Bad Newz USA Review: ‘బ్యాడ్ న్యూజ్’ మూవీ యూఎస్ఏ రివ్యూ…

'బ్యాడ్ న్యూజ్' అనే సినిమా ఇండియా లో రేపు రిలీజ్ అవుతుండగా, ఇప్పటికే యూఎస్ఏ లో ఈ సినిమాకు సంభందించిన ప్రీమియర్స్ అయితే స్టార్ట్ చేశారు...అసలు ఆ సినిమా ఎలా ఉంది అక్కడి ప్రేక్షకులు ఈ సినిమాను ఎలా రిసీవ్ చేసుకున్నారు అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం...

Written By: Gopi, Updated On : July 18, 2024 6:51 pm

Bad Newz USA Review

Follow us on

Bad Newz USA Review: బాలీవుడ్ ఇండస్ట్రీలో గత కొన్ని రోజుల నుంచి ఎలాంటి సక్సెస్ ఫుల్ సినిమాలు అయితే రావడం లేదు. ఇక అందులో భాగంగానే ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలు వచ్చినప్పటికీ అవి ఆశించిన మేరకు విజయాన్ని అయితే అందుకోవడం లేదు. ఇక రీసెంట్ గా అక్షయ్ కుమార్ హీరోగా సర్ఫారీ అనే సినిమా వచ్చింది. అయినప్పటికీ అది ఆశించిన విజయం సాధించలేదు. దాంతో బాలీవుడ్ ఇండస్ట్రీ లో ఉన్న మేకర్స్ మరోసారి ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే ‘అనిమల్ ‘ సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటి త్రిప్తి డిమ్రి…

ఇక ఈమె కీలక పాత్రలో నటిస్తు వస్తున్న ‘బ్యాడ్ న్యూజ్’ అనే సినిమా ఇండియా లో రేపు రిలీజ్ అవుతుండగా, ఇప్పటికే యూఎస్ఏ లో ఈ సినిమాకు సంభందించిన ప్రీమియర్స్ అయితే స్టార్ట్ చేశారు…అసలు ఆ సినిమా ఎలా ఉంది అక్కడి ప్రేక్షకులు ఈ సినిమాను ఎలా రిసీవ్ చేసుకున్నారు అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

కథ

ఇక ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే సలోని బగ్గ (త్రిప్తి డిమ్రి) ఒకే రోజు ఇద్దరు మగాళ్ళతో కలిసి ఉంటుంది. అందులో ఒకరు అఖిల్ చద్దా (విక్కి కౌశల్) కాగా, మరొకరు (ఆమీ విర్క్) ఇక తను విల్లిద్దరితో శృంగారం లో పాల్గొంటుంది. ఇక ఇది జరిగిన కొన్ని రోజులకు ఆమె గర్భవతి అవుతుంది. దాంతో హాస్పిటల్ కి వెళ్ళిన సలోనికి డాక్టర్లు టెస్ట్ లు చేసి ఆమె కడుపులో కవల పిల్లలు ఉన్నారని చెప్తుంది. ఇక దాంతో సలోని ఇద్దరి పురుషుల ద్వారా ఇద్దరు పిల్లలు పుడుతున్నారు. ఇక ఇందుకు కారణం హెటొరో పెరంటల్ సూపర్ ఫేకండేషన్ అనే అరుదైన ప్రక్రియ ద్వారా ఇలా జరుగుతుందని అందరిక్ చెప్తుంది…

మరి తను అనుకున్నట్టుగానే కవల పిల్లల్లో ఒకరు ఒక వ్యక్తికి మరొకరు మరొక వ్యక్తికి పుట్టే అవకాశం ఉందా? మరి ఎందుకు ఆమె ఒకేసారి ఇద్దరితో పిల్లల్ని కనాల్సి వచ్చింది అనే విషయాలు తెలియాలంటే ఈ సినిమాని చూడాల్సిందే అని ఈ సినిమా ప్రీమియర్స్ ని చూసిన ప్రేక్షకులు తెలియజేస్తున్నారు…

విశ్లేషణ

ఇక ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే మొదట ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు ఇది ఒక బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కిన సినిమా అనే విషయం అయితే మనందరికీ చాలా స్పష్టంగా అర్థం అవుతుంది. ఇక దానికి ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా మొత్తం బోల్డ్ కంటెంట్ తోనే తెరకెక్కింది. అయినప్పటికీ ఈ సినిమాలో మంచి ఎమోషన్ అయితే ఉంది. దాన్ని వర్కౌట్ చేయడంలో దర్శకుడు కొంతవరకు సక్సెస్ అయ్యాడనే చెబుతున్నారు. ఇక దర్శకుడు ఎంచుకున్న ప్లాట్ పాయింట్ బాగున్నప్పటికీ దాన్ని సినిమాగా తెరకెక్కించే క్రమంలో 60% మాత్రమే సక్సెస్ అయ్యాడని మిగతా 40% మాత్రం ఆయనకి ఎదురైన కన్ఫ్యూజన్స్ ని అధిగమించలేకపోయాడంటూ ప్రేక్షకులు వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు…

ఇక డైరెక్టర్ ‘ఆనంద్ తివారి’ త్రిప్తి డిమ్రి ని మాత్రం చాలా అద్భుతంగా చూపించాడట ఆమె పాత్రను డిజైన్ చేసిన విధానం కూడా చాలా ఎక్స్ట్రాడినరీ గా ఉందంటూ ఆ పాత్రలో ఆమె తప్ప మరొకరిని ఊహించుకోలేకపోతున్నాం అంటూ ఈ చూసిన ప్రేక్షకులు చెప్పడం విశేషం…

ఇక ఈ సినిమాలో ఉండే కోర్ ఎమోషన్ బాగా వర్క్ అయినప్పటికీ సినిమాలో కొన్ని కన్ఫ్యూజన్స్ అయితే ఏర్పడ్డాయట. అసలు ఇద్దరు వ్యక్తుల ద్వారా ఇద్దరు పిల్లల్ని కి ఏకకాలంలో కనవచ్చా అనే విషయాన్ని సరైన క్లారిటీతో తెలియజేయలేకపోయారు అనే అభిప్రాయాన్ని అక్కడి ప్రేక్షకులు తెలియజేస్తున్నారు…

ఆర్టిస్టుల పర్ఫామెన్స్

ఇక ఈ సినిమాలో నటించిన నటీనటులు వాళ్ళ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు. ముఖ్యంగా త్రిప్తి డిమ్రి మాత్రం సినిమా మొత్తాన్ని తన భుజాల మీద మోసుకెళ్లిందనే చెప్పాలి. ఇక తన పర్ఫామెన్స్ గాని, తన అందాల ఆరబోతగాని సినిమా చూసే ప్రతి ప్రేక్షకుడికి బాగా నచ్చుతుందట. అనిమల్ సినిమాలో ఎలాగైతే చేసిందో ఈ సినిమాలో అలాగే చేసిందట. ఈ తన అందాల ఆరబోతకు మాత్రం హద్దులు లేకుండా పోయాయంటూ ప్రతి ప్రేక్షకుడు త్రిప్తి డిమ్రి గురించి మాట్లాడుతున్నారు…
ఇక విక్కీ కౌశల్, ఆమీ విర్క్ చాలా మంచి పర్ఫామెన్స్ ఇచ్చారు. ఇక కొన్ని సీన్లలో మాత్రం త్రిప్తి డిమ్రి కి వీళ్ళు బాగా సపోర్ట్ చేశారనే చెప్పాలి. ఇక వీళ్ళ కాంబినేషన్ లో ఈ సినిమా అనేది బాగా వచ్చింది. ఇక మొత్తానికైతే ఆర్టిస్టులు కూడా నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాలని మిగిలిన ఆర్టిస్టులు అందరూ కూడా సినిమాను ఏదో ఒక రకంగా ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం అయితే చేశారట…

టెక్నికల్ అంశాలు

ఇక ఈ సినిమా టెక్నికల్ అంశాల విషయానికి వస్తే అను మాలిక్ మ్యూజిక్ కొంతవరకు ఓకే అనేలా ఉందట…అలాగే సినిమాటోగ్రఫీ చాలా బాగుందని కొన్ని షాట్స్ అయితే నెక్స్ట్ లెవల్లో తీశారనే చెబుతున్నారు…ఇక ఈ సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయని కూడా చెబుతున్నారు…

ప్లస్ పాయింట్స్

త్రిప్తి డిమ్రి యాక్టింగ్
విజువల్స్
కొన్ని ఎమోషనల్ సీన్స్

మైనస్ పాయింట్స్

కథ
కొన్ని లాజిక్ లేని సీన్స్

రేటింగ్
ఇక యూఎస్ఏ లో ఈ సినిమాకి వస్తున్న రెస్పాన్స్ ప్రకారం ఈ సినిమాకు మేమిచ్చే రేటింగ్ 2.5/5