Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2 ‘ చిత్రం మన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని మరో రెండు మెట్లు పైకి ఎక్కేలా చేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మూవీ లవర్స్ కేవలం భారీ బడ్జెట్ గ్రాఫిక్స్ చిత్రాలకే ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు, కమర్షియల్ సినిమాలను ఎవ్వరూ పట్టించుకోవడం లేదంటూ ఒక అపోహ ఉండేది. కానీ పుష్ప 2 చిత్రంతో అల్లు అర్జున్ ఆ అపోహని తొలగించి, కమర్షియల్ సినిమాలతో కూడా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయొచ్చని ఈ చిత్రం ద్వారా నిరూపించి చూపించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అంతటి సెన్సేషన్ సృష్టించింది అంటే అందుకు ఏకైక కారణం అల్లు అర్జున్ మాత్రమే. తన నటనతో ఈ సినిమాని వేరే లెవెల్ కి తీసుకెళ్లి పెట్టాడు. ఇప్పటికీ ఈ చిత్రం థియేటర్స్ లో నడుస్తూనే ఉంది.
విడుదలకు ముందు సెన్సార్ సర్టిఫికేట్ ఈ సినిమా రన్ టైం 3 గంటల 24 నిమిషాలు ఉండడాన్ని చూసి, అంత నిడివి సినిమాని మన ఆడియన్స్ ఎక్కడ చూస్తారు?, అంత కాళీగా ఉన్నారా జనాలు అంటూ సోషల్ మీడియా లో సెటైర్లు వేశారు. కానీ సినిమాలో దమ్ముంటే మూడు గంటలు కాదు, మరో 20 నిమిషాలు అదనంగా పెట్టినా చూస్తారని నిరూపించి చూపించిన మొట్టమొదటి చిత్రం ఇదే. రీసెంట్ గా మేకర్స్ సినిమాకి జత చేసిన అదనపు 20 నిమిషాల ఫుటేజీ ఎంతటి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చిందో మనమంతా చూసాము. అనేక చోట్ల హౌస్ ఫుల్స్ కూడా పడ్డాయి. అయితే ఈ చిత్రం నేడు అర్థరాత్రి నుండి నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి రానుంది. ఓటీటీ ఆడియన్స్ కి రీ లోడెడ్ వెర్షన్ ని అప్లోడ్ చేయబోతున్నారు. అందుతున్న సమాచారం ఏమిటంటే ఈ చిత్రంలో అల్లు అర్జున్, రష్మిక మధ్య ఒక సాంగ్ ని చిత్రీకరించారట.
సినిమా రన్ టైం ని దృష్టిలో పెట్టుకొని ఆ సాంగ్ ని ఎడిటింగ్ లో తీసేసారట. ఇప్పుడు ఆ పాటని కూడా జత చేసి నెట్ ఫ్లిక్స్ లో అప్లోడ్ చేయబోతున్నట్టు లేటెస్ట్ గా అందుతున్న సమాచారం. ఇదే కనుక నిజమైతే ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ కి పండగే అని చెప్పొచ్చు. థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమాకి ఓటీటీ లో కూడా అదే రేంజ్ రెస్పాన్స్ వస్తుందా?, ఎందుకంటే ఈ చిత్రాన్ని థియేటర్స్ లో దాదాపుగా 10 కోట్ల మంది జనాలు చూసారు. మూవీ లవర్స్ సంఖ్య అంతకు మించి ఉండదు అని అనేకమంది అభిప్రాయం. మరి పుష్ప 2 చిత్రం ఓటీటీ లో కూడా అద్భుతాలను నెలకొల్పుతుందా లేదా అనేది చూడాలి. ఒకవేళ వెస్ట్రన్ ఆడియన్స్ ఈ సినిమాకి కనెక్ట్ అయితే నెలల తరబడి టాప్ 10 లో ట్రెండ్ అవ్వొచ్చు.