Samantha: థియేటర్లలో పుష్పకు తిరుగే లేదనట్లుగా కలెక్షన్లతో దూసుకెళ్లిపోతోంది. స్టైలిస్ట్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా నటించిన ఈ సినిమా డిసెంబరు 17న విడుదలై భారీ రెస్పాన్స్‌ను అందుకుంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా విడుదల కాకముంటే.. ఇందులోని కొన్ని పాటలు రికార్డులు నెలకొల్పాయి. ముఖ్యంగా సమంత నటించిన స్పెషల్ సాంగ్ ఊ అంటావా మావ పాటకు యూట్యూబ్ షేక్ అయిపోయింది.
రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే మిలియన్ల వ్యూస్‌తో దూసుకెళ్లి. సౌత్లనే ఫాస్టెస్ట్ వ్యూస్ సాధించిన పాటగా రికార్డు నెలకొల్పింది. ఇక థియేటర్లలో ఈ పాట చేసిన రచ్చ్ గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. అయితే, తాజాగా, సుకుమార్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ స్పెషల్ సాంగ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
ఈ సందర్భంగా సమంత స్పెషల్ సాంగ్ చేయడానికి వెంటనే ఒప్పుకున్నారా?. అని అడగ్గా.. సుకుమార్ మాట్లాడుతూ.. ఈ పాట గురించి సామ్‌కు చెప్పగానే.. తనకు కరెక్ట్ కాదేమో అని చెప్పింది. అయితే, నటిగా మీకు కొత్తదనాన్ని ఇస్తుందని.. ఈ సాంగ్ కూడా మీకు బాగా కనెక్ట్ అవుతుందని చెప్పి తనే స్వయంగా సమంతను ఒప్పించినట్లు సుకుమార్ వివరించారు. రంగస్థలం సినిమాలో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ గురించి వివరించినా కూడా సమంత నో చెప్పిందని.. ఆ తర్వాత మెల్లగా తన మాటపై నమ్మకంతో ఒప్పుకున్నట్లు సుకుమార్ వివరించారు.
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Director sukumar open comments about samantha special song in allu arjun pushpa movie
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com