Tollywood Heroes: టాలీవుడ్ నెంబర్ వన్ హీరో ఇతనే.. టాప్ 10 జాబితా ఇదే..

ప్రస్తుతం థియేటర్లలో ‘కల్కి ఏడీ 2898’ మూవీ హవా సాగిస్తోంది. ఈ సినిమాలో నటించిన ప్రభాస్ కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. గతంలోనూ ప్రభాస్ బాహుబలిలో నటించి వరల్డ్ లెవల్లో తెలుగు సినిమా ఖ్యాతిని చాటాడు. ఇప్పుప్పుడు కల్కితో మరోసారి రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు. ఈ సినిమా ఇటీవలే 1000 కోట్ల క్లబ్ లో చేరింది.

Written By: Chai Muchhata, Updated On : July 19, 2024 8:46 am

Tollywood Heroes

Follow us on

Tollywood Heroes: టాలీవుడ్ ఇండస్ట్రీలో నిత్యం కొత్త కొత్త హీరోలు వస్తుంటారు. కానీ ఒకప్పుడు పరిశ్రమలోకి అడుగుపెట్టిన వారు ఇప్పటికీ సినిమాల్లో కొనసాగుతూ టాప్ టెన్ రేటింగ్ లో కొనసాగుతున్నాయి. తెలుగు సినిమా పేరు చెప్పగానే ముందుగా గుర్తుకు వచ్చేది ఎన్టీఆర్. ఆ తరువాత మెగాస్టార్ చిరంజీవి గురించి చెప్పుకుంటాం. మూడో తరంలో చాలా మంది హీరోలు పోటీ పడుతూ ఒకరికంటే మరొకరు పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్నారు. దీంతో నెంబర్ వన్ స్థానంలో ఎవరూ ఎక్కువ కాలం కొనసాగలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఓ సంస్థ తెలుగు హీరోలకు ర్యాంకింగ్ ప్రకటించింది. టాప్ 10 హీరోలు వీరే అని తేల్చింది. దీనిపై ఆసక్తిగా చర్చ సాగుతోంది. ఇంతకీ టాప్ 1 నుంచి 10 వరకు ఉన్న హీరోలు ఎవరో చూద్దాం..

Also Read: ఐదుగురు భార్యలతో శోభనం, ఓటీటీలో సెన్సేషనల్ సిరీస్… ఈవారం స్ట్రీమ్ అవుతున్న చిత్రాలు/సిరీస్ల లిస్ట్!

ప్రస్తుతం థియేటర్లలో ‘కల్కి ఏడీ 2898’ మూవీ హవా సాగిస్తోంది. ఈ సినిమాలో నటించిన ప్రభాస్ కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. గతంలోనూ ప్రభాస్ బాహుబలిలో నటించి వరల్డ్ లెవల్లో తెలుగు సినిమా ఖ్యాతిని చాటాడు. ఇప్పుప్పుడు కల్కితో మరోసారి రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు. ఈ సినిమా ఇటీవలే 1000 కోట్ల క్లబ్ లో చేరింది. దీంతో ప్రభాస్ రేంజ్ పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ నెంబర్ వన్ హీరో ప్రభాస్ అని పేర్కొంటున్నారు.

నందమూరి వంశం నుంచి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ సైతం ప్రత్యేక సినిమాల్లోనే నటిస్తున్నాడు. ఆయన చివరిసారిగా రాజమౌళి డైరెక్షన్లో ఆర్ఆర్ఆర్ లో నటించి స్పెషల్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇది పాన్ ఇండియా మూవీ అని ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లను బట్టి తెలుస్తోంది. దీంతో జూనియర్ ఎన్టీఆర్ కు టాప్ 2 ర్యాంకింగ్ ఇచ్చారు.

సూపర్ స్టార్ నటించిన మహేష్ బాబు నటించిన లాస్ట్ మూవీ ‘గుంటూరు కారం’. ఈ మూవీ పెద్దగా ఆకట్టుకోకపోయినా మహేష్ కు ఉన్న క్రేజ్ తగ్గలేదు. ఎందుకంటే ప్రస్తుతం రాజమౌళి తో కలిసి మహేష్ నటిస్తున్న విషయం తెలిసిందే. దీంతో మహేష్ బాబుకు టాప్ 3 ర్యాంక్ ఇచ్చారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’తో పాన్ ఇండియా హీరో అయిపోయాడు. ఇప్పుడు బన్నీ సినిమా కోసం తెలుగుఫ్యాన్స్ మాత్రమే కాకుండా ఇతర ఇండస్ట్రీ నుంచి ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అతనికి ఉన్న ఆదరణ ఆధారంగా అల్లు అర్జున్ కు టాప్ 4 ర్యాంక్ ఇచ్చారు.

మెగా హీరో రామ్ చరణ్ సైతం ఆర్ఆర్ఆర్ లో నటించిన విషయం తెలిసిందే. ఇందులో అల్లుూరి సీతారామారాజు పాత్రతో అలరించాడు. ఇప్పుడు సౌత్ డైరెక్టర్ శంకర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు రిలీజ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రామ్ చరన్ కు టాప్ 5 లో చోటు దక్కింది.

ఓ వైపు రాజకీయాలు..మరోవైపు సినిమాల్లో కొనసాగిస్తున్నా.. పవన్ కల్యాణ్ కు టాప్ 6 రేటింగ్ ఇచ్చారు. ఆయన నటిస్తున్న ఓడీ త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది.

దసరా, హాయ్ నాన్న సినిమాలో ఆకట్టుకున్న నాని కి టాప్ 7 ర్యాంక్ ఇచ్చారు.

ప్రస్తుతం సినిమాల్లో పెద్దగా కనిపించకపోయినా మాస్ మహరాజ్ రవితేజకు టాప్ 8 ర్యాంకు వచ్చింది.

మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’తో బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో అతనికి టాప్ 9లో చోటు దక్కింది.

విజయ్ దేవరకొండకు వరుస ప్లాపుల బెడద చుట్టుకుంది. అయినా ఫ్యాన్ష్ లో ఆయన క్రేజ్ తగ్గలేదు. ఇటీవల రిలీజ్ అయిన కల్కిలో అర్జున పాత్రలో దేవరకొండ అలరించారు. ఈ నేపథ్యంలో అతనికి టాప్ 10 లో చోటు దక్కింది.

 

Also Read: నాగ్ అశ్విన్, సందీప్ వంగ, హను రాఘవపూడి లు ఏ డైరెక్టర్స్ దగ్గర అసిస్టెంట్స్ గా పనిచేశారో తెలుసా..?