HomeNewsKerala: టెక్నాలజీ గొప్పతనమే అదీ..ఇలా సరిగ్గా వాడుకుంటే హత్య కేసునూ ఛేదించవచ్చు

Kerala: టెక్నాలజీ గొప్పతనమే అదీ..ఇలా సరిగ్గా వాడుకుంటే హత్య కేసునూ ఛేదించవచ్చు

Kerala: కేరళ రాష్ట్రంలో 2006 సంవత్సరంలో 19 సంవత్సరాల రంజిని, ఆమె కవలలు(twins) హత్యకు గురయ్యారు. రంజనికి అప్పటికి ఇంకా పెళ్లి కాలేదు. ఆమె తన కుటుంబానికి దూరంగా కేరళ (Kerala) లోని కొల్లం(kollam) ప్రాంతంలో నివసించేది. ఆమె నివసిస్తున్న ఇంటికి ఎదురుగా అనిల్ కుమార్ అనే వ్యక్తి ఉండేవాడు. అనిల్ కుమార్, రంజిని కి సంబంధం ఏర్పడింది. వారిద్దరూ తరచూ శారీరకంగా కలుసుకునేవారు. ఈ క్రమంలో రంజిని గర్భవతి అయింది. ఆమెను గర్భ విచ్చిత్తి చేసుకోమని అనిల్ కుమార్ ఒత్తిడి తేవడం మొదలుపెట్టాడు. దానికి ఆమె ఒప్పుకోలేదు. పైగా తన కడుపులో పెరుగుతున్న పిండానికి చట్టబద్ధత కల్పించాలని రంజిని డిమాండ్ చేసింది. దానికి అనిల్ కుమార్ నిరాకరించాడు. పైగా రంజినీ ని వదిలేశాడు. అనిల్ కుమార్ ఆర్మీ ఉద్యోగిగా పఠాన్ కోట్ పోస్టులో పనిచేసేవాడు. అనిల్ కుమార్ కు అదే ప్రాంతంలో పనిచేస్తున్న రాజేష్ అనే సైనికుడు పరిచయమయ్యాడు. వారిద్దరి మధ్య స్నేహం పెరగడంతో అనిల్ కుమార్ రంజిని విషయాన్ని రాజేష్ తో చెప్పాడు. వారిద్దరు రంజిని, ఆమె కడుపులో పెరుగుతున్న శిశువును చంపాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో రంజిని ప్రసాదం కోసం ఆసుపత్రిలో చేరింది. దీంతో రాజేష్ ఆమె కుటుంబంతో సాన్నిహిత్యం పెంచుకున్నాడు. తప్పించుకుని తిరుగుతున్న అనిల్ కుమార్ ను వెతికి పట్టుకుంటానని రాజేష్ రంజినికి హామీ ఇచ్చాడు. పెళ్ళికాని తల్లి కావడంతో రంజినికి మరో ఇంటిలోకి మార్పించాడు.

హత మార్చాడు

రంజిని ప్రసవించగా ఇద్దరు పిల్లలు పుట్టారు. ఆమె పిల్లలను రాజేష్ హతమార్చాడు. ఈ కేసు కేరళ రాష్ట్రంలో సంచలనంగా మారింది. స్థానిక పోలీసులు ఈ కేసును చేదించలేకపోవడంతో 2010లో సిబిఐకి బదిలీ చేశారు. చివరికి సిబిఐ కూడా ఈ కేసును పరిష్కరించలేకపోయింది. అయితే కేరళ రాష్ట్రానికి చెందిన కొంతమంది పోలీసులు మాత్రం ఈ కేసును దర్యాప్తు చేయడానికి ఆపలేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అనిల్ కుమార్, రాజేష్ ప్రస్తుత చిత్రాలను రూపొందించారు. ఆ తర్వాత వారి ముఖాలను సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేసి.. వివరాలు కనిపెట్టే ప్రయత్నం మొదలుపెట్టారు. అయితే ఫేస్ బుక్ లో ఓ పాత పెళ్లి ఫోటోలు అనిల్ కుమార్ ఐ ఫోటో 90 శాతం సరిపోలింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆ వ్యక్తిని పుదుచ్చేరి ప్రాంతంలో గుర్తించారు. కేరళ పోలీసులు సిబిఐ సహాయంతో అతన్ని ఆదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తి అనిల్ కుమార్ అని నిర్ధారించుకున్నారు. అయితే ప్రస్తుతం అతడు తన పేరును విష్ణుగా మార్చుకున్నాడు. ఓ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలిని వివాహం చేసుకున్నాడు. అంతేకాదు అనిల్ కుమార్ ద్వారా ప్రవీణ్ కుమార్ గా పేరు మార్చుకున్నారు రాజేష్ చూకిని కూడా కనుగొన్నారు.. ప్రస్తుతం అనిల్ వయసు 42, రాజేష్ వయసు 48 సంవత్సరాలు. వీరిద్దరూ స్కూల్ టీచర్లను పెళ్లి చేసుకున్నారు. నకిలీ గుర్తింపు కార్డులతో పుదుచ్చేరి ప్రాంతంలో ఉంటున్నారు. రాజేష్, అనిల్ గతంలో సైన్యంలో పనిచేయగా.. అక్కడి క్రమశిక్షణ తట్టుకోలేక వారిద్దరు పారిపోయి వచ్చారు వచ్చారు.

కవలలకు జన్మనిచ్చిన తర్వాత..

రంజిని కవల పిల్లలకు జన్మను ఇచ్చిన తర్వాత.. ఆమె వ్యక్తిత్వం మంచిది కాదని అనిల్ కుమార్, అతని కుటుంబ సభ్యులు విష ప్రచారం చేశారు. అయితే డిఎన్ఏ పరీక్షకు రంజిని డిమాండ్ చేయడంతోనే.. అనిల్ కుమార్ రంజిని, ఆమె కవల పిల్లల హత్యకు ప్రణాళిక రూపొందించాడు. అయితే 2006లో ఈ ఘటన జరగగా.. 19 సంవత్సరాల తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ కేసును కేరళ పోలీసులు చేదించారు. సిబిఐ కూడా పరిష్కరించాలని ఈ కేసును ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనాలు ఉపయోగించి పోలీసులు పరిష్కరించారు. ఇక అనిల్, రాజేష్ జుడిషియల్ కస్టడీలో ఉన్నట్టు కేరళ పోలీసులు చెబుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version