Viral Video: ఇదేం వీడియో రా నాయనా.. జున్ను మీద ఇంత కామెడీ నా.. నవ్వీ నవ్వీ పొట్టలు పగులుతున్నాయి..

రాయలసీమ యాసకు ప్రత్యేక పేరుంది. చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలు రాయలసీమ ప్రాంతాలుగా పేరుపొందాయి. అయితే ఈ నాలుగు జిల్లాల్లో వేటికవే సొంత భాషా సొగసును కలిగి ఉన్నాయి.. ఇక యాస గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అదే చిత్తూరు జిల్లా చెందిన కొంతమంది ఒక చిన్న కాన్సెప్ట్ తో వీడియో రూపొందించారు.

Written By: Anabothula Bhaskar, Updated On : July 19, 2024 8:22 am
Follow us on

Viral Video: క్రియేటివిటీ.. పేరుకు ఐదు పదాలు మాత్రమే.. ఇది ఉన్నవాళ్లు ఎక్కడికో వెళ్లిపోయారు.. అకిరా కురసోవా, క్రిస్టోఫర్ నోలన్, జేమ్స్ కామెరూన్, దాసరి నారాయణరావు, ఎస్ఎస్ రాజమౌళి.. ఇలా చెప్పుకుంటూ పోతే జాబితా చాలా పెద్దది. వీళ్లంతా కూడా తమలో ఉన్న క్రియేటివిటీని బయటి ప్రపంచానికి తెలియజేశారు. అందువల్లే జనం గుండెల్లో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. అయితే రానూ రానూ క్రియేటివిటీ అనేది కట్ అండ్ పేస్ట్ లాగా మారిపోతుంది. రొడ్డ కొట్టుడు అనేది ట్రేడ్ మార్క్ లాగా మారిపోయింది. ఇలాంటి సమయంలో సోషల్ మీడియా వెలుగులోకి రావడం.. అందులో రకరకాల సామాజిక మాధ్యమాలు అందుబాటులోకి రావడంతో సామాన్యుల్లో ఉన్న క్రియేటివిటీ వెలుగులోకి వస్తోంది. దీనికి స్థానిక యాస కూడా తోడు కావడంతో అది మరింత ఆకట్టుకుంటున్నది. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న వీడియో.. ఇప్పటికే మిలియన్ వ్యూస్ నమోదు చేసింది. ఈ వీడియో చూసి 27,000 మంది పాజిటివ్ గా కామెంట్స్ చేశారు. ఇంతకీ ఇందులో ఏముందంటే..

రాయలసీమ యాసలో..

రాయలసీమ యాసకు ప్రత్యేక పేరుంది. చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలు రాయలసీమ ప్రాంతాలుగా పేరుపొందాయి. అయితే ఈ నాలుగు జిల్లాల్లో వేటికవే సొంత భాషా సొగసును కలిగి ఉన్నాయి.. ఇక యాస గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అదే చిత్తూరు జిల్లా చెందిన కొంతమంది ఒక చిన్న కాన్సెప్ట్ తో వీడియో రూపొందించారు. ఓ బర్రెల కాపరి దగ్గరికి ఇద్దరు వ్యక్తులు వస్తారు. వారు అతనికి ఒక చిన్న ప్యాకెట్ లో భద్రపరిచిన జున్ను అందిస్తారు. దాన్ని అతడు తింటాడు. రుచిగా ఉందని చెబుతాడు. దానికి వారు కృతజ్ఞతలు తెలియజేస్తారు. అనంతరం వారు ముగ్గురు పిచ్చా పాటిగా మాట్లాడుకుంటారు. ఈ సందర్భంగా జున్ను గురించి చర్చ వస్తుంది.. అయితే ఆ జున్ను తిన్న వ్యక్తి.. అది గేదె పాల ద్వారా చేసిందని అనుకుంటాడు. కానీ ఇచ్చిన వ్యక్తులు అతడికి షాకింగ్ నిజం చెబుతారు. అది పందిపాలతో చేసిందని… అందుకే అంత రుచిగా ఉందని అంటారు. దీంతో ఆ జున్ను తిన్న వ్యక్తి ఒక్కసారిగా షాక్ కు గురవుతాడు. వాంతి చేసుకునేందుకు ప్రయత్నిస్తాడు.

నవ్వులు పూయించారు

ఈ వీడియో ఈ స్థాయిలో ఆదరణ పొందడానికి ప్రధాన కారణం.. వారి ముగ్గురి మధ్య సహజమైన సంభాషణ. కేవలం ఒక జున్ను అనే టాపిక్ మీద ఈ స్థాయిలో రక్తి కట్టించడం.. ఎటువంటి ద్వంద్వార్ధాలు లేవు. వెకిలి కామెడీ అసలు లేదు. రాయలసీమ యాస వారి ముగ్గురిలో అణువణువూ కనిపించింది. ముగ్గురు తిట్టుకుంటున్నట్టే ఉన్నా ఎక్కడ కూడా బూతు అనే పదం వినిపించదు. కొంచెం కూడా విసుగురాదు. చూస్తున్నంత సేపు నవ్వొస్తుంది. తర్వాత ఏం జరుగుతుందనే ఉత్సుకత కలుగుతుంది.. ఈ వీడియో నిడివి 15 నిమిషాలు మాత్రమే ఉన్నప్పటికీ.. చూస్తున్నంత సేపు ఆసక్తిగా అనిపిస్తుంది. వీడియో అయిపోయిన తర్వాత.. అయ్యో అప్పుడే ముగిసిందా అనిపిస్తోంది. ఇంత హాస్య స్పోరకంగా ఉంది కాబట్టే.. ఈ వీడియో మిలియన్ వ్యూస్ నమోదు చేసుకుంది. క్రియేటివిటీ అనేది ఎవరి సొంతం కాదని.. దానిని ప్రదర్శించే వేదిక దొరికితే అద్భుతాలు చేయవచ్చని.. దీని రూపకర్తలు మరోసారి నిరూపించారు. సరదా మాటలతో.. ప్రకృతి మధ్యలో.. నవ్వుకునే విధంగా వీడియోను రూపొందించారు. వారిలో ఉన్న సింప్లిసిటీ నే జనానికి బాగా నచ్చింది. ఈ వీడియోను పాపులర్ చేసింది.