OTT : ఐదుగురు భార్యలతో శోభనం, ఓటీటీలో సెన్సేషనల్ సిరీస్… ఈవారం స్ట్రీమ్ అవుతున్న చిత్రాలు/సిరీస్ల లిస్ట్!

అందుకే ప్రతివారం సూపర్ హిట్ సినిమాలు, సిరీస్లు ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ఓటీటీ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. పదుల సంఖ్యలో ఉన్న ఓటీటీ సంస్థల మధ్య నెలకొన్న పోటీ కూడా ఆడియన్స్ కి క్వాలిటీ కంటెంట్ లభించేందుకు దోహదం చేస్తుంది. ఇక జులై 19న ఓటీటీలో కొన్ని అద్భుతమైన చిత్రాలు, సిరీస్లు స్ట్రీమ్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి. అవేమిటో చూద్దాం..

Written By: S Reddy, Updated On : July 18, 2024 9:37 pm
Follow us on

OOT : శుక్రవారం వస్తుందంటే మూవీ లవర్స్ కి పండుగ. పలు చిత్రాలు థియేటర్స్ లో విడుదల అవుతాయి. ఇక ఓటీటీలో అయితే అన్ లిమిటెడ్ కంటెంట్. థియేటర్స్ కంటే కూడా ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ మీద ఆడియన్స్ ఆసక్తి పెంచుకుంటున్నారు. తక్కువ ఖర్చుతో ఇంటిల్లిపాది బయటకు వెళ్లకుండా నచ్చిన సినిమా చూసి ఎంజాయ్ చేయవచ్చు. అలాగే విలక్షణమైన కంటెంట్ అందుబాటులో ఉంటుంది. నచ్చిన జోనర్ ఎంచుకుని ఇంట్లో వండిన స్నాక్స్ తింటూ వీకెండ్ ఎంజాయ్ చేయవచ్చు.

అందుకే ప్రతివారం సూపర్ హిట్ సినిమాలు, సిరీస్లు ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ఓటీటీ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. పదుల సంఖ్యలో ఉన్న ఓటీటీ సంస్థల మధ్య నెలకొన్న పోటీ కూడా ఆడియన్స్ కి క్వాలిటీ కంటెంట్ లభించేందుకు దోహదం చేస్తుంది. ఇక జులై 19న ఓటీటీలో కొన్ని అద్భుతమైన చిత్రాలు, సిరీస్లు స్ట్రీమ్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి. అవేమిటో చూద్దాం..

పృథ్విరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన సర్వైవల్ థ్రిల్లర్ గోట్ లైఫ్. వాస్తవ సంఘటనల ఆధారంగా గోట్ లైఫ్ తెరకెక్కింది. దర్శకుడు బ్లేస్సీ 16 ఏళ్ల కృషి ఈ చిత్రం. పృథ్విరాజ్ ఈ పాత్ర చేయడానికి చాలా కష్టపడ్డాడు. ఏకంగా నాలుగు నెలల తర్వాత గోట్ లైఫ్ ఓటీటీలోకి రావడం విశేషం. జులై 19 నుండి నెట్ఫ్లిక్స్ లో గోట్ లైఫ్ స్ట్రీమ్ అవుతుంది. సౌదీ అరేబియా వెళ్లి బానిసగా మారి, దుర్భర జీవితం అనుభవించిన కేరళ వ్యక్తి కథే గోట్ లైఫ్.

సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ హరోం హర. కొత్త దర్శకుడు జ్ఞాన సాగర ద్వారక తెరకెక్కించాడు. మాళవిక శర్మ హీరోయిన్. జూన్ 14న విడుదలైన హరోం హర ఆశించిన స్థాయిలో ఆడలేదు. హరోం హర థియేట్రికల్ రన్ ముగిసింది. విడుదలై నాలుగు వారాలు గడుస్తుంది. ఈ క్రమంలో డిజిటల్ స్ట్రీమింగ్ కి సిద్ధమైంది. జులై 19 నుంచి ఈటీవీ విన్, ఆహాలో స్ట్రీమ్ కానుంది.

80లలో చిత్తూరు జిల్లా కుప్పంకి ఉద్యోగం కోసం వచ్చిన హీరో, డబ్బుల కోసం గన్ మాఫియాతో చేతులు కలుపుతాడు. ఈ క్రమంలో ఏర్పడిన పర్యవసానాల సమాహారమే హరోం హర మూవీ.

తెలుగు అమ్మాయి అంజలి విలక్షణమైన పాత్రలు చేస్తూ ముందుకు వెళుతుంది. ఇటీవల విడుదలైన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రంలో ఆమె ఓ ఛాలెంజింగ్ రోల్ చేసింది. అంజలి ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం బహిష్కరణ. ఈ మూవీ నేరుగా ఓటీటీ విడుదలకు సిద్ధం అయ్యింది. రివేంజ్ థ్రిల్లింగ్ డ్రామాగా తెరకెక్కిన బహిష్కరణ మూవీ జులై 19 నుండి జీ 5లో స్ట్రీమ్ అవుతుంది. అంజలి లుక్ ఆకట్టుకుంది.

భిన్నమైన కంటెంట్ కి మలయాళ చిత్రాలు చాలా ఫేమస్. అలాంటి ఓ విలక్షణమైన సబ్జెక్టు తో తెరకెక్కిన సిరీస్ నాగేంద్రన్స్ హనీమూన్స్. డార్క్ కామెడీ జోనర్లో ఈ సిరీస్ తెరకెక్కింది. డ్రైవింగ్ లైసెన్స్ ఫేమ్ సూరజ్ వెంజరమూడు ప్రధాన పాత్ర చేశాడు. ఈ సిరీస్లో హీరో ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకుంటాడు. వివిధ మతాలకు చెందిన ఐదుగురు అమ్మాయిలను పెళ్లి చేసుకుంటాడు. అసలు నాగేంద్రన్(సూరజ్)వరుస పెళ్లిళ్లు చేసుకోవడం వెనుక కారణం ఏమిటనేది సిరీస్ చూసి తెలుసుకోవాలి.

నాగేంద్రన్స్ హనిమూన్స్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో జులై 19 నుండి అందుబాటులోకి రానుంది. మలయాళంతో పాటు తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ భాషల్లో విడుదల చేస్తున్నారు. వీటితో పాటు ఇంట్రెస్టింగ్ సిరీస్లు, సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి.