Hyderabad Pension Fraud Case: హైదరాబాద్‌లో తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన చూస్తుంటే.. “వారసత్వం” అనే పదానికి కొత్త అర్థం వెతకాల్సి వస్తోంది. కన్నతల్లి చనిపోతే పిల్లలు కన్నీళ్లు పెట్టుకుంటారు, కానీ ఈ ‘ తెలివైన’ కూతురు మాత్రం తల్లి చనిపోయిన విషయాన్ని గోప్యంగా ఉంచి, ఆవిడ పేరు మీద వచ్చే పింఛనును తన సొంత ‘వ్యాపార ఆదాయం’లా మార్చుకుంది.
Also Read: తెలుగు రాష్ట్రాల్లో ‘ధురంధర్ 2 ‘ కి బయ్యర్స్ కరువు.. కారణం ఏంటంటే!
ఈ తెలివితేటల వెనుక ఉన్న లాజిక్ ఇదేనా?
లైఫ్ సర్టిఫికెట్ అంటే.. ‘లైఫ్’ ఉండాలని రూల్ ఏముంది? ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏటా బతికే ఉన్నామని సాక్ష్యం చూపాలి. కానీ, ఈమె ఏ మాయ చేసిందో ఏమో, తల్లి చనిపోయినా.. పత్రాల్లో మాత్రం ఆవిడ ఇంకా ‘జీవించే’ ఉండేలా సెట్టింగ్ చేసింది. బహుశా ఆవిడ ఉద్దేశంలో.. పెన్షన్ వచ్చే వరకు తల్లి ‘సాంకేతికంగా’ బతికే ఉండాలి!
6.45 లక్షల ‘పెన్షన్ ప్లాన్’
ఒకేసారి లక్షలు కొట్టేయకుండా, నెలకు కొంత చొప్పున డ్రా చేస్తూ.. ఒక క్రమశిక్షణ కలిగిన ‘ఉద్యోగిని’లా ఏళ్ల తరబడి ఈ మోసానికి పాల్పడటం మామూలు విషయం కాదు. ఈ శ్రమను ఏదైనా చిన్నపాటి వ్యాపారానికి కేటాయించి ఉంటే, ఇప్పుడు జైలుకు వెళ్లే పరిస్థితి వచ్చేది కాదేమో..! పెన్షన్లు పంపిణీ చేసే అధికారులకు ఇన్నాళ్లూ ఈ విషయం తెలియలేదంటే.. సిస్టమ్ ఎంత ‘నిద్రపోతుందో’ అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు అధికారులు హడావిడిగా రికార్డులు తనిఖీ చేస్తున్నారట. అంటే.. ఒక గుర్రం పోయాక గుర్రపు శాల కట్టినట్టు అన్నమాట.
అమ్మ చనిపోయినా, ఆవిడ ఇచ్చే పెన్షన్ ఆపకుండా చూసుకున్న ఈ ‘అత్యుత్సాహవంతురాలికి’ ఇప్పుడు పోలీసులు కఠిన పాఠాలు నేర్పడానికి సిద్ధమయ్యారు. బతికున్నప్పుడు అమ్మను జాగ్రత్తగా చూసుకోవడం మర్చిపోయి, చనిపోయాక కూడా ఆవిడను ఇలా ‘పెన్షన్ మిషన్’లా వాడుకోవడం కంటే దారుణమైన విషయం ఏముంటుంది? ఈ కేసు దర్యాప్తులో ఇంకెన్ని విడ్డూరాలు బయటపడతాయో వేచి చూడాలి!