే ‘పుష్ఫ’లో స్పెషల్ సాంగ్ చేసినట్లు అసలు విషయాన్ని సమంత బయటపెట్టింది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper