Samantha: సౌత్ ఇండియాలోని టాప్ హీరోయిన్లలో సమంత ఒకరు. తన తొలి మూవీ ‘ఏం మాయ చేసావె’తోనే సినీ ప్రియులందరినీ మాయ చేసి తనవైపు తిప్పుకుంది. ఈ సినిమా హిట్టు తర్వాత సమంత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. వరుసగా స్టార్ హీరోల పక్కన నటించిన అనతి కాలంలోనే స్టార్డమ్ సంపాదించుకుంది. 2022 సంవత్సరం సమంత కు వ్యక్తిగతంగా ఎలా? గడిచినప్పటికీ సినిమా పరంగా మాత్రంగా బాగానే కలిసొచ్చిందని చెప్పొచ్చు.
Samantha
2022 సంవత్సరంలో సమంత పలు టాలీవుడ్, బాలీవుడ్ సినిమాల ఆఫర్లను దక్కించుకొని బీజీబీజీగా గడుపుతోంది. ఇక ఇదే సంవత్సరంలో సమంత తన తొలి స్పెషల్ సాంగ్(ఐటమ్ సాంగ్)లో కన్పించి అభిమానులను ఉర్రూతలూగించింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-సమంత కాంబినేషన్లో వచ్చిన ‘పుష్ప’ మూవీ డిసెంబర్ 17న విడుదలై బాక్సాఫీస్ హిట్ దిశగా దూసుకెళుతోంది.
ఈ మూవీలో సమంత ‘ఊ అంటావా మావ.. ఊఊ అంటావా మావ’ అంటూ ఓ స్పెషల్ సాంగ్ చేసింది. సింగర్ మంగ్లీ సిస్టర్ ఇంద్రవరతి చౌహన్ పాడిన ఈ పాట శ్రోతలను ఎంతగానో ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ పాటలో సమంత ఫార్మమెన్స్ అభిమానులను మెస్మరైజ్ చేసింది. ‘పుష్ప’ మూవీకి సమంత సాంగ్ ఓ ప్రత్యేకతను తీసుకొచ్చిందనడంలో అతిశయోక్తి లేదేమో.. అంతలా ఆ సాంగ్ జనాల్లోకి వెళ్లింది.
ఈ సాంగ్ వెనుక సమంత ఎంత కష్టపడిందో ఈ కింది వీడియో చూస్తే మీకే అర్థమవుతోంది. కొరియోగ్రాఫర్ కంపోజ్ చేసిన స్టెప్పులకు సమంత తనదైన రోమాంటిక్ ఎక్స్ ప్రెషన్స్ యాడ్ చేసి ‘ఊ అంటావా మావ’ సాంగ్ కు గ్లామర్ తీసుకొచ్చింది. జిమ్ములో దుమ్మురేపేలా ప్రాక్టీసు చేస్తున్న సమంత డాన్స్ మాస్టర్ ను ఉద్దేశించి అనుకున్న అవుట్ వచ్చేదాకా వదిలిపెట్టేరే.. అంటూ నవ్వుతూ చెప్పడం హైలెట్ గా నిలిచింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను మీరు కూడా చూస్తే ‘ఊ’ కొట్టకుండా ఉండలేరు..!
https://youtu.be/BH5g36xHhRE
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Samantha if you watch this video someone has to hit oo
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com