Homeఆంధ్రప్రదేశ్‌Tirupati Stampede: తిరుమలలో తొక్కిసలాట.. విద్రోహ చర్య? కావాల్సి చేశారా?

Tirupati Stampede: తిరుమలలో తొక్కిసలాట.. విద్రోహ చర్య? కావాల్సి చేశారా?

Tirupati Stampede: తిరుమలలో తొక్కిసలాట విద్రోహుల చర్య? కావాలనే ఇది చేశారా? ఓ ముఠా చేసిన పనా? లేకుంటే భద్రత వైఫల్యమా? ఇప్పుడు అంతటా ఇదే చర్చ. వైకుంఠ ఏకాదశి( vaikunta Ekadashi ) సందర్భంగా ఉత్తర ద్వార దర్శనానికి సంబంధించి టోకెన్ల జారీ వేళ ( token issue )అపశృతి చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఒకేసారి టోకెన్ల కోసం భారీగా భక్తులు రావడంతో తీవ్ర తోపులాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. అందులో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. పదుల సంఖ్యలో భక్తులు అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం రుయా ఆసుపత్రిలో( Riya Hospital) చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన సర్వత్రా ఆందోళన కలిగించింది. అయితే ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒక్కసారిగా తొక్కిసలాట జరగడానికి.. వెనుక నుంచి తోపులాటకు దిగినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై టీటీడీ విజిలెన్స్ అధికారులు( Vigilance officers) అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు.

* ఉదయం భక్తుల సంతృప్తి
వాస్తవానికి వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి టిటిడి( Tirumala Tirupati Devasthanam) అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఆ ఏర్పాట్లపై భక్తుల నుంచి ప్రశంసలు కూడా వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా టోకెన్ల జారీకి సంబంధించి పటిష్ట చర్యలు చేపట్టడంపై బుధవారం ఉదయం భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. టీటీడీ చర్యలపై ప్రశంసించారు కూడా. టోకెన్ల జారీ క్యూ లైన్ లో అనారోగ్యంతో ఆయాస పడుతున్న ఓ వృద్ధురాలిని క్యూలైన్ నుంచి గేటు లోపలికి తీసుకెళ్లారు సిబ్బంది. ఎందుకు క్యూ లైన్ లో ఉన్న భక్తులు కూడా ఎంతగానో సహకరించారు. ఆ వృద్ధురాలి ప్రాణాలు కాపాడడంలో సిబ్బంది చాకచక్యం ప్రదర్శించారు. అయితే అక్కడకు కొద్దిసేపటికి తొక్కిసలాట జరగడం అనుమానాలకు తావిస్తోంది.

* కావాలనే తోపులాట?
అయితే కావాలనే క్యూ లైన్ లో( que lines) తోపులాటకు వ్యూహం పన్నారు అన్నది ఒక అనుమానం. క్యూలైన్లో ఒకచోట కేకలు అరుపులతో కొందరు దుమారం రేపినట్లు తెలుస్తోంది. ముందున్న భక్తులను ఒక్కసారి నెట్టినట్లు సమాచారం. అయితే ఇది ఒక వ్యక్తి కావాలని చేసిన పనా? గుంపుగా వచ్చి చేశారా అన్నది తెలియాల్సి ఉంది. ఈ ఘటనలో ముందు వరుసలో ఉన్న భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఒకేసారి నేల మీద పడడం.. మిగతావారు వారిపై పడడంతో తీవ్రంగా గాయపడి ప్రాణాలు వదిలారు. అయితే చివరకు సాయం చేసేందుకు ప్రయత్నించిన సిబ్బందికి సైతం ఆటంకాలు సృష్టించినట్లు కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి.

* టిటిడి సీరియస్
టీటీడీ( Tirumala Tirupati Devasthanam) చరిత్రలోనే ఇంతటి విషాదం ఎప్పుడూ లేదు. ఈ ఘటనను తిరుమల తిరుపతి ట్రస్ట్ బోర్డు సీరియస్ గా తీసుకుంది. పోలీసులతో పాటు నిఘా వ్యవస్థ ఆరా తీస్తోంది. భక్తుల నుంచి వివరాలు సేకరించే పనిలో పడింది. మరోవైపు సిసి పుటేజీలను( cc footages) సైతం పరిశీలిస్తున్నారు పోలీసులు. అయితే ఇది విద్రోహ చర్య? లేకుంటే కావాలని పని గట్టుకొని చేశారా? అన్నది తెలియాల్సి ఉంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version