Spirituality: ప్రతి పని మీద మనసు లగ్నం చేస్తేనే విజయవంతం అవుతుంది. అదే చిత్తం శివుడి మీద, మనసు చెప్పుల మీద అనే సామెత తీరుగా ఉంటే.. ఏ పనీ విజయవంతం కాదు. పైగా అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతుంటాయి. వైఫల్యాలు పలకరిస్తుంటాయి. అందుకే చేసే పని పట్ల మనసు పెట్టాలి అంటారు పెద్దలు. మరి అది జరగాలంటే..
వాస్తవానికి మనసు అనేది మన్మధుడి తండ్రి. మన్మధుడు అనేవాడు చిత్త స్వభావుడు. అంటే ఒక చోట స్థిరంగా ఉండడు. పైగా సకల కోరికలకు అతడే కారణం. మోహం, కామం, క్రోధం వంటి వాటికి మన్మధుడే కారణం.అలాంటివాడు శివుడి కుమారుడిని చంపుతాడు. అది శివుడికి కోపం తెప్పిస్తుంది. అలా శివుడు ఆ మన్మధుడిని సంహరిస్తాడు. తనను సంహరించడానే కోపంతోనే మన్మధుడు శివ పూజ మీద మనసు లగ్నం కాకుండా చేస్తాడు. అందుకే చాలామంది శివపురాణాలను పూర్తిగా చదవలేరు. శివ పూజ పై పూర్తిగా మనసు పెట్టలేరు. ఇలాంటి పరిణామాల వల్లే చిత్తం శివుడి మీద, మనసు చెప్పుల మీద అనే నానుడి పుట్టింది.
ఆవుల కొట్లాటలో దూడల కాళ్ళు విరిగినట్టు.. ఇద్దరు దేవుళ్ళ మధ్య పోట్లాట వల్ల తమన ఇబ్బంది పెట్టకండని మనుషులు అటు మన్మధుడిని, ఇటు శివుడిని వేడుకున్నారట. దానికి మన్మధుడు స్పందించకపోగా.. శివుడు భక్తులకు వరం ఇచ్చాడట.. “మన్మధుడు ఎలాగా మనసు లగ్నం చేయనివ్వడు. మీరు కన్ను మూసి పైకి వచ్చిన తర్వాత.. మీ ఆత్మకు భద్రత నాది అంటూ” హామీ ఇచ్చాడట.
ఇలా మనసు శివుడి మీద, చేసే పనిమీద లగ్నం కావాలంటే కచ్చితంగా శివపురాణం చదవాలట. ఒకటి, రెండు కాకుండా మొత్తం పద్యాలన్నీ వల్లె వెయ్యాలట. అప్పుడే మనసు మన అదుపు ఆజ్ఞలో ఉంటుందట. చేసే పని మీద ఆసక్తి కలుగుతుందట. పైగా చేసిన తప్పుల నుంచి శివుడు కాపాడుతాడట.. ఇవి మాత్రమే కాదు మానసికంగా ప్రశాంతత లభిస్తుందట. చేసే పని మీద దృష్టి సారించడం వల్ల వ్యక్తిత్వం కూడా ఇనుమడిస్తుందట. అందుకే శివ పూజకు నోచని పుష్పం పుష్పం కాదు. శివుడి ఆరాధన చేయని మనిషి మనిషే కాదు..