Hackers: సాంకేతిక విప్లవంతో సమాచార రంగంలో కూడా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ప్రస్తుతం వాట్సాప్, ట్విటర్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ లాంటి సామాజిక మాధ్యమ వేదికల ప్రభావం ఎక్కువవుతోంది. దీంతో చాలా మంది ఏదో ఒక ఖాతాను కలిగి ఉంటున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాల హ్యాకింగ్స్ కూడా షాకింగ్ కలిగిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ ట్విటర్ ఖాతాను దుండగులు హ్యాక్ చేసినట్లు గుర్తించారు. గతంలో ప్రియాంక గాంధీ పిల్లలు ఇంకా ప్రముఖుల సోషల్ మీడియా ఖాతాలు కూడా హ్యాకింగ్ కు గురైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సామాజిక మాధ్యమాల గోలతో ప్రస్తుతం అందరిలో భయం కలుగుతోంది.

గతంలో విదేశాంగ శాఖలోని విదేశీ వ్యవహారాల విభాగం ట్విటర్ ఖాతాను హ్యాక్ చేసినట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ సంస్థలు, శాఖలను హ్యాకర్లు పట్టుకుంటున్నట్లు సమాచారం. అప్పుడప్పుడు సోషల్ మీడియా ఖాతాలను టార్గెట్ చేసుకుంటున్నారు. కేంద్ర మంత్రుల ఖాతాలు, వివిధ ప్రభుత్వ ఖాతాలు, మంత్రుల ఖాతాలు హ్యాక్ చేస్తున్నట్లు సమాచారం.
Also Read: రిలయన్స్ నయా ప్లాన్.. గ్లోబల్ ప్లేయర్స్‌తో పోటీ పడి పట్టు నిలుపుదల..!
హ్యాక్ చేసిన ట్విటర్ ఖాతాలకు ఎలాన్ మస్క్ అని పేరు పెట్టుకుంటున్నారు. ప్రొఫైల్ లో చేప ఫొటో పెట్టుకుంటున్నారు. సమాచార శాఖ ట్విటర్ ఖాతా కూడా హ్యాక్ అయినట్లు తెలుస్తోంది. ఐసీడబ్ల్యూఏ ట్విటర్ హ్యాక్ చేసిన దుండగులు టస్లా చీఫ్ ఎలాన్ మస్క్ అనే పేరు పెట్టారు. ఆదివారం రాత్రి చోటుచేసుకున్న ఘటనపై అధికారుల ఫిర్యాదుతో ట్విటర్ సంస్థ వేగంగా స్పందిస్తోంది.
ఈనేపథ్యంలో సోషల్ మీడియా సంస్థలు హ్యాకింగ్ కు గురికావడం కొత్తేమీ కాదు. దేశంలో ప్రముఖుల ఖాతాలు హ్యాక్ కు గురవడంతో అందరు ఆందోళన చెందుతున్నారు. రహస్యంగా ఉండాల్సిన ఖాతాలు ఇలా కావడంతో ఫిర్యాదు చేసేందుకు కూడా ముందుకు రావడం లేదు. ఈ నేపథ్యంలో దుండగుల పన్నాగాలను అడ్డుకోవాల్సిన అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Also Read: కాశీ విశ్వేశ్వర ఆలయంలో లింగానికి ఎదురుగా నంది లేకపోవడానికి కారణం ఏంటో తెలుసా?