spot_img
Homeఎంటర్టైన్మెంట్Mad For Each Other show eliminated couples: 'మ్యాడ్ ఫర్ ఈచ్ అథర్' షోలో...

Mad For Each Other show eliminated couples: ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అథర్’ షోలో ఎలిమినేట్ అయిన 3 జంటలు ఇవే..ప్రస్తుతం టాప్ లో ఉన్నది ఎవరంటే!

Mad For Each Other show eliminated couples: మరో రెండు రోజుల్లో స్టార్ మా , జియో హాట్ స్టార్ లో ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అథర్ ‘ అనే అతి పెద్ద రియాలిటీ షో ప్రారంభం కాబోతుంది. ఈ షో కి సంబంధించిన షూటింగ్ మొదలై దాదాపుగా నెల రోజులు కావొస్తుంది. ఇప్పటికే ఈ షో నుండి మూడు జంటలు ఎలిమినేట్ అయ్యారట. జంటల మధ్య గొడవలు జరగడం, ఒక జంటకు మరో జంటకు మధ్య కూడా గొడవలు జరగడం, మధ్యలో వీళ్ళ ప్రేమని టెస్ట్ చేసే విధంగా బీభత్సమైన టాస్కులు జరగడం , ఇలా చాలానే ఉన్నాయట. బిగ్ బాస్ కంటే చాలా ఆసక్తికరంగా ఈ రియాలిటీ షో నడుస్తున్నట్టు తెలుస్తోంది. ఎవరెవరు ఈ షో నుండి ఎలిమినేట్ అయ్యారు అని తెలుసుకునే ముందు, ఈ షో గురించి తెలిసిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు మీ ముందు ఉంచబోతున్నాము.

అందుతున్న సమాచారం ప్రకారం, ఈ షో లో ప్రతీ వారం లీడర్ బోర్డు ఒకటి ఉంటుందట. టాస్కులు , కంటెస్టెంట్స్ ప్రవర్తన బట్టి మార్కులు ఉంటాయి. ఈ లీడర్ బోర్డు లో అందరికంటే టాప్ లో ఉన్న కంటెస్టెంట్ విల్లా లో అన్ని రకాల లగ్జరీ దొరుకుతుంది అట. వాళ్ళ కోసం అందమైన బెడ్ రూమ్ కూడా ఇస్తారట. అదే విధంగా లీడర్ బోర్డు లో అందరికంటే తక్కువ ఉన్నటువంటి చివరి మూడు జంటలకు మాత్రం , లగ్జరీ బెడ్ రూమ్స్ ఉండవట. ఒకే పెద్ద బెడ్ రూమ్ లో 6 బెడ్స్ ఉంటాయట. అందులోనే వీళ్లంతా ఉంటారట. అంతే కాకుండా తక్కువ మార్కులు వచ్చిన జంటలు కలిసి ఉండడానికి కూడా వీలు లేదట. ఆ సమయంలో వాళ్ళ మధ్య ఎలాంటి సందర్భాలు ఎదురు అయ్యాయి అనేది ఆసక్తికరంగా ఉండబోతుంది. అంతే కాకుండా మొదటి నాలుగు వారాలు లీడర్ బోర్డు మార్కులు బట్టి ఎలిమినేషన్ ఉంటుంది.

కానీ 5 వ వారం నుండి మాత్రం ఆడియన్స్ ఓటింగ్ + లీడర్ బోర్డు మార్కులను బట్టి ఎలిమినేషన్ ఉంటుందట. ప్రస్తుతం అయితే టాస్కులు బీభత్సంగా ఆడుతూ అందరికంటే అత్యధిక మార్కులతో టాప్ 2 స్థానాల్లో ఉన్న జంటలు ప్రియాంక జైన్ – శివ , సోనియా – సిద్దు జంటలట. ఇక ఎలిమినేట్ అయినా కంటెస్టెంట్స్ విషయానికి వస్తే మొదటి వారం హరిత – హరీష్ ఎలిమినేట్ అవ్వగా, రెండవ వారం మహేష్ – సాండ్రా ఎలిమినేట్ అయ్యారట. రెండు మంచి స్ట్రాంగ్ జోడీలు కానీ ఎందుకు ఎలిమినేట్ అయ్యారు అనేది మనం షో చూసిన తర్వాతే తెలుస్తుంది. ఇక ఎలిమినేట్ అయినా మూడవ జోడి అంజలి – పవన్ అని అంటున్నారు కానీ, స్పష్టమైన సమాచారం ప్రస్తుతానికి లేదు. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version