Homeఆంధ్రప్రదేశ్‌Tirumala Stampede: తిరుమల తొక్కిసలాట : మృతుల సంఖ్య ఎంతకు చేరింది? ఎంతమంది సీరియస్ గా...

Tirumala Stampede: తిరుమల తొక్కిసలాట : మృతుల సంఖ్య ఎంతకు చేరింది? ఎంతమంది సీరియస్ గా ఉన్నారు?

Tirumala Stampede: తిరుపతి( Tirupati) చరిత్రలోనే అత్యంత విషాద ఘటన ఇది. వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మృత్యువాత పడ్డారు. మరో 48 మంది గాయాల పాలయ్యారు. ప్రస్తుతం వారంతా తిరుపతిలోని రుయా, స్విమ్స్( swims) ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మృతుల్లో నలుగురు మహిళలు ఒక పురుషుడు ఉన్నారు. వీరిలో నర్సీపట్నం కి చెందిన బుద్దేటి నాయుడు బాబు, విశాఖకు చెందిన రజిని, లావణ్యలుగా గుర్తించారు. కర్ణాటకలోని బళ్లారికి చెందిన నిర్మల అనే మహిళ సైతం మృతి చెందారు. అంతకుముందే శ్రీనివాసమ్( srinivasam ) వద్ద ఏర్పాటు చేసిన టోకెన్ల కేంద్రం వద్ద మల్లిగ అనే మహిళ అస్వస్థతకు గురై మృత్యువాత పడ్డారు. ఆమె తమిళ నాడు లోని సేలం( Selam) ప్రాంతానికి చెందిన మహిళగా గుర్తించారు. ఈ ఆరుగురు మాత్రమే మృతి చెందినట్లు తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్( Venkateshwar ) తెలిపారు. చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు చెప్పారు.

* గత కొద్దిరోజులుగా సన్నాహాలు
ఈ నెల 10 నుంచి తిరుమలలో( Tirumala) వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు. గత కొద్దిరోజులుగా సన్నాహాలు కూడా ప్రారంభించారు. పది నుంచి 19 వరకు ఉత్తర ద్వార దర్శనాలకు సంబంధించి ఆన్ లైన్ టోకెన్ల జారీ ప్రక్రియ పూర్తి చేశారు. ప్రారంభించిన కొద్ది గంటల్లోనే టోకెన్లు బుక్ అయ్యాయి. అయితే ఇప్పుడు ఆఫ్లైన్ టోకెన్ల జారీ ప్రక్రియ ప్రారంభం అయింది. తిరుపతిలో ఎనిమిది కేంద్రాల వద్ద స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల జారీకి టీటీడీ అధికారులు ఏర్పాటు చేశారు. ఈనెల 10, 11, 12 తేదీలకు సంబంధించి మొత్తం 1.20 లక్షల టోకెన్ల జారీకి నిర్ణయించారు. అయితే గురువారం ఉదయం ఐదు గంటలకు టోకెన్ల జారీ ప్రక్రియ ప్రారంభించనున్నట్లు అధికారులు ప్రకటించారు. కానీ బుధవారం ఉదయం నుంచే భక్తుల తాకిడి అక్కడ కనిపించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక( Karnataka), తమిళనాడు( Tamil Nadu ) రాష్ట్రాల నుంచి భక్తులు టోకెన్ల జారీ కేంద్రాల వద్దకు చేరుకున్నారు. బుధవారం సాయంత్రానికి ఈ రద్దీ మరింత పెరిగింది.

* అన్నిచోట్ల అదే పరిస్థితి
తిరుపతిలో ( Tirupati)జీవకోన, బైరాగి పట్టెడ, శ్రీనివాసన్, అలిపిరి వద్ద ఏర్పాటు చేసిన టోకెన్ల జారీ కేంద్రాల వద్ద తొక్కిసలాట జరిగింది. అయితే స్వల్పంగా తోపులాట జరగడంతో పోలీసులు అదుపు చేయగలిగారు. ఎస్పీ సుబ్బారాయుడు( SP subbarayudu ) ఎక్కడికక్కడే పరిస్థితిని పర్యవేక్షిస్తూ.. తొక్కిసలాటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే బైరాగి పట్టెడలోని రామానాయుడు హై స్కూల్ వద్ద తొక్కిసలాట జరిగింది. రాత్రి 8 15 గంటలకు ఒక వ్యక్తి అస్వస్థతకు గురి కావడంతో సిబ్బంది వైద్యం అందించేందుకు గేట్లు తెరవబోయారు. క్యూలైన్లలో వదిలేందుకు గేట్లు తెరుస్తున్నారని భావించిన కొందరు ఒక్కసారిగా ముందుకు వచ్చారు. దీంతో భారీ తోపులాట జరిగింది. ఊపిరాడక పలువురు అస్వస్థతకు గురయ్యారు. ఆసుపత్రికి వెళ్లే సమయానికి నలుగురు మృత్యువాత పడ్డారు. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. 48 మంది భక్తులు గాయాల పాలయ్యారు. 12 మందికి స్విమ్స్ లో, 36 మందికి రుయా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

* ప్రభుత్వం సీరియస్
ఈ ఘటనపై కూటమి ప్రభుత్వం( AP government) సీరియస్ అయ్యింది. సీఎం చంద్రబాబు( Chandrababu) తో పాటు డిప్యూటీ సీఎం పవన్( Pawan Kalyan) కళ్యాణ్ స్పందించారు. భద్రతా చర్యల్లో వైఫల్యాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షతగాత్రుల సహాయ చర్యలు, వైద్య సేవలను పర్యవేక్షించేందుకు మంత్రులు వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్, సత్య కుమార్ యాదవ్ ల బృందం తిరుపతికి బయలుదేరింది. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఎప్పటికప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నతాధికారులతో సమీక్షిస్తున్నారు. తిరుపతిలో జరిగిన తొక్కి సలాటలో క్షతగాత్రుల వివరాలు, ఇతర సమాచారం కోసం కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్( control room) ఏర్పాటు చేశారు. వివరాలు కావలసినవారు 0877-2236007 నంబర్కు సంప్రదించాలని కలెక్టర్ వెంకటేశ్వర్ కోరారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version