Maharaja: సినిమా థియేటర్లను ప్రేక్షకులు పక్కన బెట్టడంతో సినీ నిర్మాతలు ఎక్కువగా ఓటీటీలనే నమ్ముకున్నారు. ఈ ప్లాట్ ఫాం ను బేస్ చేసుకొనే సినిమాలు నిర్మిస్తున్నారు. ఒకవేళ తాము తీసిన సినిమాలు థియేటర్లో రిలీజ్ అయినా అక్కడ సక్సెస్ కాకపోవడంతో ఓటీటీలో రిలీజ్ చేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అయితే లేటేస్టుగా రెండు సినిమాలు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయ్యాయి. ఈరెండు సినిమాలతో నెట్ ఫ్లిక్స్ సంస్థకు విచిత్ర అనుభవం ఎదురైంది. వీటిలో ఒకటి భారీ బడ్జెట్ పెట్టి కొన్న సినిమా అట్టర్ ప్లాప్ అయితే… ఏమాత్రం అంచనాలు లేకుండా తక్కువ బడ్జెట్ తో కొన్న సినిమా సక్సెస్ అయింది. అసలు వివరాల్లోకి వెళితే..
Also Read: ‘బ్యాడ్ న్యూజ్’ మూవీ యూఎస్ఏ రివ్యూ…
నెట్ ఫ్లిక్స్ సంస్థలో ఇంటర్నేషనల్ లెవల్లో ఉండే సినిమాలే ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ఈ సంస్థ సైతం ఆచి తూచి అడుగులు వేస్తూ సినిమాలను దక్కించుకుంటుంది. అయినా నెట్ ప్లిక్స్ లో ఒక్కోసారి కొన్ని సినిమాలు బోల్తా కొట్టినవి చాలానే ఉన్నాయి. అయితే లేటేస్టుగా ఒకే పేరు ‘మహరాజ్’ తో ఉన్న రెండు సినిమాలను నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. ఈరెండింటిలో ఒక మహరాజ్ (హిందీ)ని భారీ బడ్జెట్ పెట్టి కొనుగోలు చేసింది. మరో మహరాజ్(తమిళం) లోబడ్జెట్ తో కొనుగోలు చేసింది.
బాలీవుడ్ స్టార్ హీరో కం డైరెక్టర్ అయిన అమీర్ ఖాన్ కు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉంది. తన వారసుడిగా జునైద్ ఖాన్ ను ఇండస్ట్రీకి గ్రాండ్ గా పరిచయం చేయాలనుకున్నాడు. దీంతో ఆ బాధ్యతను యష్ రాజ్ ఫిలింస్ కు అప్పగించాడు. బీ టౌన్ లో యష్ రాజ్ కు ఎంత పేరుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీంతో ఈ సంస్థ ఇటీవల ‘మహారాజ్’ అనే సినిమాను తీసింది. ఇందులో అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ ను హీరోగా పరిచయం చేయించింది. కొన్ని సంవత్సరాల కిందట ఓ దొంగ స్వామి చేసిన పనుల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే ఈసినిమా హిందువులను కించపరిచే విధంగా ఉందని వివాదాలు మొదలయ్యాయి. ఈ సినిమాకు వివాదాలు ప్రారంభం కాగానే మంచి పబ్లిసిటీ వస్తుందని అనుకున్నారు. కానీ ఈ విషయాన్ని ఎవరూ పెద్దగా రేజ్ చేయలేదు. దీంతో చడీ చప్పుడు కాకుండా నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయింది. దీంతో భారీ బడ్జెట్ తో కొనుగోలు చేసిన నెట్ ప్లిక్స్ కు ఈ సినిమా ద్వారా తీవ్ర నష్టం కలిగింది.
ఇదే సమయంలో తమిళ హీరో విజయ్ సేతుపతి నటించిన ‘మహారాజ్’ ను తక్కువ బడ్జెట్ తో కొనుగోలు చేసింది. సౌత్ ఫిలిం అయినందువల్ల ఎవరు చూస్తారు లే అనుకొంది. కానీ ఈ సినిమా వ్యూస్ చూసి నెట్ ఫ్లిక్స్ షాక్ అయింది. వాస్తవానికి మహరాజ్ థియేటర్లో రిలీజ్ అయి మంచి పేరు తెచ్చుకుంది. ఇప్పుడు ఓటీటీ ద్వారా కూడా ఆదరణ పొందుతోంది. దీంతో నెట్ ప్లిక్స్ సంస్థ సైతం ఈ సినిమాకు ప్రమోషన్ ను కల్పిస్తోంది. అటు సోషల్ మీడియాలో మహరాజ్ గురించి ప్రత్యేకంగా చర్చ పెట్టుకుంటున్నారు.
కొన్నేళ్లుగా సౌత్ ఇండస్ట్రీ సినిమాలు బాలీవుడ్ కు షాక్ ఇస్తున్నాయి. ఇక్కడ తక్కువ బడ్జెట్ తో సినిమాలు తీసి ఓటీటీ ప్లాట్ ఫాం మీద తమ ప్రతాపం చూపిస్తున్నాయి. అయినా కొన్ని ఓటీటీ సంస్థలు సౌత్ సినిమాలకు సరైన బడ్జెట్ ను కేటాంచడం లేదు. అయితే ముందుగా అంచనాలు వేసుకొని భారీ బడ్జెట్ తో కొనుగోలు చేసినవి మాత్రం తీవ్ర నష్టాన్ని చేకూరుస్తున్నాయి.
Also Read: ఐదుగురు భార్యలతో శోభనం, ఓటీటీలో సెన్సేషనల్ సిరీస్… ఈవారం స్ట్రీమ్ అవుతున్న చిత్రాలు/సిరీస్ల లిస్ట్!