Supreme Court decision on Ustaad Bhagat Singh: మరో 6 రోజుల్లో పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘ఉస్తాద్ భగత్ సింగ్ ‘(Ustaad Bhagat Singh) చిత్రం విడుదల అవ్వబోతున్న సందర్భంగా మేకర్స్ ఈ సినిమా ప్రమోషనల్ కార్యక్రమాల్లో ఫుల్ బిజీ గా గడుపుతున్నారు. అది కాసేపు పక్కన పెడితే నిన్న ఈ చిత్రం నుండి విడుదల చేసిన ‘ఎత్తరా ఎత్తరా కాలరే ఎత్తరా’ పాటకు బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. అభిమానులు ఈ సినిమాలోని మిగతా రెండు పాటలకు పెద్దగా కనెక్ట్ అవ్వలేకపోయారు కానీ, ఈ పాటకు మాత్రం బాగా కనెక్ట్ అయ్యారు. ఆడియో , విజువల్స్ , పవన్ కళ్యాణ్ డ్యాన్స్ , ఇలా అన్నీ కూడా అభిమానులకు నచ్చింది. రేపు విడుదల అవ్వబోయే ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎల్లుండి హైదరాబాద్ లోని యూసఫ్ గూడ పెరేడ్ గ్రౌండ్స్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరగబోతుంది.
ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రానికి ఉన్న అతి పెద్ద చిక్కుముడి ఇప్పుడు వీడబోతుంది. అదేంటంటే తెలంగాణ లో ఇకమీదట ఏ సినిమాకు కూడా హైక్స్ ఇవ్వకూడదని, ఒకవేళ ప్రభుత్వం టికెట్ హైక్స్ జీవో ని జారీ చేస్తే, అది 90 రోజుల ముందే ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది తెలంగాణ హై కోర్టు. దీనిపై ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నిర్మాతలు ‘మైత్రీ మూవీ మేకర్స్ ‘ సుప్రీమ్ కోర్టు ని ఆశ్రయించారు. ముకుల్ రోహత్ లాంటి టాప్ లాయర్ ఈ కేసు వాదనలు చేపట్టారు. తీర్పు నిర్మాతలకు అనుకూలంగా వచ్చింది. సినిమా టికెట్ హైక్స్ కోసం 90 రోజుల ముందుగా దరఖాస్తు చేసుకోవాలి అనే హై కోర్టు ఆర్డర్ కి తాత్కాలిక బ్రేక్ పడింది. దీంతో ఇప్పుడు తెలంగాణ లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రీమియర్ షోస్ మరియు రెగ్యులర్ షోస్ కి టికెట్ హైక్స్ పక్కాగా రాబోతున్నాయి.
Also Read: పవన్ కళ్యాణ్ కి త్రివిక్రమ్ ‘గుడ్ బై’..ఫ్యాన్స్ కి ఊహించని ట్విస్ట్..అసలు ఏమైందంటే!
ఆంధ్ర ప్రదేశ్ లో కూడా నేడు జీవో అధికారికంగా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. నిన్న మొన్నటి వరకు తెలంగాణ లో టికెట్ హైక్స్ రావడం కష్టమేమో, కనీస స్థాయి ఓపెనింగ్ వసూళ్లు కూడా రావంటూ అభిమానులు సోషల్ మీడియా లో కంగారు పడుతూ ఉండేవారు. కానీ ఇప్పుడు తెలంగాణ లో టికెట్ హైక్స్ రాబోతున్నాయి, ప్రీమియర్ షోస్ కూడా ఉండే అవకాశం ఉంది. మొదటి రోజు ఉగాది కావడంతో , పాజిటివ్ టాక్ వస్తే చాలు, సునామీ లాంటి ఓపెనింగ్ వసూళ్లు వస్తాయని అభిమానులు ఇప్పుడు బలమైన నమ్మకాన్ని పెంచుకున్నారు. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.
