spot_img
Homeఎంటర్టైన్మెంట్Trivikram goodbye to Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కి త్రివిక్రమ్ 'గుడ్ బై'..ఫ్యాన్స్ కి...

Trivikram goodbye to Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కి త్రివిక్రమ్ ‘గుడ్ బై’..ఫ్యాన్స్ కి ఊహించని ట్విస్ట్..అసలు ఏమైందంటే!

Trivikram goodbye to Pawan Kalyan: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) , త్రివిక్రమ్(Trivikram Srinivas) మధ్య ఉన్న స్నేహం గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వాళ్ళ స్నేహం మీద ఒక బయోపిక్ కూడా తీసేయొచ్చు, ఒకరంటే ఒకరికి అంత ప్రేమ, అభిమానం ఉంటుంది. రీ ఎంట్రీ తర్వాత పవన్ కళ్యాణ్ ఎలాంటి సినిమాలు చెయ్యాలి అనేది నిర్ణయించేది ఆయనే. ‘వకీల్ సాబ్’, ‘ఓజీ’, ‘భీమ్లా నాయక్’ లాంటి సూపర్ హిట్ చిత్రాలను సెట్ చేసింది ఆయనే, అదే విధంగా ‘బ్రో’, ‘హరి హర వీరమల్లు ‘ లాంటి ఫ్లాప్ సినిమాలు సెట్ చేసింది కూడా ఆయనే. నేను రాజకీయాల్లో బిజీ గా ఉంటె, నాకోసం సినిమాలు సెట్ చేసే మిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అని పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో బహిరంగంగానే చెప్పుకొచ్చాడట. అయితే ఇప్పుడు ఆయన ఆ బాధ్యత నుండి తప్పుకున్నట్టు తెలుస్తోంది.

ఇకపై కేవలం తన భవిష్యత్తు ప్రాజెక్ట్స్ మీదనే ద్రుష్టి పెట్టాడట. రీసెంట్ గా ఒక స్టార్ నిర్మాత తన వద్ద పవన్ కళ్యాణ్ కోసం ఒక పవర్ ఫుల్ కథ ఉందని త్రివిక్రమ్ వద్దకు వివరించడానికి వచ్చినప్పుడు, ఇప్పుడు నేను ఆ పని చేయడం లేదు, విశ్వప్రసాద్ గారికి వెళ్లి వినిపించండి, ఇకపై పవన్ కళ్యాణ్ గారి సినిమాల ప్లానింగ్ మొత్తం ఆయనే చూసుకుంటాడు అని చెప్పి పంపాడట. విశ్వ ప్రసాద్ ఎవరో కాదు, ‘పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ’ అధినేత. ఈ ఏడాది ఆయన ప్రొడక్షన్ నుండి వచ్చిన ‘రాజా సాబ్ ‘ చిత్రం ఎంత పెద్ద ఫ్లాప్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రీసెంట్ గానే పవన్ కళ్యాణ్ ఇతనితో చేతులు కలిపాడు. అందుకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా చేసాడు. త్వరలోనే వీళ్ళ కాంబినేషన్ లో నాలుగు సినిమాలు రాబోతున్నాయి. పవన్ కళ్యాణ్ నిర్మాణం లో కూడా భాగం కాబోతున్నాడు.

Also Read: రష్మిక మందాన కి ఆ స్టార్ హీరో అన్నయ్య అవుతాడా..?

అయితే ఇన్ని రోజులు త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ లైనప్ విషయం లో బాధ్యతలు తీసుకోవడం వల్ల, చాలా డీసెంట్ ఫలితాలు వచ్చాయి, ఓజీ అయితే చాలా పెద్ద రేంజ్ లో వర్కౌట్ అయ్యింది. అలాంటి త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పుడు ఆ బాధ్యతల నుండి తప్పుకోవడంతో పవన్ కళ్యాణ్ భవిష్యత్తు సినిమాల పై ప్రభావం చూపబోతున్నాయా ?, అసలు ఎందుకు త్రివిక్రమ్ ఈ బాధ్యత నుండి తప్పుకున్నాడు, ఆయన బిజీ అవ్వడం వల్ల తప్పుకున్నాడా ?, లేకపోతే వాళ్ళిద్దరి మధ్య మనస్పర్థలు ఏమైనా ఎదురయ్యాయా?, అంటూ సోషల్ మీడియా లో అభిమానులు మాట్లాడుకుంటున్నారు. అయితే రీసెంట్ గా పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్ ‘ చిత్రానికి డబ్బింగ్ చెప్పినప్పుడు కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆయనతోనే ఉన్నాడని, వాళ్ళ మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవని తెలుస్తోంది. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version